SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చిరు, పవన్‌లతో సింగీతం సినిమాలు ఎందుకు ఆగిపోయాయి..? ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోవడం వెనుక అసలు నిజాలివే!

Singeetham Movies With Chiranjeevi Pawan Kalyan: భారత దేశం గర్వంచ దగ్గ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథా చిత్రాలతో మెప్పించారు. ఈయన తెలుగు అగ్ర కథానాయకులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో అనుకున్న ప్రాజెక్టులు ఎందుకు వర్కౌట్ కాలేదు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 05:24 AM IST | Updated: Oct 04, 2026, 10:13 PM IST
Image Credit: singeetham Shelved movies with chiru pawan (File pics/Source)
Join

Singeetham Srinivas Shelved movies: సింగీతం శ్రీనివాస రావు తన కెరీర్‌లో ఎక్కువగా కమల్ హాసన్‌తో సినిమాలు చేశారు. ఇక తెలుగులో బాలకృష్ణతో మన దేశపు తొలి సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369’ సినిమాతో సంచలనం రేపారు. ఆ తర్వాత వీళ్ల కలయికలో ‘భైరవ ద్వీపం’ సినిమా వచ్చింది. జానపదాలు కనుమరుగు అవుతున్న సమయంలో బాలయ్యతో చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.

అంతేకాదు ఈ సినిమా సాధించిన సంచలన విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘భూలోక వీరుడు’ పేరుతో జానపద సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మాత. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు చిరంజీవి,సింగీతంకు కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అలా చిరంజీవితో సింగీతం శ్రీనివాస రావు ప్రాజెక్ట్ అటకెక్కింది.

పవన్‌తో జీసెస్ క్రైస్ట్ మూవీ ఆగిపోయింది..

ఆ తర్వాత చాలా యేళ్లకు పవన్  కళ్యాణ్‌తో ‘జీసెస్ క్రైస్ట్’ పేరుతో ఓ సినిమా చేద్దామనుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘జీసెస్’ పాత్రలో నటించబోతున్నట్టు చెప్పారు కూడా. అంతా రెడీ అయిదనుకుంటున్న వేళ ఈ ప్రాజెక్ట్ సెట్స్ వెళ్లకుండానే ఆగిపోయింది. ఇలా అన్నదమ్ములపైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో అనుకున్న ప్రాజెక్టులు ముందుకు సాగక సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. అటు నాగార్జునతో ఆదిత్య 369 తర్వాత ఓ సోషియో ఫాంటసీ ఫిల్మ్ అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత చాలా యేళ్లకు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో నాగార్జున హీరోగా ‘ఆకాశవీధిలో’ సినిమా వచ్చింది. ఈ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది.

సింగీతం విషయానికొస్తే.. తెలుగులో ‘మాయా బజార్’ సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మొదలై.. ఆ తర్వాత ఎన్నో విభిన్న చిత్రాలతో అలరించారు. చివరగా ‘సింగ్ గీతం’సినిమాతో పలకరించారు. ఈ యేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES