SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నిర్మాతగా నిహారిక దూకుడు.. ఆకట్టుకుంటున్న ‘పాకెట్ రాకెట్స్’ టీజర్..

Niharika Production: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన బ్యానర్ నుంచి కమిటీ కుర్రోళ్లు, రాకాస, సినిమాలతో పలకరించిన ఈమె త్వరలో ‘పాకెట్ రాకెట్స్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 03:01 PM IST | Updated: Nov 04, 2026, 11:52 AM IST
Image Credit: Pocket Rockets (X/Source)
Join

Niharika Pocket Rockets Teaser: నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై  సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది ఫ‌స్ట్ హ్యాండ్’ రిలీజ్‌ అంటూ టీజర్ పై అంచనాలు పెంచేశారు మేకర్స్. శ్రీలంక‌లో అంద‌మైన రిసార్ట్ నుంచి ప్ర‌కృతి అందాల‌ను వీక్షిస్తూ ఆస్వాదిస్తోన్న  ఓ యువకుడికి  ‘ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలిటీనే ఫ‌స్ట్ టైమ్ బావుంది’ అని అంటాడు. దానికి మ‌రొక‌డు ‘డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోక‌ల్ బ‌స్తీ గ‌య్స్‌.. ఐయామ్ ది ఓన‌ర్ ఆఫ్ ..’ అంటూ డైలాగ్ చెబుతూ ఈ టీజర్ ఓపెన్ అయింది. అక్క‌డ నుంచి గ్యాంబ్లింగ్ జ‌రిగే ప్ర‌దేశాన్ని చూపిస్తారు.

బ‌స్తీలో ఉండే ఇద్ద‌రు కుర్రాళ్లు చ‌దువుకుంటూ బ‌త‌కు వెళ్ల‌దీయ‌టానికి చాలా క‌ష్టాలు ప‌డుతుంటారు. ఇక వాళ్ల జీవితం బాగు పడిందా లేదా  చివరకు వాళ్ల ప్రస్థానం ఏమైంది. ఇక వాళ్ల జీవితంలో ఓ అంద‌మైన అమ్మాయి ఎంట్రీ అంతా మారిపోతుంది.  అప్పుడు వాళ్ల లైఫ్స్ ఎలాంటి టర్న్  తీసుకోబోతున్నాయే కాన్సెప్ట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ఆ అమ్మాయి.. ఇద్ద‌రి ఫ్రెండ్స్‌ని శ్రీలంకకి ఎందుకు పంపించాల్సి వచ్చింది. . అక్క‌డ నుంచి వాళ్ల జీవితాలు ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది అనేది తెలుసుకోవాలంటే ‘పాకెట్ రాకెట్స్’ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు  నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.  పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి కీలక పాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ దూసుకుపోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం..అక్క‌డ వాళ్ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్ ప‌రిచ‌యం.. అక్క‌డి నుంచి క‌థ‌లో కీల‌క మ‌లుపులు.. వీట‌న్నింటిని క‌ల‌గ‌లిపిన ఫ‌స్ట్ హ్యాండ్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ప్ర‌స్తుతానికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నిహారికతో పాటు జేడీ చక్రవర్తి సహా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ సినిమాపై మాట్లాడారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES