నవంబర్‌లో బాక్సాఫీస్ దండయాత్ర.. హోల్‌సేల్‌గా థియేటర్స్‌లో మీడియం రేంజ్ టూ చిన్న చిత్రాలు..
November Box office Movies: తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రై మంత్‌గా పేరున్న నవంబర్‌లో ఈసారి ఓ రేంజ్‌లో సినిమాల జాతర జరగబోతోంది..? ఒకవైపు దీపావళి పండగ సెలవు పెద్దగా కలసి రాకపోయినా బాక్సాఫీస్ దగ్గర డజన్ల కొద్దీ కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. పెద్దగా హైప్ లేని నవంబర్‌లో చిన్న మీడియం బడ్జెట్ సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్‌కు సిద్ధమవ్వడం బయ్యర్లను హ్యాపీ చేస్తుందా లేక టెన్షన్ పెడుతోందా..? అని చూడాలి.
Box Office November Movies: నవంబర్‌లో ఈసారి వరుస సినిమాలతో దండయాత్ర జరగబోతుంది. ముందుగా దీపాల పండగ దీపావళి కానుకగా ‘రామాయణ పార్ట్ 1’ థియేటర్లలోకి వస్తుండగా.. ఆ మరుసటి రోజే మరో 4 సినిమాలు థియేటర్స్‌లోకి రానున్నాయి. అందులో ధీరజ్ మొగిలినేని 'సమ్మర్ హాలీడేస్' సినిమాలున్నాయి. ఇక సూర్య 'సీన్', నయనతార 'మహాశక్తి', అలాగే విజయ్ ఆంటోనీ 'నాన్న కుట్టి' లాంటి ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇందులో ‘సమ్మర్ హాలీడేస్’ ఒక్కటే స్ట్రెయిట్ తెలుగు మూవీ. రామాయణ హిందీ డబ్బింగ్ మూవీ. అంతేకాదు ఈ సినిమా మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాను మన దేశ సంస్కృతికి మారు పేరైనా రామాయణ మహా కావ్యంపై తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ ఆశలే ఉన్నాయి.
ఇక సూర్య ‘సీన్’, నయనతార ‘మహాశక్తి’, విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ చిత్రాలు తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగు తెరపై బాక్సాఫీస్ దండయాత్ర చేయబోతున్నాయి.
నవంబర్ బాక్సాఫీస్ దండయాత్ర..
ఇక నవంబర్ 12న శర్వానంద్ ఊరమాస్ లుక్‌లో నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' సినిమా రిలీజ్ అవుతుంది. ఇక నవంబర్ 13న ఏకంగా చాలా సినిమాలు బాక్సాఫీస్ బరిలో లక్ పరీక్షించుకోబోతున్నాయి. వాటిలో మౌళి హీరోగా వస్తున్న 'దొంగ నా కొడుకు', సుడిగాలి సుధీర్ 'గోట్', విశ్వదేవ్ 'డార్క్ చాకొలేట్'తో పాటు ఇట్లు అర్జున, టాల్కమ్ పౌడర్, చంద్రయాన్, రోమియో జూలియట్, మాయా లేడీ లాంటి చిత్రాలు కూడా లిస్ట్‌లో ఉన్నాయి.
నవంబర్ ఫుల్ ప్యాక్..
నవంబర్ ఎండింగ్ కూడా ఫుల్ ప్యాక్‌డ్‌గానే ఉండబోతోంది, 19న 'ఈ నగరానికి ఏమైంది రిపీట్', 20న దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఆకాశంలో ఒక తార సినిమాను సీనియర్ టాప్ ప్రొడ్యూసర్స్ అశ్వనిదత్, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి గతంలో పెళ్లి సందడి, పెళ్లాం ఊరెళితే సహా పలు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.
లాస్ట్ వీక్‌లో చిన్న మీడియం సినిమాల క్లియరెన్స్..
ఇక నవంబర్ 27న బెల్లంకొండ శ్రీనివాస్ 'హైందవ'తో పాటు రష్మిక మందన్న 'మైసా', అలాగే అనిల్ రావిపూడి అసిస్టెంట్ కృష్ణ తెరకెక్కిస్తున్న 'హై' చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటికి థియేటర్ల ఏ మేరకు కేటాయిస్తారనేది చూడాలి. మొత్తంగా నవంబర్ నెల బాక్సాఫీస్ గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. మొత్తంగా క్లియరెన్స్ సేల్ మాదిరి నవంబర్ నెలలో మీడియం రేంజ్ నుంచి చిన్న చిత్రాలు బరిలో లక్‌ను పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి.