SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?

NTR Dragon Shooting: గాయం కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు డ్రాగన్ సెట్స్‌లో మళ్ళీ అడుగుపెట్టబోతున్నారా ? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. ఎన్టీఆర్ లేక డిస్టర్బ్ అయిన షెడ్యూల్స్ అన్నింటినీ కవర్ చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలాంటి ప్లాన్ వేశాడు.. ? అసలు లూగర్ లొకేషన్‌కు వచ్చే డేట్ ఫిక్స్ అయిందా.. విడుదల తేదిలో మార్పులేమైనా ఉన్నాయా..?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 06:46 AM IST | Updated: Oct 05, 2026, 06:47 AM IST
Image Credit: NTR Dragon (File Pic/Source)
Join

NTR Resume to Dragon Shoot: గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ ముందుకు రాబోతున్నాడు. ఈ వీక్‌లో ఎపుడైనా ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సెట్స్‌లోకి అడుగు పెట్టపోతున్నట్టు సమాచారం. తారక్ రెస్ట్ కారణంగా ఇప్పటికే షెడ్యూల్స్ చాలా వరకు గందరగోళం అయ్యాయి. దాంతో ఇకపై బ్రేక్స్ లేకుండా ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

రిలీజ్ డేట్‌లో ఎలాంటి డౌట్ లేదు.. 
ఇన్ని రోజులు షూట్ ఆగినా.. ఎలాంటి డిలేస్ లేకుండా ముందుగా అనుకున్న టార్గెట్ ప్రకారం జూన్ 11, 2027నే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.  డ్రాగన్‌లో ఎన్టీఆర్ కు జోడిగా  రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా ఇందులో భాగం కానున్నారని సమాచారం.  

ప్రశాంత్ నీల్ మార్క్..

ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో డ్రాగన్ తెరకెక్కుతుంది. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ లేకపోయినా.. ఆయన లేని సన్నివేశాలు షూట్ చేసారు నీల్. తారక్ వచ్చాక అక్టోబర్ నుంచి నాన్‌ స్టాప్‌గా  షెడ్యూల్స్ జరగనున్నాయి. మొత్తానికి మరో వారం పది రోజుల్లోనే డ్రాగన్ దూకుడు షురూ కానుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొదటి పార్ట్ జూన్ 11న రెండో పార్ట్ డిసెంబర్‌లో ప్లాన్ చేశారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. లేకపోతే ఒకటే పార్ట్‌గా విడుదల చేస్తారా అనేది చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES