• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

Nana Patekar Telugu Movies: నానా పాటేకర్ రంగస్థల నటుడిగా వెండితెరపై ప్రవేశించి వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఈయనకు నటనతో పెట్టిన విద్య. ఈయనకు తెలుగు సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 08, 2026, 10:39 AM IST|Updated: Oct 08, 2026, 11:08 AM IST
joinshare
తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..
Image Credit: Nana Patekar Telugu Remades (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Giant Python Video: ఇదెక్కడి అరాచకం.. యువకుడిపై కొండ చిలువ దాడి.. మరీ ఆ స్పాట్ లో.!. వీడియో వైరల్..

Giant Python Video: ఇదెక్కడి అరాచకం.. యువకుడిపై కొండ చిలువ దాడి.. మరీ ఆ స్పాట్ లో.!. వీడియో వైరల్..

2

మోడీ, పవన్ సహా నానా పాటేకర్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం..

3

Amazon Layoffs: ఓ పక్క గ్రేట్ ఇండియా సేల్..మరో పక్క గ్రేట్ లేఆఫ్స్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోత!

4

అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు పిడుగులాంటి వార్త..ఓపీటీపై 70 వేల డాలర్ల ఫీజు ప్రతిపాదన..!!

5

Dussehra Holidays: ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు బిగ్ షాక్.. దసరా పండగ వేళ భారీగా చార్జీల పెంపు.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nana Patekar Movies Remade in Telugu: నానా పాటేకర్ ఈ  పేరు వింటే ఈయన చేసిన పాత్రలే కళ్ల ముందు కదులుతాయి. బాలీవుడ్‌లో వైవిధ్యమైన నటనతో ఎంతో మంది అభిమాన పాత్రుడయ్యారు. హిందీ, మరాఠీ చిత్రసీమలో ఈయన చేసిన క్యారెక్టర్స్‌లో మరో నటుడిని ఊహించుకోలేము. ఈ రోజు ఉదయం ఆయన అంతిమ శ్వాస విడిచారు. ఆయన వయసు 75. గోవాలో ఈ రోజు (అక్టోబర్ 8) తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్‌తో ఈ లోకాన్ని విడిచివెళ్లినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడిగా దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు తెలుగు సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈయన నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి.

‘క్రాంతి వీర్’ తెలుగులో ‘పుణ్యభూమి నా దేశం’.. 

1994లో మెహుల్ కుమార్ దర్శకత్వంలో ఈయన హీరోగా నటించిన ‘క్రాంతివీర్’ సినిమాను తెలుగులో మోహన్ బాబు హీరోగా ‘పుణ్యభూమి నా దేశం’ గా రీమేక్ చేశారు. ఈ సినిమాలోని నటనకు ఈయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. అందకు ముందు విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరిందా’లో అన్న పాత్రలోని నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. అటు ‘అగ్నిసాక్షి’లోని నటనకు కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.

‘టాక్సీ‌ నెం.9211’ తెలుగులో ‘గేమ్’..
ఇక మిలన్ లూథ్రియా దర్శకత్వంలో 2006లో ఈయన జాన్ అబ్రహం హీరోలుగా తెరకెక్కిన ‘టాక్సి నెంబర్ 9211’ సినిమాను తెలుగులో మోహన్ బాబు, మంచు విష్ణు హీరోలుగా ‘గేమ్’ పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమా అంతగా నడవలేదు.

యశ్వంత్ - సంచలనం..

ఇక 1997లో అనిల్ మట్టో దర్శకత్వంలో తెరకెక్కిన ‘యశ్వంత్’ సినిమాను ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ .. ప్రకాష్ రాజ్, రోజా హీరో, హీరోయిన్లుగా ‘సంచలనం’ పేరుతో రీమేక్ చేశారు.

నట సమ్రాట్ మూవీ తెలుగులో రంగమార్తాండ..

ఇక 2016లో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈయన కథానాయకుడిగా నటించిన మరాఠి చిత్రం ‘నట సమ్రాట్’  చిత్రాన్ని.. కృష్ణవంశీ తెలుగులో ప్రకాష్ రాజ్ హీరోగా ‘రంగమార్తండ’గా రీమేక్ చేశారు.

అంత:పురం - శక్తి

మరోవైపు కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన ‘అంత:పురం’ సినిమాను హిందీలో నానా పాటేకర్ చేశారు. తెలుగులో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను హిందీలో నానా పాటేకర్ చేశారు. జగపతి బాబు రోల్‌ను  షారుఖ్ ఖాన్ చేయడం విశేషం. తెలుగు నుంచి హిందీలో రీమేక్ అయిన ఒకే ఒక్క సినిమా ఇది.

కింగ్ - వెల్కమ్ 

ఇక నాగార్జున  ‘కింగ్’సినిమాలో శ్రీహరి పాత్రకు ‘వెల్కమ్’ సినిమాలో నానా పాటేకర్ చేసిన ఉదయ్ శెట్టి పాత్రను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించడం విశేషం. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Tollywood
Telugu Movie