హీరోయిన్స్ యాక్షన్ మోడ్.. హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..
heroins Mass Charecters: ఇండస్ట్రీతో సంబంధం లేదు.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్స్ అంతా రొటీన్ గ్లామర్ పాత్రలకి గుడ్ బై బై చెప్పేస్తున్నారు. అంతేకాదు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా ఊరమాస్ ఇమేజ్ వైపు అడుగులేస్తున్నారు. ఇన్నాళ్లూ హీరోలకే పరిమితమైన రస్టిక్ క్యారెక్టర్స్‌ని హీరోయిన్స్ చేస్తూ తాములో దాగున్న యాక్షన్ యాంగిల్ బయటికి తీస్తున్నారు. వెబ్ సిరీస్ నుంచి వెండితెర వరకు ఎక్కడ చూసినా ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు భామలు.
Heroins Action Mode: నెట్ ఫ్లిక్స్ కోసం కీర్తి సురేష్ చేస్తున్న ‘అక్క’ వెబ్ సిరీస్ తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసింది. ట్రైలర్‌లో తనలోని పవర్ ఫుల్ మాస్ యాంగిల్ తాజాగా విడుదలై ట్రైల్ చూస్తే తెలుస్తుంది. గ్లామర్‌తో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్‌తో డిజైన్ చేసిన ఈ క్యారెక్టర్‌లో రాధికా ఆప్టేతో కీర్తి సురేష్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంతకు ముందు ‘రివాల్వర్ రీటా’ లో కాస్త యాక్షన్ మోడ్‌లో కనిపించింది. మరోవైపు రష్మిక సైతం ‘మైసా’ సినిమాలో చాలా రఫ్ అండ్ రస్టిక్‌గా కనిపిస్తూ టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేసింది.
నయనతార సైతం ‘రెక్కయ్’ సినిమాతో ఊర మాస్ అవతారం ఎత్తి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేయడానికి రెడీ అవుతోంది. చేతిలో బైసా పట్టుకుని శత్రువులతో యుద్ధం చేయడానికి సిద్ధమైన ఆమెను చూస్తేనే అర్థమవుతుంది. గ్లామర్‌కు స్కోప్ లేకుండా కంప్లీట్ మాస్ వైబ్స్‌తో నయన్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులకు ఏ మేరకు అలరిస్తుందో చూడాలి మరి.
సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నుంచే తన రూట్ పూర్తిగా మార్చుకున్నారు. అందులో యాక్షన్ వైబ్స్ ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించాయి. ఆ తర్వాత సిటాడెల్ సిరీస్‌లతో కూడా పూర్తి యాక్షన్ మోడ్‌లో అదరగొట్టేసింది. పాటు మా ఇంటి బంగారం సినిమాలో కూడా అదే పవర్ రిపీట్ చేసి హిట్ అందుకుంది. మొత్తానికి ఒకప్పుడు క్యూట్‌గా కనిపించిన ఈ స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు సరికొత్తగా ఊర మాస్ యాక్షన్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.