SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కొత్త భామలతో కళకళ లాడుతున్న టాలీవుడ్.. బడా ప్రాజెక్ట్స్‌లో యంగ్ బ్యూటీస్..

Tollywood New Heroins: చిత్ర పరిశ్రమ అనేది పుష్పక విమానం వంటిది. ఒక్కడ ఎంత మంది వచ్చినా కొత్త వాళ్లకు అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త కథానాయికలతో కళకళ లాడుతోంది. యంగ్ బ్యూటీస్ అంతా బడా ప్రాజెక్ట్స్‌లో భారీ ఛాన్సులు కొట్టేస్తున్నారు. ఇంతకీ ఎవరా భామలు.. ?

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 03:46 PM IST | Updated: Nov 03, 2026, 03:48 PM IST
Image Credit: Tollywood Crazy Beauties (File/Source)
Join

New Heroins In Tollywood: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త భామల హవా నడుస్తోంది. అనస్వర రాజన్ నుంచి శనయా కపూర్ వరకు ఈ ఫ్రెష్ ఫేసెస్ అంతా సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టర్స్ సరసన క్రేజీ ఆఫర్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. మరి ఈ కొత్త బ్యూటీస్ ఎంట్రీతో ఇండస్ట్రీలో పాత హీరోయిన్స్ చెక్ పడినట్టేనా అందరు చెప్పకుంటున్న  మాట.

అనస్వర రాజన్..

టాలీవుడ్‌లో ప్రస్తుతం అనస్వర రాజన్ పేరు బాగానే ట్రెండ్ అవుతుంది. ఓ వైపు 'ఇట్లు అర్జున'లో హీరోయిన్‌గా నటిస్తూనే... మరోవైపు రవితేజ 'తులాభారం', చిరంజీవి 'కాకా' లాంటి క్రేజీ సినిమాల్లో నటిస్తోంది  ఈ బ్యూటీ. చిరు సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటిస్తోంది.  

సారా అర్జున్.. 
ఇదే దారిలో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ కూడా మంచి ఆఫర్స్ కోసం ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తోంది. తెలుగులో   గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూఫోరియా’ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఒకట్రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో  ఈమె పేరు వినిపిస్తుంది.

రితికా నాయక్..

'మిరాయ్' బ్యూటీ రితికా నాయక్ కూడా వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'మిరాయ్ 2'తో పాటు సందీప్ కిషన్ సరసన 'పవర్ పేట'లో  కథానాయికగా నటిస్తోంది. రీసెంట్‌గా వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’లో తన అంద చందాలతో మెప్పించింది.

శనయా కపూర్..

అటు  తేజ సజ్జా 'జాంబి రెడ్డి 2'లో హీరోయిన్‌గా రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శనయా కపూర్. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈమెకు బంపర్ ఆఫర్స్ దక్కడం ఖాయం అనే ముచ్చట వినిపిస్తోంది. ఈమె బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ తమ్ముడు కూతురు. జాన్వీ కపూర్ కు చెల్లెలు వరుస అవుతుంది.

అనీత్ పడ్డా..

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సైయ్యారా' ఫేమ్ అనీత్ పడ్డా టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైపోయిందనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఈ బ్యూటీ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.  రామ్ చరణ్ సరసన కొత్త భామ అయితే బాగుండు అనే చర్చ నడుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ మేకర్స్ అంతా ఈ ఫ్రెష్ ఫేసెస్‌తో స్క్రీన్‌పై సరికొత్త మ్యాజిక్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES