SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తమన్నా బోల్డ్ స్టెప్.. కెరీర్ కోసం ఆ మాత్రం ఉండాలంటున్న మిల్కీ బ్యూటీ..

Tamannaah Bold Step: తన కెరీర్‌ను కాపాడుకోవాలంటే బోల్డ్ స్టెప్ తీసుకోక తప్పదని మిల్కీ బ్యూటీ తమన్నా గట్టిగా డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తుంది. అందుకే 21 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నడూ లేనంతగా వరుసపెట్టి బోల్డ్ సినిమాలను ఓకే చేస్తోంది. రాగిణి ఎంఎంఎస్ 3 సినిమానే ఎక్స్‌ట్రీమ్ అనుకుంటే.. దాన్ని మించిన మరో డర్టీ పిక్చర్‌లో తమన్నా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ? అసలు మిల్కీ బ్యూటీ ప్లాన్ ఏంటి..?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 06:30 AM IST | Updated: Oct 19, 2026, 06:31 AM IST
Image Credit: Tamannaah (X/Source)
Join

Tamannaah: తమన్నా.. స్వతహాగా ఉత్తరాది భామ అయినా.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా  సత్తా చాటింది.  కథానాయికగా  ముందుగా సౌత్ ప్రేక్షకులను అలరించిన ఈమె ప్రస్తుతం  ఉత్తరాది ఆడియన్స్ ను మెప్పిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా కంటే ఐటెం సాంగ్స్  ఎక్కువ చేస్తూ బోల్డ్ భామగా పేరు తెచ్చుకుంది.  అంతేకాదు ఓ వైపు సినిమాలు.. మరోవైపు ఐటెం సాంగ్స్.. ఇంకోవైపు వెబ్ సిరీస్ లతో అలరిస్తూ ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉంది.  

ఇంట గెలిచి రచ్చ గెలివాలి. కానీ తమన్నా.. ముందుగా సౌత్ లో గెలిచి ప్రస్తుతం నార్త్ సినీ ఇండస్ట్రీలో రచ్చ చేస్తోందితమ్మూ బేబి. హీరోయిన్ గా  రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తమ్మూ ఇప్పటికీ అదే సోయగంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది.  ఇండస్ట్రీకి వచ్చాక నో కిస్సింగ్ పాలసీ ఫాలో అయ్యారు తమన్నా. కానీ తన రూట్ పూర్తిగా మార్చేసింది. ఆ మధ్య వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో పాత రూల్స్ అన్నీ పక్కనపెట్టి లిప్‌లాక్ సీన్స్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్‌లో యాక్ట్ చేసిన ఫ్యాన్స్‌కు  షాక్ ఇచ్చారు. అదే బాటలో వెళ్తూ ‘రాగిణి ఎంఎంఎస్ 3’ లాంటి పక్కా బోల్డ్ అండ్ హారర్ సినిమాలో నటిస్తోంది.

‘రాగిణి ఎంఎంఎస్’ ఫ్రాంచైజీలోనే ఇంటిమేట్ సీన్స్‌కు పెట్టింది పేరు.  పార్ట్ 3లోనూ తమన్నా గ్లామరస్‌గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇది సెట్స్‌పై ఉండగానే ‘ది డర్టీ పిక్చర్ 2’లోనూ హీరోయిన్‌గా తమన్నాని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ‘ది డర్డీ పిక్చర్’ సిల్క్ స్మిత జీవితంపై తీసిన సినిమా. ‘ది డర్టీ పిక్చర్ 2’ సినిమాను ఏ జీవిత నటికి సంబంధించిన అంశాలతో తెరకెక్కిస్తన్నారనేది చూడాలి. విశేషం ఏంటంటే ఈ రెండు బోల్డ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది ఏక్తా కపూరే విశేషం. ఓ రకంగా తమన్నాను ఇపుడు ఏక్తా కపూర్ గుత్తకు పట్టుకున్నట్టు కనిపిస్తుంది.

మొత్తానికి కెరీర్‌లో ఖాళీ అనే పదమే లేకుండా ఎలాగోలా బిజీగా ఉండటమే లక్ష్యంగా మిల్కీ బ్యూటీ అడుగులేస్తుందనే చెప్పాలి. కుదిరితే హీరోయిన్ ఆఫర్స్, లేదంటే క్రేజీ స్పెషల్ సాంగ్స్, అదీ కాకపోతే ఓటీటీ వెబ్ సిరీస్‌లు, ఇవేవీ కాదంటే ఇలాంటి బోల్డ్ సినిమాలు చేస్తూ ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా దూసుకుపోతున్నారు. ఏదేమైనా 35 దాటాక తమన్నా గేర్ మార్చి వరుస ఆఫర్లతో  ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఇండస్ట్రీని షేక్ చేస్తుండటం విశేషం.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES