స్టేట్మెంట్స్ తో సంచలనం.. రిలీజుల్లో గందరగోళం.. ఈ నిర్మాత స్టైలే వేరు..
Naga Vamsi Adarsha kutumbam Postponed: వరుస వాయిదాలు.. మీడియా ముందు ఓవర్ కాన్ఫిడెన్స్.. అసలు కథేంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పేరు నాగవంశీ. మంచి సినిమాలు నిర్మించిన నిర్మాతగా ఆయనకు క్రెడిట్ ఉంది. కానీ.. ఇటీవలి కాలంలో సినిమాల కంటే ఆయన చేసే కామెంట్సే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Why Naga Vamsi movies Postponed: ఒక సినిమా అనౌన్స్ చేస్తారు.. భారీ అంచనాలు క్రియేట్ చేస్తారు.. రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.. ఆ తర్వాత ఏదో ఒక కారణంతో వాయిదా పడుతుంది. మళ్లీ కొత్త డేట్.. మళ్లీ కొత్త ప్రమోషన్.. ఇలా ఒక సినిమాకు సంబంధించి రిలీజ్ కంటే ముందే ఎన్నో అప్‌డేట్స్ రావడం కామన్‌గా మారిపోయింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. సినిమా మాట్లాడాలా..? నిర్మాత మాట్లాడాలా..?
నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్..
నాగవంశీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ తన సినిమాలపై భారీ కాన్ఫిడెన్స్ చూపిస్తుంటారు. సినిమా ఎలా ఉండబోతుంది, ఎంత పెద్ద విజయం సాధిస్తుంది, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుంది అనే రేంజ్‌లో కామెంట్స్ చేస్తుంటారు.అయితే ఆ స్థాయిలో అంచనాలు పెంచిన తర్వాత.. సినిమా విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా సహజంగానే చర్చ మొదలవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ ముగుస్తుంది?
ఓవర్ ప్రమోషన్..
ఓవర్ ప్రమోషన్ ఎక్కడ మొదలవుతుంది?అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు మాట్లాడుకుంటున్న అంశం. మరోవైపు సినిమా వాయిదాల విషయంలో కూడా నాగవంశీ నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారీ సినిమాలకు డేట్స్ విషయంలో అనేక లెక్కలు ఉంటాయి.. పరిస్థితులు మారుతాయి.. వాయిదాలు తప్పనిసరి కావచ్చు. కానీ ప్రేక్షకులకు పదే పదే ఒక రిలీజ్ డేట్ చెప్పి, ఆ తర్వాత మార్చాల్సి వస్తే.. సహజంగానే అసహనం వ్యక్తమవుతుంది.
ఇక మీడియా విషయానికి వస్తే.. నాగవంశీ బైట్ అంటేనే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఏ సినిమా గురించి ఏం మాట్లాడతారు?
ఎవరిపై ఎలాంటి కామెంట్ చేస్తారు? తన సినిమాపై ఎంత పెద్ద స్టేట్‌మెంట్ ఇస్తారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది. నిర్మాతగా తన సినిమాల గురించి మాట్లాడటం తప్పు కాదు. తన ప్రాజెక్ట్‌పై కాన్ఫిడెన్స్ ఉండటం కూడా తప్పు కాదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ అతిగా కనిపించినప్పుడు.. అది ఓవర్ యాక్షన్‌గా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి.
అసలు ఒక నిర్మాతకు కావాల్సింది ఏంటి? మాటల్లో భారీ హైప్ కాదు.. కంటెంట్‌లో బలం.మీడియా ముందు స్టేట్‌మెంట్లు కాదు.. బాక్సాఫీస్ దగ్గర ఫలితం.నాగవంశీ నిర్మాణ సంస్థ నుంచి మంచి సినిమాలు వచ్చిన మాట వాస్తవమే. అందుకే ఆయన నుంచి ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆశిస్తున్నారు. కానీ అదే సమయంలో.. ప్రతి సినిమాను భారీగా ప్రొజెక్ట్ చేయడం, రిలీజ్ డేట్స్‌పై అనిశ్చితి, మీడియా ముందు చేసే స్ట్రాంగ్ కామెంట్స్.. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఆయన చుట్టూ మరో రకమైన ఇమేజ్‌ను కూడా క్రియేట్ చేస్తున్నాయి.
నాగవంశీ టాలెంట్ పై ఎవరీకీ సందేహాలు లేవు..
చివరికి సినిమా మాట్లాడాల్సింది పోస్టర్ మీద కాదు.. థియేటర్‌లో. నాగవంశీకి ఉన్న నిర్మాణ సామర్థ్యంపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేకపోయినా.. ఇకపై మాటల కంటే సినిమాలు, హైప్ కంటే కంటెంట్, అనౌన్స్‌మెంట్స్ కంటే టైమ్‌కు రిలీజ్ మీద ఫోకస్ పెడితే ఆయనపై వస్తున్న ఈ విమర్శలకు కూడా చెక్ పడే అవకాశం ఉంది.ఎందుకంటే.. నిర్మాత ఎంత పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినా.. చివరి తీర్పు మాత్రం ప్రేక్షకుడిదే!