SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Prabhas Fauzi Glimpse Review: ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్.. హను రాఘవపూడి నుంచి ఎవరూ ఊహించని మాస్ ట్రీట్!

Prabhas Fauzi Glimpse Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రభాస్‌ను చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన ఎంట్రీ, పవర్‌ఫుల్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

Written By Vishnu Priya
Published: Oct 23, 2026, 10:20 PM IST | Updated: Oct 23, 2026, 10:26 PM IST
Join

Prabhas Fauzi Glimpse Review: హను రాఘవపూడి పేరు చెప్పగానే చాలామందికి ‘సీతారామం’ సినిమా గుర్తుకొస్తుంది. అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన, ఇప్పుడు ప్రభాస్‌తో పూర్తిగా భిన్నమైన సినిమాను తీసుకొస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో ప్రేమకథ కంటే యాక్షన్, దేశభక్తి, సాహసం, మాస్ ఎలివేషన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది.

సుభాష్ చంద్రబోస్, హిట్లర్ మధ్య ఆసక్తికర సంభాషణ

‘ఫౌజీ’ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ ఆసక్తిని పెంచుతోంది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు జర్మనీ సహాయం కావాలని సుభాష్ చంద్రబోస్ కోరుతారు. అయితే భారతీయుల గురించి హిట్లర్ తక్కువ చేసి మాట్లాడతాడు.

 

దీనికి నేతాజీ ధైర్యంగా సమాధానం చెబుతారు. తన దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి ఇతరుల సహాయం ఉన్నా లేకపోయినా పోరాడతానని స్పష్టం చేస్తారు. ఈ సన్నివేశాలు దేశభక్తి భావనను పెంచేలా ఉన్నాయి.

అదే సమయంలో బ్రిటిష్ సైన్యానికి సవాల్‌గా నిలిచిన ఒక భారతీయ సైనికుడి గురించి నేతాజీ వివరిస్తారు. అతను సైనికుడే కాదు, మంచి వ్యూహకర్త, గూఢచారి కూడా. భగవద్గీత ఆధారంగా రహస్య కోడ్‌ను రూపొందించి బ్రిటిష్ వారి సమాచార వ్యవస్థను దెబ్బతీస్తాడని చెబుతారు. ఆ సైనికుడినే బ్రిటిష్ వాళ్లు ‘ఫౌజీ’ అని పిలుస్తారు.

ప్రభాస్ మాస్ ఎంట్రీ అదిరింది!

గ్లింప్స్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన కనిపించే సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశానికి మరింత బలాన్ని ఇస్తోంది. దేశం కోసం పోరాడే యోధుడిగా ప్రభాస్‌ను చూపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES