• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /30 అడుగుల అనకొండతో చిన్నారి ఆటలు.. వైరల్ వీడియో

30 అడుగుల అనకొండతో చిన్నారి ఆటలు.. వైరల్ వీడియో

Giant Python Viral Video: తాజాగా సోషల్ మీడియాలో 30 అడుగుల పొడవు కలిగిన అనకొండ పాముతో ఒక చిన్నారి ఆడుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.. ఈ వీడియోలో ఆ చిన్నారి పాముతో ఎంతో అల్లారు ముద్దుగా ఆడుకోవడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 20, 2026, 01:39 PM IST|Updated: Oct 20, 2026, 01:40 PM IST
joinshare
30 అడుగుల అనకొండతో చిన్నారి ఆటలు.. వైరల్ వీడియో
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: బ్రహ్మోత్సవాల్లో వడ్డీకాసులవాడికి కనకవర్షం.. 8 రోజుల్లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం

Tirumala: బ్రహ్మోత్సవాల్లో వడ్డీకాసులవాడికి కనకవర్షం.. 8 రోజుల్లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం

2

Tiger Shroff Case: టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసు.. భారీగా డబ్బు ఆఫర్, విదేశాల్లో ఉద్యోగం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!.

3

ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

4

30 అడుగుల అనకొండతో చిన్నారి ఆటలు.. వైరల్ వీడియో

5

Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Giant Python Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో పాపులారిటీతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే విన్యాసాలు ఒక్కొక్కసారి ఊహకందని ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి.. భయాందోళనకు గురి చేస్తూ వస్తోంది. ఈ వీడియోలో దాదాపు 30 అడుగులకు పైగా పొడువున్న ఒక భారీ అనకొండ పాముతో ఒక చిన్నారి ఏ మాత్రం భయం లేకుండా ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా చిన్న పాము పిల్లను చూసి గుండె జారిపోతూ ఉంటుంది.. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత బలమైన శరీర కండరాల నిర్మాణం కలిగిన భారీ అనకొండ పాము పక్కన ఒక పసికందు ఉండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ఇంటి గదిలో సోఫాపై అత్యంత ప్రమాదకరమైన అనకొండ నెమ్మదిగా పాకుతూ ఉండటం మీరు క్లియర్ గా చూడొచ్చు. అక్కడే ఉన్న ఒక చిన్నారి దాని పరిమాణాన్ని గాని.. అది కలిగించే ప్రమాదాన్ని గాని ఏమాత్రం ఊహించకుండా.. దాన్ని ఒక ఆట వస్తువుల భావించి సరదాగా దానిపై ఎందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు.. దాన్ని నిమురుతూ ఆడుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు..

ఈ విజువల్స్ కొందరిని ఆశ్చర్యపరిచినప్పటికీ.. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులతోపాటు వన్యప్రాణి సంరక్షకులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. అనకొండ లాంటి అత్యంత పరిమాణం కలిగిన పాములు క్షణాల వ్యవధిలోనే ఆ చిన్నారిని చుట్టేసి.. ముక్కలను విరిచి ఊపిరాడకుండా చేసి మింగేసే శక్తిని కలిగి ఉంటాయని..sపెంపుడు జంతువుల ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ.. వాటి సహజ గుణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరని వారు అంటున్నారు. చిన్నారి కదలికల వల్ల పాముకు అసౌకర్యం లేదా ముప్పు అనిపిస్తే.. అది ఒక్కసారిగా దాడి చేసే ఛాన్స్ ఎంతగానో ఉందని.. చిన్నారి ప్రాణానికి ఎంత పెద్ద ప్రమాదం వాటిల్లుతుందో ఆలోచించారా అంటూ తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ వస్తున్నారు..

ముఖ్యంగా ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి.  చిన్నారి ప్రమాదకరమైన జీవి పై ఆడుకుంటుంటే.. వాళ్లందరూ ఆపాల్సింది పోయి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు మంచిదని వన్యప్రాణి సంరక్షకులు సైతం ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇది పసిక అందు ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని.. బాధ్యులపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లైకులతో పాటు షేర్ల మోజులో పడి ఇలాంటి ప్రమాదకరమైన రీల్స్ తీయడం ఆనుకోవాలని వారు చెబుతున్నారు.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Nomeanimes | Animaciones graciosas (@nomeanimes_)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News