సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..
Suriya Hat Trick Hits: తమిళ స్టార్ హీరో సూర్య థియేట్రికల్‌గా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకొని చాలా యేళ్లే అవుతుంది. కానీ అసలు సిసలు బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం ‘వీరభద్రుడు’ సినిమాతో అందుకున్నాడు. ఆ తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో క్లాస్ హిట్ అందుకున్నాడు. తాజాగా ‘సీన్’ మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఒకే యేడాదిలో మూడు చిత్రాలతో హాట్రిక్ హిట్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
Suriya Success Track: గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్యకు 2026 బాగానే కలిసొచ్చింది. వరుసగా ఈయన నటించిన మూడు చిత్రాలు వీరభద్రుడు, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, తాజాగా దీపావళికి విడుదలైన ‘సీన్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తంగా మూడు చిత్రాలు మూడు విభిన్న పాత్రల్లో అలరించాడు. వీరభద్రుడు (కరుప్పు)లో వీరభద్ర స్వామిగా ప్రేక్షకులను పలకరించి అలరించాడు. ఆ తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో క్లాస్ పాత్రలో అలరించాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించి మెప్పించాడు.
తాజాగా విడుదలైన ‘సీన్’ చిత్రంలో కళ్లు సరిగా కనపడని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అతనికి కళ్లుగా హీరోయిన్ నజ్రియా, షార్ట్ టర్నమ్ మెమరీ లాస్ ఉండే ఫోరెన్సిక్ సైంటిస్ట్ తండ్రి..సైక్రియాటిస్ట్ తాగుబోతు తల్లి.. నలుగురికి నాలుగు విచిత్రమైన సమస్యలుంటాయి. ఈ నలుగురు కలిసి ఓ కేసును ఎలా సాల్వ్ చేశారనేదే సీన్ మూవీ స్టోరీ. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్‌లోనే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. అంతేకాదు వరుసగా ఒకే యేడాది మూడు రెండు వందల కోట్ల కొల్లగొట్టిన హీరోగా హాట్రిక్ నమోదు చేశాడు.
ఒకే యేడాదిలో ఒకే హీరో మూడు సార్లు రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్న హీరో మరెవరు లేరు. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇలా ఒక్క ఇయర్‌లోనే ఏ హీరో కూడా వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్ల మార్క్ అందుకోలేదు. భవిష్యత్తులో ఏ హీరోనైనా ఈ రికార్డును బ్రేక్ చేస్తారా అనేది చూడాలి.