SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ముగ్గురు కథానాయికలు వెరీ స్పెషల్..

These 3 Heroins Career: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ముగ్గురు యంగ్ హీరోయిన్స్ కెరీర్ భిన్నమైన మలుపులు తీసుకుంటోంది. ఒక బ్యూటీకి ఏమో వరుసగా బడా ఆఫర్స్ వస్తుంటే.. హిట్ కొట్టిన మరో హీరోయిన్‌కేమో అవకాశాలు లేకపోయె. ఇక కెరీర్ బిగినింగ్‌లోనే వరుస ఫ్లాపులు ఫేస్ చేసిన ఇంకో బ్యూటీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంతకీ ఎవరా భామలు.?

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 03:43 PM IST | Updated: Nov 03, 2026, 03:46 PM IST
Image Credit: Heroins Special (Source/File)
Join

Crazy Beauties: ‘ఛాంపియన్’ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోతున్నారు. చిరంజీవి హీరోగా  బాబీ దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాతో పాటు రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోను అనస్వర కీ రోల్ పోషిస్తోంది. అలాగే వెంకీ కుడుముల నిర్మాణంలో అనీష్ హీరోగా వస్తున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంలో   సినిమాలో లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది.  

భాగ్యశ్రీ భాగ్యం.. 
మరోవైపు ‘లెనిన్’ సినిమాతో హిట్ కొట్టిన భాగ్యశ్రీ బోర్సే కెరీర్ మాత్రం చాలా విచిత్రంగా సాగుతుంది. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వరుస ఛాన్సులు ఈ భామను పలకరించాయి. సక్సెస్  వచ్చిన తర్వాత మాత్రం తెలుగులో కనీసం ఒక్క ఆఫర్ కూడా లేకపోయే. ప్రెజెంట్ ఈ బ్యూటీ కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌తో సేయన్.. మలయాళంలో మోహన్ లాల్‌తో ‘ఆపరేషన్ గంగ’సినిమాలు మాత్రమే ఉన్నాయి. తెలుగులో హిట్ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా లేకపోయే.  

కయాదు పరిస్థితి..

మరో హీరోయిన్ కయాదు లోహర్‌కు సైతం టాలీవుడ్‌లో అసలు అవకాశాలే వస్తలేవు. గతంలో చేసిన అల్లూరి, ఫంకీ సినిమాలతో పాటు.. భారీ అంచనాలతో వచ్చిన ‘ప్యారడైజ్’ కూడా పెద్దగా ఆడకపోవడంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో కెరీర్‌ను మార్చే సక్సెస్ కోసం  హిట్ కోసం చూస్తోంది ఈ బ్యూటీ. మొత్తానికి యంగ్ హీరోయిన్స్ పరిస్థితి ఒక్కోకరి ఒక్కోలా ఉన్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES