సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..
Mangli New Private Album Song: సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన గాత్రంతో తెలుగులో హుషారైన పాటలతో అలరిస్తోంది. కేవలం సినిమా పాటలతోనే కాదు.. హుషారెత్తే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మరో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌తో అలరిస్తోంది మంగ్లీ.
Mangli New Song: ప్రముఖ జానపద గాయని మాంగ్లీ తనదైన గాత్రంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు. తెలుగులో ఎన్నో సినిమా పాటలు అలరించాయి. కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు.. బోనాలు, మహా శివరాత్రి, దసరా, బతుకమ్మ పాటలతో అలరించింది. ఆమె పాటకు ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఈమె వార్నర్ మ్యూజిక్ ఇండియా రూపొందిస్తున్న ‘మాటి సీజన్ 2’లో భాగంగా ‘పోడా ఓ చందు’ అనే కొత్త తెలుగు జానపద గీతాన్ని పాడటంతో పాటు నటంచి మెప్పించారు. ప్రేమలోని చిలిపితనం, ఆకర్షణ, మధురమైన అనుభూతులను ఈ పాటలో అందంగా తెరపై చూపించిన విధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా,జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్, స్థానిక వాయిద్యాలు, వేణువు, ఈలలతో పాటకు ప్రత్యేకమైన జానపద శోభను తీసుకొచ్చారు. మాంగ్లీ ఉత్సాహభరితమైన గాత్రం, ఆకట్టుకునే నృత్యరీతులు, కలర్‌ఫుల్ దృష్యాలతో ఈ వీడియో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా మాంగ్లీ మాట్లాడుతూ.. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోసిందని కొనియాడారు. సురేష్ బొబ్బిలితో కలిసి పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందన్నారు. ఈ పాట దీపావళి పండుగ వేళ ప్రేక్షకులను ఉత్సాహంగా నృత్యం చేసేలా చేస్తుందని చెప్పుకొచ్చారు.
ప్రాంతీయ జానపద సంగీతంలోని సహజత్వాన్ని కాపాడుతూ ఉత్సాహభరితమైన బాణీని అందించినట్టు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తెలిపారు. ఈ పాట ప్రస్తుతం ప్రముఖ ఆడియో, వీడియో స్ట్రీమింగ్ దూసుకుపోతుంది.