SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nana Patekar Wife: ఐఐటీ ర్యాంకర్ నుంచి నటిగా.. నానా పటేకర్ భార్యతో హీరోయిన్ రష్మికకు ప్రత్యేక అనుబంధం..

Nana Patekar Death News: దిగ్గజ నటుడు నానా పటేకర్ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఈ రోజు తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత విశేషాలను తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. నానా పటేకర్ భార్య నీలకంటి పటేకర్ కూడా ఓ నటి కావడం గమనార్హం.

Written By Harish Darla
Published: Oct 08, 2026, 10:25 AM IST | Updated: Oct 08, 2026, 10:28 AM IST
Join

Nana Patekar Death News: నటుడు నానా పటేకర్ గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం సినీ ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా ఆయన భార్య నీలకంటి పటేకర్ వ్యక్తిగత విశేషాలు వెలుగులోకి వచ్చాయి. పూణేకు చెందిన నీలకంటి చిన్నతనం నుంచే చదువులో ఎంతో ప్రతిభ చూపి, ఐఐటీ ప్రవేశ పరీక్షలో ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సైన్స్ లేదా ఇంజనీరింగ్ రంగాల్లో నెలకు వేలల్లో ప్యాకేజీలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ, నాటకరంగం, నటనపై ఉన్న మమకారంతో థియేటర్ ఆర్టిస్ట్‌గానే స్థిరపడ్డారు.

అవార్డులు, నానా పటేకర్ తో వివాహం..
సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె మరాఠీ నాటకరంగంలో నీలకంటి పటేకర్ క్రియాశీలకంగా పనిచేశారు. 1973లో జరిగిన మహారాష్ట్ర స్టేట్ డ్రామా కాంపిటీషన్‌లో ఉత్తమ నటిగా 'గోల్డ్ మెడల్' కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 1989లో సచిన్ పిల్‌గాంకర్ దర్శకత్వం వహించిన 'ఆత్మవిశ్వాస్' చిత్రంలో అద్భుత నటనకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం నుండి "ఉత్తమ నటి" పురస్కారాన్ని అందుకున్నారు.

నాటకాల ద్వారానే నానా పటేకర్, నీలకంటిల మధ్య పరిచయం ఏర్పడి, 1978లో కేవలం రూ. 750 ఖర్చుతో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో వారి మొదటి కుమారుడు రెండున్నరేళ్ల వయసులోనే మరణించడం ఆ దంపతులను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత వారికి మల్హర్ పటేకర్ అనే కుమారుడు జన్మించాడు.

రష్మిక మందన్న చిత్రంతో రీ-ఎంట్రీ..
కుటుంబ బాధ్యతల కారణంగా చాలా ఏళ్లు నటనకు దూరంగా ఉన్న నీలకంటి, ఇటీవలే భారీ చారిత్రాత్మక చిత్రం 'ఛావా' ద్వారా మళ్లీ వెండితెరకు వచ్చారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నీలకంటి 'ధరావు' అనే కీలక పాత్రను పోషించారు. అయితే హీరోయిన్ రష్మికకు ఎలాంటి రిలేషన్ లేదు. కానీ, వారిద్దరూ కలిసి ఈ సినిమాలో నటించిన అనుబంధం ఉంది.

రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ భారీ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించడం ద్వారానే ఆమె అద్భుత రీ-ఎంట్రీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఐఐటీ వంటి గొప్ప అవకాశాన్ని పక్కనపెట్టి, కళనే ప్రాణంగా భావించిన నీలకంటి పటేకర్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES