SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘రామాయణ’ సినిమా ముందున్న అసలు టార్గెట్స్ ఇవే.. రణ్‌బీర్, యశ్‌లకు బిగ్ టాస్క్..

Ramayana Pan India Target: భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'రామాయణ'. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్ర నిర్మించారు. నితీష్ తివారీ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా.. సన్నిదేవోల్ హనుమంతుడిగా.. యశ్ రావణాసురుడిగా.. సీతగా సాయి పల్లవి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా ముందు బోలెడ్ టార్గెట్స్ ఉన్నాయి. మొత్తంగా రణ్‌బీర్, యశ్‌ల ముందు బిగ్ టాస్క్ ఉందనే చెప్పాలి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 02:22 PM IST | Updated: Oct 16, 2026, 02:26 PM IST
Image Credit: Ramayana Part 1 Target (X/Source)
Join

Ramanaya Part 1: రామాయణ మహా కావ్యంపై తెలుగు సహా వివిధ భాషల్లో పలు చిత్రాలు తెరకెక్కాయి. రెండేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కానీ నమిత్ మల్హోత్ర,.. రణ్ బీర్ కపూర్, యశ్ రాముడిగా.. రావణాసురులగా ‘రామాయణ’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. అందులో మొదటి భాగం ఈ దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

హైయ్యెస్ట్ ఓపెనర్‌గా ఉన్న ‘దురంధర్ 2’ 
ఇక   సినిమా ముందు చాలా టార్గెట్స్ కనిపిస్తున్నాయి. నవంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయబోతుందా అ..? పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేలా దసరా నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తుండటంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో 'ధురంధర్ 2' రికార్డును బ్రేక్ చేస్తుందా..? బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఉన్న ‘దురంధర్ 2’ పేరిట ఉన్న బాలీవుడ్‌  హైయ్యస్ట్ ఓపెనర్ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిరేకిస్తోంది.

బాక్సాఫీస్ రికార్డులను టార్గెట్ చేస్తూ దసరా నుంచే మన దేశంలో .. అక్టోబర్ 15 నుంచి ఓవర్సీస్‌లో రామాయణ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. అంచనాలను పెంచేందుకు కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. సుమారు 200 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్న ఈ సినిమాకు నవంబర్ 4వ తేదీ రాత్రే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

రూ. 1500 కోట్ల గ్రాస్ లక్ష్యం..

రూ. 240 కోట్లతో బాలీవుడ్‌లో హైయ్యస్ట్ డే 1 రికార్డు 'ధురంధర్ 2' పేరు మీద ఉంది.  దాన్నిదాటి పుష్ప 2 సరసన నిలవాలని రామాయణ మేకర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలా జరగాలంటే ఫస్ట్ డే రూ.  250 కోట్లకు గ్రాస్ వసూళ్లను రామాయణ వసూలు చేయాల్సిందే. వరల్డ్ వైడ్‌గా 40 భాషల్లో, మన దేశంలో 5 భాషల్లో రిలీజ్ కానున్న రామాయణ స్కేల్ చూస్తుంటే.. ఫుల్ రన్‌లో రూ. 1500 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.

నితీశ్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హ్యాన్స్ జిమ్మర్, రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ సంస్థ DNEG విజువల్ వర్క్స్ అందించింది.  మొత్తానికి ‘రామాయణ’ మూవీ ఓపెనింగ్స్‌తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందో చూడాలి మరి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES