SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Varshini Venkat Arrest: ఫ్రాడ్ కేసులో బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్..రూ.5.5 లక్షల టోకరా, పోలీసుల అదుపులో నటి!

Bigg Boss Varshini Venkat Arrest: ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిలిం నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలనే నెపంతో ఒక స్టాక్ ట్రేడర్‌పై భౌతిక దాడి చేసి, బెదిరింపుల ద్వారా రూ. 5.5 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదనంగా మరో రూ.27 లక్షలు ఇవ్వకపోతే కేసు పెడతానని బెదిరింపులు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.

Written By Harish Darla
Published: Sep 24, 2026, 07:35 AM IST | Updated: Sep 24, 2026, 11:23 AM IST
Join

Bigg Boss Varshini Venkat Arrest: చెన్నైలోని మయిలాపూర్‌లో నివసిస్తున్న 28 ఏళ్ల టీవీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ తన స్నేహితులతో కలిసి ఒక షార్ట్ ఫిలిం తీయాలని నిర్ణయించుకుంది. ఈ ఫిలిం నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు, తనకు ముందే పరిచయస్తుడైన స్టాక్ ట్రేడర్ తరుణ్‌ను సంప్రదించింది. తమ షార్ట్ ఫిలింలో పెట్టుబడి పెట్టాలని వర్షిణి, ఆమె స్నేహితులు కోరగా, అందుకు తరుణ్ స్పష్టంగా నిరాకరించాడు.

భౌతిక దాడి, బలవంతపు వసూళ్లు..
బాధితుడు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహం చెందిన వర్షిణి వెంకట్, ఆమె స్నేహితుడు సంజయ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఆగస్టు 22న అతడు బస చేసిన లాడ్జి వద్దకు వెళ్లారు. వారు తరుణ్‌పై భౌతిక దాడికి పాల్పడి, అతని వద్ద ఉన్న రూ. 50,000 నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. 

ఆ తర్వాత కూడా సంజయ్ నుంచి తరుణ్‌కు నిరంతరం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన తరుణ్, వర్షిణి వెంకట్ బ్యాంక్ ఖాతాకు రూ. 3 లక్షలు, అలాగే సంజయ్ బ్యాంక్ ఖాతాకు రూ. 2 లక్షలు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశాడు. ఈ విధంగా ప్రత్యక్ష నగదు, ఆన్‌లైన్ బదిలీల ద్వారా మొత్తం రూ. 5.5 లక్షలను నిందితులు వసూలు చేశారు

అదనపు డబ్బు కోసం డిమాండ్
రూ. 5.5 లక్షలు పొందినా.. నిందితుల బెదిరింపులు ఆగలేదు. తరుణ్‌ను మరింత భయభ్రాంతులకు గురిచేస్తూ అదనంగా రూ. 27 లక్షలు చెల్లించాలని సంజయ్ డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే అబద్ధపు కేసులు పెడతానని హెచ్చరించారు. ఈ దౌర్జన్యంపై బాధితుడు తరుణ్ గిండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్టాక్ ట్రేడర్ తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్షిణి వెంకట్, సంజయ్, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి బ్యాంక్ రికార్డులను పరిశీలించగా వర్షిణి ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు నటి వర్షిణి వెంకట్‌ను అరెస్టు చేసి, ఆమె వద్ద ఉన్న ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పరారీలో ఉన్న సంజయ్, ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES