నాని రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..
Nani Request to CM Revanth Reddy: నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రదర్శించనునున్నారు. ఈ నేపథ్యంలో నాని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసేందకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు.
CM Revanth Reddy Reply to Nani : ‘పుష్ఫ2’ ప్రీమియర్స్ సందర్బంగా అల్లు అర్జున్ సినిమా చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లిన సందర్భంలో జరిగిన తొక్కిసటాలో ఓ మహిళ చనిపోయింది. ఆమె బాలుగు ఇప్పటికీ చావు బ్రతుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలో నాని తన ‘ప్యారడైజ్’ విడుదల సందర్బంగా భద్రతా మార్గదర్శకాల నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులు మధ్య సినిమా చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎక్స్ వేదికగా విజ్జప్తి చేశారు.
అయితే నాని చేసిన ట్వీట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాల పట్ల మీకున్న అవగాహనకు మేము అభినందిస్తున్నాము. ప్రస్తుతం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అక్కడ స్థానికంగా ఉండే పోలీసులు తగిన తీసుకుంటారని చెప్పుకొచ్చారు. దీని కోసం స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తును సమర్పించమని చెప్పారు. స్థానికంగా ఉండే పోలీసులు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారన్నారు.
మరోవైపు నాని ప్రతిస్పందిస్తూ.. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకున్నాము. ఇలాంటి క్లిష్ట సమయంలో పోలీసులపై ఎలాంటి భారం మోపడం కానీ చేయడం లేదు. ప్రస్తుతం గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించే ఉద్దేశం మాకు లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. పోలీసు శాఖ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా మేము గౌరవిస్తాము. వారి చెప్పే వాటికి కట్టుబడి ఉంటామన్నారు. వారు వద్దని వారిస్తే తమ థియేటర్ విజిట్‌ను రద్దు చేసుకుంటామని చెప్పారు.
Also Read: పవన్ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు గెస్ట్ పాత్రలో కనిపించిన ఈ చిత్రం తెలుసా..!
Also Read:పవన్ కళ్యాణ్, రోజా కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఏంటో తెలుసా..!