SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rajamouli Varanasi OTT Deal: మహేశ్ బాబు 'వారణాసి'కి ఓటీటీలో కళ్లు చెదిరే ఆఫర్.. డిజిటల్ హక్కుల ధర తెలిస్తే షాక్!

Rajamouli Varanasi OTT Deal News: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా ఓటీటీ హక్కులకు భారీ ధర పలికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ డీల్‌పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు భారీ VFX పనుల కారణంగా 2027 ఏప్రిల్ విడుదల వాయిదా పడే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Written By Harish Darla
Published: Nov 26, 2026, 14:35 IST | Updated: Nov 26, 2026, 14:42 IST
Join

Rajamouli Varanasi OTT Deal News: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు, విడుదల తేదీపై ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు భారీ డిజిటల్ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటం అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.

ట్రేడ్ వర్గాల ప్రచారం ప్రకారం.. 'వారణాసి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం సుమారు రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు ఆఫర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకోవడానికి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' అంతర్జాతీయ స్థాయిలో సాధించిన గుర్తింపు, ఓటీటీ వేదికపై అందుకున్న ఆదరణ ఈ భారీ డిజిటల్ బిజినెస్ అంచనాలకు కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం ఖరారైనట్లు నిర్మాతలు లేదా నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా, 'వారణాసి' సినిమా విడుదల తేదీ విషయంలోనూ కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ముందుగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనుల కారణంగా మరింత సమయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విడుదలను 2027 జూలై లేదా ఆగస్టుకు మార్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీ మార్పుపై కూడా అధికారిక నిర్ధారణ లేదు.

ఈ సినిమాలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి కథనం, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న 'వారణాసి'పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ ఒప్పందం, రిలీజ్ డేట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేస్తే ఈ వార్తలకు మరింత స్పష్టత రానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES