SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పవన్ కళ్యాణ్@30ఇయర్స్ ఇండస్ట్రీ.. అల్లు అరవింద్ సహా ప్రముఖుల ప్రశంసలు..

Pawan Kalyan@30Years TFI: పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా 30 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పవన్ కళ్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను వెండితెరకు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్..30 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేసారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 06:20 PM IST | Updated: Oct 12, 2026, 06:24 PM IST
Image Credit: Pawan Kalyan 30 Years Industry (X/Source)
Join

Pawan Kalyan 30 Years: పవన్ కళ్యాణ్ సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం 1996లో ఇవివి సత్యనారాయణ డైరెక్షన్‌లో  ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో  హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మించారు.  అంటే పవన్ కళ్యాణ్ ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతలను తీసుకొని దాన్ని సమర్ధవంతంగా నెరవేర్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు ‘కళ్యాణ్’ గానే ఉంటుంది. ఆ చిత్రం యావరేజ్‌ ఫలితాన్ని అందుకుంది.  కొణిదెల కుటుంబం మొత్తం రామ భక్త హనుమాన్ స్వామి భక్తులు. అన్యయ్య ఆంజనేయ స్వామి  పేరు కలిసొచ్చేలా చిరంజీవి గా పేరు మార్చుకొని మెగాస్టార్ అయ్యారు. అదే రూట్లో కళ్యాణ్ బాబు కూడా  అంజనా పుత్రుడి  పేరు కలిసొచ్చేలా కళ్యాణ్ పేరు ముందు ‘పవన్’ చేర్చుకొని పవన్ కళ్యాణ్‌గా పవర్ స్టార్‌గా సినీ రంగాన్ని శాసించారు. ఇపుడు రాజకీయ రంగంలో అసలు సిసలు పవర్ స్టార్‌గా నిలిచారు.  

ఇక సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలం ఇంత త్వరగా గడిచిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అల్లు అరవింద్ ప్రత్యేక ప్రశంసలు.. 
చిత్ర సీమలలో  పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను అభినందిస్తూ, ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలను  సాధించాలన్నారు. సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న దూరదృష్టిని కూడా అల్లు అరవింద్ ఈ సందర్భంగా ప్రశంసించారు. సినిమా రంగం వెలుపల కూడా ఆయన చేస్తున్న సేవలను, సమాజం కోసం అందిస్తున్న తన వంతు కృషిని అభినందించారు.

పవన్ కళ్యాణ్ 30 యేళ్ల ప్రస్థానం.. 

పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలన్నారు. నిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సినీ రంగంతో పాటు ప్రజా జీవితంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 30 ఏళ్ల సినీ ప్రస్థానం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సందర్బంగా ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకొని ‘జానీ’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. దర్శకుడిగా పవన్ కళ్యాణ్ విజన్ ఏంటో అందరికీ తెలిసింది. ఇక చివరగా వీరి కాంబినేషన్‌లో ‘జల్సా’ సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు.

పవర్ స్టార్.. 

ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో  తెరకెక్కిన రెండో  చిత్రం ‘గోకులంలో సీత’ మూవీ నుంచి సినిమా టైటిల్స్ లో పవన్ కళ్యాణ్ అని వేయడం మొదలైంది. ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన ‘గోకులంలో సీతై’ చిత్రానికి రీమేక్. ఈ సినిమాకు పోసాని కృష్ణ మురళి మాటలు అందించడం విశేషం. ‘గోకులంలో సీత’ సక్సెస్ మీట్‌లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను పవన్ స్టార్ అని పిలిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత పలు పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ పేరుతో స్టోరీలు రాయడం విశేషం.  

ఇక ‘గోకులంలో సీత’ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కిన  మూడో సినిమా  ‘సుస్వాగతం’ నుంచి పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు తెరపై ఫస్ట్ టైమ్ కనిపించింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా వెనక్కి తిరిగి  చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని శాసిస్తున్నారు.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES