SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘రుద్రవరం PS’.. ఎలా ఉందంటే..!!

Rudravanam PS Web Series Review: తెలుగులో ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ కోవలో మన దేశంలో అతి పెద్దదైన స్వదేశీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 విభిన్న కథాంశాలతో పలు భాషల్లో వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన మరో వెబ్ సిరీస్ ‘రుద్రవరం పీఎస్’. ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించిందా లేదా మన రివ్యూలో చూద్దాం.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 01, 2026, 12:54 AM IST | Updated: Nov 01, 2026, 11:12 AM IST
Image Credit: Rudravanam PS Review (File/Source)
Join

Rudravanam PS ZEE5 Original Series Review: ‘రుద్రవనం పీఎస్’ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మన దేశంలో అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ఫ్లాట్‌‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. నరేష్ అగస్త్య ముఖ్యపాత్రలో నటించారు. రుద్రవనం అనే గ్రామంలోని ఓ పోలీస్ స్టేషన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సీరిస్ పై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సిరీస్ అందుకుందా లేదా

కథ విషయానికొస్తే..

రుద్రవనం అనే గ్రామంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ(నరేష్ అగస్త్య)గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఇక ఏదో పని కోసం సెలవుపై వెళ్లాల్సిన సమయంలో అనుకోని ఓ సంఘటన జరగుతుంది. ఓ గుర్తు తెలయని శవం దొరుకుతుంది. మరోవైపు స్థానికంగా ఉండే పొలిటికల్ లీడర్ (రాజా రవీంద్ర) బ్రదర్ మిస్ అవుతాడు.  ఓ వైపు గుర్తు తెలియని శవం.. మరోవైపు రాజకీయ నాయకుడి తమ్ముడి అదృశ్యం పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఇంతకీ పోలీసులకు దొరికిన శవం ఎవరిది..? మిస్ అయిన పొలిటికల్ లీడర్ తమ్ముడు ఆచూకి తెలిసిందా.. మరోవైపు దొరికిన శవానికి సంబంధించిన తల అదృశ్యం అవుతుంది. చివరకు ఈ కేసును ఎస్ఐ ఎలా చేధించాడనేదే ఈ సిరీస్ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 
దర్శకుడు శశిధర్ మున్నంగి ఈ కథను సస్పెన్స్, క్రైమ్ నేపథ్యంలో ప్రేక్షకులను ఉత్కంఠ రేకెత్తించే విధంగా తెరకెక్కించాడు. మొదటి ఎపిసోడ్ నుంచే సిరీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి.. ఎవరు హంతకుడు అనే విషయాన్ని ఎస్ఐ చేధించే క్రమంలో రాసుకున్న ట్విస్టులు ప్రేక్షకులను ఎంగేజ్  చేసేలా ఉన్నాయి. 7 ఎపిసోడ్స్‌‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ను ఎక్కడా ల్యాగ్ లేకుండా తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేపాడు. అయితే చివరి రెండు ఎపిసోడ్స్ ను ఇంకాస్త బలమైన కథ, కథనాలు, ఎమోషన్స్‌తో  రాసుకుని ఉంటే బాగుండేది. 

ఓవరాల్‌గా ఈ వీకెండ్‌ ఈ సిరీస్‌ను చూసి ప్రేక్షకులు  థ్రిల్ కావచ్చు. ఈ సిరీస్‌లో కుటుంబ అనుబంధాలు, ప్రేమలు, గ్రామాల్లో రాజకీయాలు అత్యంత సహజ సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడిగా శశిధర్ కు మంచి ఫ్యూచర్ ఉంది. కథ,కథనంతో పాటు క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధా పెట్టాల్సింది. సినిమాటోగ్రపీ,నిర్మాణ విలువలు బాగున్నాయి. పవన్ సమకూర్చిన సంగీతం ఈ  సిరీస్‌పై ఇంట్రెస్ట్ మరింత పెంచింది.

నటీనటుల విషయానికొస్తే.. 
పోలీస్ అధికారి పాత్రలో నరేష్ అగస్త్య నాచురల్‌గా పర్ఫామెన్స్ బాగుంది. బాధ్యత గల పోలీస్ అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాల్లో కంటే సిరీస్‌లకు అతనికి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. అతని పై అధికారి పాత్రలో బెనర్జీ ఒదిగిపోయాడు. రాజా రవీంద్ర పొలిటికల్ లీడర్ పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. ఉత్కంఠ రేకెత్తించే ‘రుద్రవనం పీఎస్’

రేటింగ్: 2.5/5
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES