• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Dorothy Movie: కీర్తి సురేష్ డోరతీపై ఎందుకింత రచ్చ..కోలీవుడ్‌లో ట్రోలింగ్‌కు అసలు కారణమేంటి?

Dorothy Movie: కీర్తి సురేష్ డోరతీపై ఎందుకింత రచ్చ..కోలీవుడ్‌లో ట్రోలింగ్‌కు అసలు కారణమేంటి?

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ నటించిన ‘డోరతీ’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. LGBTQ, లింగ మార్పిడి అంశాలను కథలో ప్రస్తావించడంతో సినిమాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Written ByVishnu Priya
Published: Sep 25, 2026, 10:17 PM IST|Updated: Sep 25, 2026, 10:21 PM IST
joinshare
Dorothy Movie: కీర్తి సురేష్ డోరతీపై ఎందుకింత రచ్చ..కోలీవుడ్‌లో ట్రోలింగ్‌కు అసలు కారణమేంటి?

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dorothy Movie: కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోరతీ’ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ‘పిజ్జా’, ‘జిగర్‌తాండ’, ‘పెట్టా’, ‘మహాన్’, ‘జిగర్‌తాండ డబుల్ ఎక్స్’, ‘రెట్రో’ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈసారి సున్నితమైన అంశాన్ని కథకు కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

‘డోరతీ’లో LGBTQ, లింగ మార్పిడి వంటి అంశాలను ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలోని కొన్ని బోల్డ్ సన్నివేశాలపై నెటిజన్లు చర్చిస్తున్నారు. కథలో సనంత్, రిషికాంత్ పాత్రలు స్నేహితులుగా కనిపిస్తాయని, రిషికాంత్ కోసం సనంత్ పాత్ర లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారుతుందని ప్రచారంలో ఉన్న కథనం చెబుతోంది. క్లైమాక్స్‌లో ఇద్దరి మధ్య సన్నిహిత సన్నివేశం కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఈ అంశాల కారణంగా కొందరు సోషల్ మీడియా యూజర్లు సినిమాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన కథాంశాన్ని ప్రముఖ నటీనటులతో తెరకెక్కించడం సరైన నిర్ణయం కాదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి కథను ఎంచుకోవడంపైనా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అయితే మరోవైపు సినిమాను సమర్థిస్తూ కూడా స్పందనలు వస్తున్నాయి. సున్నితమైన అంశాలను ఎలాంటి దాపరికం లేకుండా తెరకెక్కించేందుకు ప్రయత్నించారని కొందరు ప్రశంసిస్తున్నారు. దీంతో ‘డోరతీ’పై ప్రేక్షకుల అభిప్రాయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఇక నటుడు ధనుష్ మాత్రం సినిమాను ప్రశంసించారు. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ‘డోరతీ’ అద్భుతమైన సృష్టి అని పేర్కొంటూ, సినిమా ధైర్యంగా, సహజంగా, హృదయాన్ని తాకేలా ఉందని ప్రశంసించారు. నటీనటుల ప్రదర్శనతో పాటు ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

లింగ మార్పిడి అంశాలను సినిమాల్లో చూపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘డోరతీ’ కూడా ఇలాంటి అంశాలపై చర్చకు దారితీయడంతో సినిమా విడుదలైన రోజే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: బుక్ మై షోలో నాని ‘ది ప్యారడైజ్’ మరో రికార్డు.. బడా స్టార్స్‌ను వెనక్కి నెట్టి..

Also Read: రామాయణ, రాకా చిత్రాలపై హాలీవుడ్ ఎఫెక్ట్.. ? ట్రోలింగ్‌తో మేకర్స్‌కు కొత్త టెన్షన్.. !!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Movie