SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..

Sai Abhyankkar Vs Anirudh Ravichnder: తాడి తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు మరొకడు ఉంటాడు. అలా ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీని తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తోన్న అనిరుథ్ రవిచందర్‌కు ఇపుడు సాయి అభ్యంకర్ అనే మరో కొత్త సంగీత దర్శకుడు గట్టి పోటీ ఇస్తున్నాడు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 06:54 AM IST | Updated: Oct 01, 2026, 01:24 PM IST
Image Credit: Sai Vs Anirudh (File Pic/Source)
Join

Anirudh Vs Sai Abhyankkar: అనిరుధ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సాయి అభ్యంకర్. ఇన్నాళ్లూ దక్షిణ భారత్‌లో  టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అనిరుధ్ పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆయనకు ధీటుగా సాయి అభ్యంకర్ వస్తున్నారు.. పదేళ్ల కింద అనిరుధ్ దూకుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు అలాంటి దూకుడే చూపిస్తున్నారు సాయి అభ్యంకర్. 

ఒకపుడు సినీ సంగీతాన్ని ఏలారు..

అవును ఒకపుడు దక్షిణాది సినీ సంగీతాన్ని కేవి మహదేవన్ మకుటం లేని మహారాజుగా ఏలారు. ఆ తర్వాత ఎం.ఎస్.విశ్వనాథన్ కూడా దక్షిణ భారత సినీ సంగీతాన్ని ఏలారు. ఆ తర్వాత ఇళయరాజా ఓ రెండు దశాబ్దాల పాటు  సినీ సంగీతానికి చక్రవర్తిగా తన పాటలతో అలరించారు. ఆ తర్వతా ఏఆర్ రెహమాన్‌తో సంగీతం కొత్త పుంతలు తొక్కింది. ఇలా ఒక్కో తరంలో ఒక్కో సంగీత దర్శకుడు ప్రేక్షకులను అలరించడం అనేది ఎప్పటి నుంచో ఉంది.

సాయి అభ్యంకర్ విషయానికొస్తే.. తెలుగులో అట్లీ, అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు.. తమిళంలో సూర్య ‘కరుప్పు’తో స్టార్ అయ్యాడు సాయి అభ్యంకర్. నెక్ట్స్ సూర్య సినిమాతో పాటు ధనుష్ సినిమాకు ఛాన్స్ అందుకున్నాడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అతని చేతిలో ఉన్నాయి.

మరోవైపు అనిరుధ్ కూడా తక్కువేం కాదు.. వరుస అవకాశాలు అందుకుంటున్నారు.. అనిరుధ్ చేతిలోనూ భారీ ఆఫర్స్ ఉన్నాయి..ఇప్పటికిప్పుడు అనిరుధ్‌కు సాయి పోటీ అనలేం కానీ తక్కువ అంచనా మాత్రం వేయలేము. అనిరుథ్ జైలర్ 2తో పాటు తెలుగులో బాలయ్య, కొరటాల శివ సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

సాయి వర్సెస్ అనిరుథ్..

ఏది ఏమైనా తమిళ సినీ దర్శకులకు హీరోలకు అనిరుథ్ కాకుంటే.. సాయి అభ్యంకర్ ఉన్నాడనే ధీమా ఉంది. వీరిద్దరితో పాటు జీవి ప్రకాష్ సైలెంట్‌గా వచ్చిన అవార్డు విన్నింగ్ చిత్రాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు పోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. పాత, కొత్త కలయికతో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సంగీత దర్శకులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES