• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘ప్యారడైజ్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ అరాచకం.. అంచనాలకు మించిన నాని మాస్ ఊచకోత..

‘ప్యారడైజ్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ అరాచకం.. అంచనాలకు మించిన నాని మాస్ ఊచకోత..

The Paradise Movie First Day Box Office Collections: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల కలయికలో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా మొదటి రోజు అంచనాలను మించి రికార్డుల మోత మోగించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 25, 2026, 02:13 PM IST|Updated: Sep 25, 2026, 02:26 PM IST
joinshare
‘ప్యారడైజ్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ అరాచకం.. అంచనాలకు మించిన నాని మాస్ ఊచకోత..
Image Credit: Paradise Collections (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

The Paradise Movie Box office Predictions: అవును నాని.. బాక్సాఫీస్ దగ్గర బడా హీరోలకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో మొదటి రోజు వసూళ్ల సునామి కురిపించాడు. అంతేకాదు ఆయన గత చిత్రాల రికార్డులను తిరగరాసాడు. టైర్ 2 హీరోల్లో అత్యధిక వసూళ్లను మొదటి రోజు రాబట్టిన హీరోగా రికార్డులను క్రియేట్ చేశారు.  ఈ సినిమా మొదటి రోజు సాధించిన వసూళ్లతో నాని ఇకపై టైర్ 2 హీరో అనకూడదేమే. ఎందుకంటే తెలుగులో టైర్ 1 హీరోలతో సమానమైన రేంజ్‌లో మొదటి రోజు రికార్డు లెవల్లో రూ. 88 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపాడు.

ఓ రకంగా అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసాడు. ఈ యేడాది ‘ది రాజాసాబ్’ సినిమాకు మొదటి రోజు నైజాంలో రూ. 15.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది. మొత్తంగా నాని ‘ది ప్యారడైజ్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర మాస్ కుమ్ముడు కుమ్మేసాడు. ఈ సినిమా కు కొంత మేర నెగిటివ్ రాబట్టినప్పటికీ అవేమి ఈ సినిమా వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపించలేదనుకుంటా.  మొత్తంగా రూ. 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తొలి రోజే దాదాపు రూ. 45 కోట్ల షేర్ (రూ. 88 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టిన చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు.. 

ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా మొదటి రోజు అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా ఇదే ఊపు కంటిన్యూ అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి పెద్ద ఇబ్బందేమి ఉండదు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 900 స్క్రీన్స్‌లో విడుదలైంది. రెస్ట్ ఆఫ్ భారత్‌లో 500 స్క్రీన్స్‌ , ప్రపంచ వ్యాప్తంగా 2 వేల స్క్రీన్స్‌లో విడుదలైంది. మొత్తంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా రూ. 15 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది.  ఓవరాల్‌గా రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి.  ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Movie Review
Telugu Movie
OTT Movies