Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఆయన విడాకుల వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ విడిపోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన గత వివాహాల గురించి కూడా చర్చ మొదలైంది. ఈ క్రమంలో పవన్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆమె ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య పేరు నందిని. ఆమె విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని కథనాలు చెబుతున్నాయి. పవన్ హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత వీరిద్దరికి పెద్దలు వివాహం చేశారు. 1997లో జరిగిన ఈ పెళ్లి సమయానికి పవన్ వయసు 26 ఏళ్లు కాగా, నందినికి 19 ఏళ్లు.
అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాఫీగా సాగలేదు. పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నటి రేణు దేశాయ్‌కు దగ్గరయ్యారు. ఈ పరిణామాలతో నందిని, పవన్ మధ్య దూరం మరింత పెరిగిందని ప్రచారం జరిగింది.
ఈ వ్యవహారం 2007లో కోర్టుకు చేరింది. విడాకులు తీసుకోకుండానే పవన్ మరో వివాహం చేసుకున్నారంటూ నందిని కోర్టును ఆశ్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు పవన్ కూడా నందినితో విడాకులు కోరుతూ న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. చివరకు 2008 ఆగస్టులో వీరిద్దరూ చట్టబద్ధంగా విడిపోయారు. ఈ విడాకుల సమయంలో నందినికి సుమారు రూ.5 కోట్ల భరణం ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
విడాకుల తర్వాత నందిని ఎక్కడున్నారు?
పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత నందిని పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేదు. అయితే విడాకుల తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి అక్కడ ఓ ఎన్నారై వైద్యుడిని రెండో వివాహం చేసుకున్నట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆమె తన పేరును జాహ్నవిగా మార్చుకున్నారని కూడా ప్రచారం ఉంది. అయితే ఈ వివరాలకు సంబంధించి అధికారికంగా స్పష్టత లేదు.
ఇక నందినితో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2013లో అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు అన్నాతో విడాకుల వార్తలు తెరపైకి రావడంతో పవన్ గత వివాహాలు, ఆయన మొదటి భార్య నందిని గురించి మరోసారి చర్చ జరుగుతోంది. అయితే తాజా విడాకుల వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రచారాలను నిజాలుగా భావించకూడదు.