అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టిన ‘మయూఖ’ మూవీ ఎలా ఉందంటే..
Mayookha Review: పాయల్ చెంగప్ప టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మయూఖ’. శ్రీ తేజ్ ఎస్.కె. డైరెక్ట్ చేశారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..మయూఖ (పాయల్ చెంగప్ప) ఓ బ్యాంక్ ఉద్యోగిని. తను అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్లో రాత్రి సమయంలో ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను భయపెడుతున్నట్టు ఊహించుకుంటుంది. దీంతో మయూఖ తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వేరే అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్ అవుతుంది. అసలు మయూఖను రాత్రి భయపెడుతున్న ఆ వ్యక్తి ఎవరు..? మరోవైపు నగరంలో ఓ సైకో.. మహిళలను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపుతుంటాడు. అది కూడా మనిషిని పార్టులు పార్టులుగా నరికి చంపేస్తుంటాడు. ఆ మర్డర్స్‌కు మయూఖకు ఉన్న లింక్ ఏమిటి..? రాత్రి సమయంలో తనను వెంటాడుతున్న ఆ వ్యక్తి .. సైకో ఒకడేనా ? చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెలుగు సహా ఇతర భాషల్లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రమే ‘మయూఖ’. ముఖ్యంగా గౌతమ్ మీనన్ తరహా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌ను ఓ అజ్ఞాత వ్యక్తి వెంటాడుతుంటాడు. మరోవైపు నగరంలో వరస మర్డర్లు.. సాధారణంగా సినిమా చూసే వాళ్లకు అక్కడ ప్రతి క్యారెక్టర్ పై అనుమానం పుట్టేలా చేస్తాడు. చివరకు కథాయికకు సంబంధించిన అతి కీలక వ్యక్తే ఈ మర్డర్స్ చేస్తుంటాడని తెలుస్తుంది. ఆ సైకోకు ఓ ఫ్లాష్ బ్యాక్. చివరకు అతన్ని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చసి పట్టుకున్నారనే అంశాన్ని దర్శకుడు మలిచిన విధానం ఓకే. కానీ సినిమా ప్రథమార్ధంలో ఒకే తరహా సీన్స్ రిపీట్ చేసినట్టు వస్తుంటాయి. మధ్యలో బ్యాంకులో ఆమె టార్గెట్లు. ఈ క్రమంలో బ్యాంకు వచ్చే కస్టమర్లకు రకరకాల పాలసీలు అంటకట్టడం వంటివి చూపించే ప్రయత్నం చేశాడు.
అక్కడ ఓ బ్యాంకు కస్టమర్ .. హీరోయిన్ ను లవ్ చేస్తున్నట్టు ప్రపోజ్ చేయడంతో పాటు కాఫీకి రమ్మని చెబుతాడు. మరోవైపు హీరోయిన్ ఉండే అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఇలా ఇలా రకరకాల వ్యక్తులపై అనుమానం వచ్చేలా చేస్తాడు. చివరకు ఆ మర్డర్స్ చేస్తోన్న సైకో ఓ ఆడదని హీరోయిన్‌కు పోలీసులకు చెబుతుంది. ఈ క్రమంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో సైకో ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. అది ఏమంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఆ సైకోకు విచిత్రమైన రోగం ఉంటుంది. ఏ వాసన గుర్తు పట్టడు.కేవలం రక్తం వాసనే గుర్తు పడతాడు.దాంతో ఆడవాళ్లు సంబంధించిన రక్తంతో పాటు ఓ తరహా పర్ఫ్యూమ్ చేస్తుంటాడనే కాన్సెప్ట్ దర్శకుడు రాసుకున్నాడు. సైకోగా మారిన వ్యక్తికి కథానాయికకు ఓ సంబంధం ఉన్నట్టు చూపించాడు. మరోవైపు సైకో మారిన సమాజంలో ఉన్నత హోదా ఎలా పొందాడనే లాజిక్‌కు అడక్కూడదు. ఏది ఏమైనా చివర్లో సైకోను హీరోయిన్ హత్య చేయడం.. అంతేకాదు చివర్లో ఓ లీడ్ ఇచ్చి సెకండ్ పార్ట్ ఉన్నట్టు చెప్పడంతో ముగించాడు.
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువులు బాగున్నాయి. ఉన్నంతో కొన్ని పరిమత ప్రదేశాల్లో చిత్రీకరించాడు. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్‌కు బ్యాక్ గ్రౌండ్ ఇంపార్టెంట్. ఆ విషయంలో సిబీ మాథ్యూ అలెక్స్ ఇచ్చిన ఆర్ఆర్ బాగుంది. ఈ సినిమాను తక్కువ నిడివితో తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉన్నా.. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ లాజిక్‌కు అందవు. ఓవరాల్‌గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ఈ సినిమా చూడొచ్చు.
నటీనటుల విషయానికొస్తే..
మయూఖగా టైటిల్ రోల్ పోషించిన పాయల్ చెంగప్ప క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. భయం, బిడియం ఉన్న ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన యాక్ట్రెస్ మంచి నటనే కనబరిచింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన దేవ్ శశాంక్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. మురళీధర్ గౌడ్ సైకో తండ్రి పాత్రలో కాసేపు కనిపించి అరించాడు. సైకో పాత్రలో నటించిన నటుడు ఇతర తారాగణం తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘మయూఖ’.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్..
రేటింగ్: 2.75/5