టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..
Ramayana - Jailer 2 Theatrical Business Details: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ చిత్రాలైన ‘రామాయణ’, ‘జైలర్ 2’ మూవీస్ బిజినెస్ ప్రస్తుతం ఇండస్ట్రీస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పేరుకు డబ్బింగ్ చిత్రాలైన తెలుగులో రికార్డ్ రేంజ్ బిజినెస్ చేస్తున్నాయని టాక్.
Ramayana Jailer 2 Telugu business: దసరాకు విడులకు కాబోతున్న రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ తుక్కు రేగ్గొట్టింది. ఈ సినిమాకు నెల్సన్ డైరెక్షన్‌తో పాటు అనిరుథ్ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఇపుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రాబోతుంది. ‘జైలర్’ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కెమియోలు అదిరిపోయాయి. ఇందులో కూడా మిథున్ చక్రబర్తి, శివరాజ్ కుమార్‌తో కెమియోలు ఈ సినిమాలో స్పెషల్‌గా ఉండనున్నాయి.
సితార నాగవంశీ ‘జైలర్ 2’ తెలుగు రైట్స్ రూ. 90 కోట్ల వరకు కొన్నట్టు సమాచారం. ఇది చాలా ఎక్కువ అని తెలుసు. కానీ ‘వార్ 2’ తెలుగు రైట్స్ తీసుకుని నష్టపోయినపుడు ఎలాగైతే యశ్ రాజ్ ఫిల్మ్స్ రూ. 18 కోట్లు ఇచ్చిందో.. అలాగే ‘జైలర్ 2’ బిజినెస్‌ను నష్టం వస్తే అనే పద్దతిలోనే నాగవంశీ డీల్ చేస్తున్నారనేది టాక్.
రామాయణం రూ. 100 కోట్ల బిజినెస్..
ఇక మన పురాణ కావ్యమైన ‘రామాయణ’ సినిమాను రూ. 100 కోట్ల మేర అమ్మాలని చూస్తున్నారు.. దిల్ రాజు ఈ రేసులో ముందున్నారని టాక్ నడుస్తుంది.. కాకపోతే రిస్కులు తీసుకోకుండా అడ్వాన్స్ బేసిస్ మీదే రామాయణ హక్కులు తీసుకోడానికి దిల్ రాజు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా యశ్ ఉన్నారు కాబట్టి టాక్సిక్ లెక్కలు కూడా తేలాలి . రామాయణ, టాక్సిక్ సినిమాలకు యశ్ ఓ నిర్మాత కూడా. ఈ సినిమాలో యశ్ రావణ బ్రహ్మ పాత్రలో నటిస్తే.. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించాడు. సాయి పల్లవి సీతగా.. కాజల్ అగర్వాల్ మండోదరిగా.. సన్ని దేవోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా హిందీ మార్కెట్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఐమాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకుడు.