• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Telangana Folk Song: ఏడాదిలోనే 95.7 కోట్ల వ్యూస్.. బుట్టబొమ్మను వెనక్కి నెట్టిన సాంగ్..!

Telangana Folk Song: ఏడాదిలోనే 95.7 కోట్ల వ్యూస్.. బుట్టబొమ్మను వెనక్కి నెట్టిన సాంగ్..!

Telangana Folk Song: తెలంగాణ జానపద పాట మరోసారి తన సత్తా చాటింది. పెద్ద పెద్ద సినిమా పాటలకు మాత్రమే సాధ్యమని భావించే రికార్డులను ఒక పల్లెటూరి ఫోక్ సాంగ్ తిరగరాసింది. ఎలాంటి భారీ సినిమా, స్టార్ హీరోలు లేకుండానే కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే 'రాను బొంబాయికి రాను' పాట. యూట్యూబ్‌లో ఈ పాట సృష్టించిన సంచలనం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సంగీత ప్రపంచంలోనూ చర్చనీయాంశంగా మారింది. కేవలం ఏడాది వ్యవధిలోనే 95.7 కోట్లకు పైగా వ్యూస్ సాధించి తెలుగు పాటల రికార్డుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Written ByVishnu Priya
Published: Nov 17, 2026, 20:23 IST|Updated: Nov 17, 2026, 20:31 IST
joinshare
Telangana Folk Song: ఏడాదిలోనే 95.7 కోట్ల వ్యూస్.. బుట్టబొమ్మను వెనక్కి నెట్టిన సాంగ్..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Folk Song: ఇప్పటివరకు అత్యధిక యూట్యూబ్ వ్యూస్ సాధించిన తెలుగు పాటగా అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ పాట విడుదలైన సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. తమన్ అందించిన సంగీతం, అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు ఆరేళ్లలో ఈ పాట 95.5 కోట్ల వ్యూస్ సాధించింది. అయితే ఇప్పుడు 'రాను బొంబాయికి రాను' పాట ఆ రికార్డును అధిగమించింది. రాథోడ్ ట్యూన్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన ఈ జానపద గీతం ఏడాదిలోనే 95.7 కోట్ల వ్యూస్ దాటడం విశేషం.

ఈ పాట ఇంత పెద్ద విజయాన్ని సాధించడం వెనుక దాని సహజమైన తెలంగాణ శైలి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రముఖ జానపద గాయకుడు రాము రాథోడ్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. ఆయనతో కలిసి సింగర్ ప్రభ కూడా తన గాత్రాన్ని అందించారు. కళ్యాణ్ కీస్ అందించిన సంగీతం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. శేఖర్ వైరస్ మాస్టర్ రూపొందించిన డ్యాన్స్ స్టెప్పులు కూడా యువతను బాగా ఆకట్టుకున్నాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పాట కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వేములవాడ, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో కేవలం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల బడ్జెట్‌తో చిత్రీకరణ పూర్తి చేశారు. కానీ ఫలితం మాత్రం ఊహించని స్థాయిలో వచ్చింది. యూట్యూబ్ ప్రకటనలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఈ పాట సృష్టికర్తలకు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.

ఈ పాట విజయంతో రాము రాథోడ్ జీవితంలోనూ పెద్ద మార్పు వచ్చింది. దాదాపు 16 ఏళ్లుగా జానపద సంగీత రంగంలో కొనసాగుతున్న ఆయనకు ఈ పాట దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. టెలివిజన్ కార్యక్రమాల్లోనూ అవకాశాలు పెరిగాయి. పెళ్లిళ్లు, జాతరలు, పండుగలు, కాలేజీ వేడుకల్లో ఈ పాట వినిపిస్తోంది.

ఒకప్పుడు సినిమా పాటలకే పరిమితమైన యూట్యూబ్ రికార్డులను ఇప్పుడు జానపద గీతాలు సవాలు చేస్తున్నాయి. తెలంగాణ మట్టి వాసన, స్థానిక భాష, సహజమైన సంగీతానికి ప్రేక్షకులు ఎంతటి ఆదరణ ఇస్తున్నారో 'రాను బొంబాయికి రాను' విజయం మరోసారి నిరూపించింది.

Read More: నార్త్ అమెరికాలో రామాయణం దెబ్బకు బాహుబలి రికార్డులు ఫసక్.. నెక్ట్స్ టార్గెట్ దురంధర్ 2..!!


Read More:Mirnalini Ravi Wedding: ఆధ్యాత్మిక గురువు మహావిష్ణువును పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరా బ్యూటీ? గుర్తుపట్టారా?

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie