SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘రణబాలి’కి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటిస్తుందా..!

Ap Government Will Give Tax Exemption of Ranabaali: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుందా అనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 09:06 AM IST | Updated: Oct 24, 2026, 09:10 AM IST
Image Credit: Ranabaali Tax Exeption (X/Source)
Join

Ranabaali Tax Exemption: ఎపుడో పుష్కారానికి కానీ ఇలాంటి చిత్రాలు రావు. తెలుగు స్వాతంత్య్రం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. దాదాపు అన్ని చిత్రాలు మంచి విజయాలనే అందుకున్నాయి. విజయ్ దేవరకొండ కూడా తన సినీ జీవితంలో మొదటిసారి ‘రణబాలి’ సినిమాతో స్వాతంత్య్రోద్యమ కాలం నాటి చిత్రం చేశారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత రాయలసీమలో కరువు తాండవించిన సమయంలో బ్రిటిష్ వారు మన వాళ్ల దగ్గర అక్రమంగా శిస్తు కింద ఉన్న పంట అంతా లాక్కొని ఇంగ్లాండ్‌కు తరలించే పనిని చేస్తారు. అందుకోసం రాయలసీమ నుంచి ఆర్కాడ సంస్థానం మీదుగా చెన్నైకు ప్రత్యేకంగా రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి సరుకు రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తినడానికి తిండి గింజ లేని పరిస్థితుల్లో శిస్తు ఎలా కట్టాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండే పాలెగాడైన ‘రణబాలి’ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి ఎలా బ్రిటిష్ వాళ్లకు ముప్పతిప్పలు  పెట్టాడనేదే ఈ సినిమా కథ.

రాయలసీమ నేపథ్యంతో వచ్చిన సినిమా.. 

రాయలసీమలో అప్పటి పరిస్థితులకు అద్ధం పట్టిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా 8 రోజుల్లో దాదాపు రూ. 75 కోట్ల గ్రాస్ (రూ. 43 కోట్ల షేర్) వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ అయింది.  రాయలసీమ గడ్డపై జరిగి, చరిత్రలో మరుగుపరిచిన చారిత్రక ఘటనల స్ఫూర్తితో, సీమ వీరుల నేపథ్యంతో తెరకెక్కిన చారిత్రక నేపథ్య సినిమాలకు ప్రభుత్వాలు పన్ను రాయితీలు కల్పించడం చూస్తున్నాము గతంలో ‘తమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.

మరుగున పడ్డ చరిత్రకు కొత్త రూపం.. 

పాఠ్య పుస్తకాల్లో నేర్పించని చరిత్రను, మనకు తెలియకుండా దాచిన హిస్టరీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన రణబాలి వంటి సినిమాకు  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పన్నురాయితీ ఇస్తే బాగుండేది అనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. పన్ను రాయితీ కోసం నిర్మాతలు ప్రభుత్వానికి అభ్యర్థన చేసుకుంటే వారు పరిశీలించి పన్ను రాయితీ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. . ఈ పన్ను రాయితీ వల్ల ఆర్థికంగా సినిమా వచ్చే లాభం కంటే ఒక ప్రత్యేక గౌరవం దక్కుతుందనేది విజయ్ అభిమానుల కోరిక. ‘రణబాలి’ వంటి చిత్రాల వల్ల మన చరిత్ర గొప్పదనం, మన వీరుల త్యాగం, పోరాటం గురించి భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఏర్పడుతోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES