SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

6వ రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ‘రామాయణ’.. ఇది మాములు ఊచకోత కాదు సామి..

Ramayana 6th Day Box Office Collection: మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘రామాయణ’. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళి కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా ‘రామాయణం’ కాదు.. రావణాయణం అని కొంత మంది పేరు పెట్టినా.. అవేవి పట్టించుకోకుండా ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి వసూళ్లను కట్టబెడుతున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 11, 2026, 03:28 PM IST | Updated: Nov 11, 2026, 03:34 PM IST
Image Credit: Ramayana Box Office Collections (X/Source)
Join

Ramayana 6th Day Box Office Collection: మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘రామాయణ’. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళి కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా ‘రామాయణం’ కాదు.. రావణాయణం అని కొంత మంది పేరు పెట్టినా.. అవేవి పట్టించుకోకుండా  ప్రేక్షకులు  ఈ సినిమాకు మంచి వసూళ్లను కట్టబెడుతున్నారు.

Ramayana Box Office : దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ సినిమా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. వరుసగా 6 రోజులు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇది స్టార్ పవర్ కాదు.. రాముడి పేరుకున్న మహత్యం. రామాయణ సినిమా విడుదలైనపుడు కొంత మంది ‘ఆదిపురుష్’తో పోలిక పెట్టారు. ఎమోషన్స్ విషయంలో రామాయణ కాస్త తడబడ్డ గ్రాఫిక్స్, విజువల్ పరంగా ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. పైగా ఈ తరం పిల్లలకు రామాయణ అంటే ఏమిటో తెలియజెప్పడానికి పేరేంట్స్ ఈ సినిమాకు పిల్లలను తీసుకెళుతూ ఉండటం మూలానా ఈ సినిమాకు ఫుట్ ఫాల్స్ భారీగా ఉన్నాయి.

మొత్తంగా ఈ సినిమాకు హిందీ మార్కెట్‌తో ఓవర్సీస్ మార్కెట్ పెద్ద అడ్వాంటేజీగా మారిందనే చెప్పాలి. ఈ సినిమా గురువారం మొదటి రోజు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 47 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రెండో రోజు శుక్రవారం 38.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింద. శనివారం నరక చుతర్ధశి రోజు రూ. 53కోట్ల నెట్.. ఆదివారం దీపావళి రోజున కేవలం 37 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీపావళి పూజా సందర్బంగా ఈ సినిమాకు వసూళ్లు తగ్గాయి. కానీ  ఈ చిత్రం సోమవారం హాలీడే బాగా కలిసొచ్చింది. ఏకంగా హిందీలో మన దేశంలో రూ. 95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి నభూతో నభవిష్యత్తుగా అన్నట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. నిన్న మంగళ వారం రోజున కూడా ఏకంగా 75.03 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా హిందీ వెర్షన్ మన దేశంలో రూ. 345.28 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట.

ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 151 కోట్లు.. రెండో రోజు రూ. 110 కోట్ల గ్రాస్.. మూడో రోజు రూ. 160.25 కోట్లు.. నాల్గో రోజు రూ. 128.60 కోట్లు.. సోమవారం ఏకంగా రూ. 160కోట్ల గ్రాస్.. ఆరో రోజు రూ. 155 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. 
మొత్తంగా 864.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 కోట్ల గ్రాస్.. హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా -రూ. 400 కోట్ల గ్రాస్.. కర్ణాటకలో రూ. 100 కోట్ల గ్రాస్.. తమిళనాడులో రూ. 25 కోట్ల.. కేరళ - 20 కోట్ల గ్రాస్.. ఓవర్సీస్‌లో రూ. 325 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీ, కన్నడ వెర్షన్స్‌తో సత్తా చాటుతున్న ‘రామాయణ’కు మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ లాంటి చోట్ల కూడా బుకింగ్స్ చాలా బాగున్నాయి.

మొత్తంగా రామాయణ భారత్‌లోనే  కాకుండా ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల జోరు చూపిస్తోంది.  నార్త్ అమెరికాలో ఏకంగా బాహుబలి 2 సింగిల్ డే రికార్డును సైతం బ్రేక్ చేసి సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ 800 కోట్ల వరకు జరిగింది. అంటే హిట్ అనిపించుకోవాలంటే కనీసం 1600 కోట్ల గ్రాస్, రూ. 800 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 864 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. మరో రూ. 750 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి మరి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES