Nana Patekar Death: అనుమానాస్పద మృతిగా కేసు.. నానాపాటేకర్ మరణంపై గోవా పోలీసుల కీలక నిర్ణయం.!.
Nana patekar death row: నానా పాటేకర్ అక్టోబర్ 8న గోవాలోని తన ఇంట్లో గుండెపోటుతో కుప్ప కూలీపోయారు. ఆతర్వాత సన్నిహితులు ఆయనను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గోవా ఆస్పత్రిలో ట్రిట్మెంట్ తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Actor Nana patekar death row in goa: ప్రముఖ నటుడు నానాపాటేకర్ ఇటీవల గోవాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఛాతీనొప్పితో తన ఇంటిలో కుప్పకూలీపోయిన ఆయనను సన్నిహితులు వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నానా పాటేకర్ కన్నుమూశారు. అయితే ఆయనకు వైద్యులు హర్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు సీపీఆర్ చేసినట్లు వెల్లడించారు. నానా పాటేకర్ తన ఇంట్లో కుప్పకూలిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరులేరు. అక్కడుండే కేర్ టెకర్ వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు.
దీంతో ఉదయం 4:20 గంటలకు నానా పటేకర్ ఇంటికి చేరుకుని ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వచ్చిన తర్వాత కూడా ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత సీపీఆర్ చేసిన కూడా లాభంలేకుండా పోయింది. దీంతో మణిపాల్ వైద్యులు ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
అయితే.. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. నానా పాటేకర్ తన ఆరోగ్యం బాగాలేదని అంతకు ఒకరోజు ముందు ఒక స్నేహితుడికి మెస్సెజ్ చేసినట్లు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసు రికార్డుల ప్రకారం, 76 ఏళ్ల నానాపటేకర్ ను.. డోనా పౌలాలోని ఓషన్ పార్క్‌లో ఉన్న ఆయన నివాసం నుంచి బాంబోలిమ్‌లోని మణిపాల్ ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డుకు తీసుకువచ్చేసరికే ఆయన మరణించారు.
ఈ విషయంపై తదుపరి విచారణ చేపట్టారు. నానా పటేకర్ మృతి ఘటనపై గోవా పోలీసులు అసహజ మరణం భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 194 కింద ఈ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి పీఎస్ఐ నితిన్ నాయక్ నేతృత్వం వహిస్తున్నారు. కేసువిచారణ దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
మరోవైపు నానాపాటేకర్ చివరగా.. అక్టోబర్ 4న గోవాలోని డోనా పౌలాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. సామ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారని తెలుస్తొంది. నానా పాటేకర్ మరణంతో మూవీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు రాజకీయ ప్రముఖులు సైతం తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.