SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్.. వ్యతిరేకంగా సర్వేఫలితాలు..

America Mid Term Election Survey: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… ఏం చేసినా ఓ సెన్సేషన్… అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో ప్రత్యర్థులు విజయం సాధిస్తే… వీటో అస్త్రాన్ని ప్రయోగించి అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన ప్రజాప్రతినిధుల్లో ఎందుకీ ఫ్రస్టేషన్! మధ్యంతర ఎన్నికల సర్వేలు ఏం చెబుతున్నాయి? అధికారంతో ఏకచత్రాధిపత్యం చెలాయించాలా? అమెరికా ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతున్నారు? ట్రంప్ లో పాలనా సామర్థ్యం లోపించిందా? ఆయన మాటలతో జోకర్ గా మారిపోయారా?

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 11:45 AM IST | Updated: Nov 03, 2026, 11:49 AM IST
Image Credit: Donald Trump (Source/File)
Join

Mid Term US Election Shocking Survey: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిపట్ల ప్రజల్లో వ్యతిరేకత కన్పిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయనే ప్రచారం సాగుతోంది. ఆ నేపథ్యంలో ట్రంప్ బరి తెగిస్తున్నారు.  బెదిరింపు దోరణిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే.. మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన వారి అధికారాలను నియంత్రించేందుకు వీటో పవర్‌ను వినియోగిస్తానని కామెంట్ చేశారు. దీంతో ఆయనలో ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది.అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ మాటలను పెద్దగా ఎవరు విశ్వసించడంలేదు. అధ్యక్షుడిగా అమెరికా ప్రజల్లోనూ… అగ్రరాజ్యాధినేతగా ప్రపంచదేశాల్లోనూ విశ్వాసం కోల్పోయారు.  

పొరుగు దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న ట్రంప్..

డొనాల్డ్ ట్రంప్ నియంతృత్వ విధానాలతో పొరుగు దేశాలను ముప్పు తిప్పలు పెట్టిస్తున్నారనే విమర్శలున్నాయి. పొరుగు దేశాలతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తున్న ట్రంప్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా హుందాగా వ్యవహరించాల్సిన డొనాల్డ్ ట్రంప్ చౌకబారు మాటలతో ప్రజల్లో చులకనైపోయారు. నాయకుడి మాటతీరును ప్రజలే చీదరించుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ప్రకటనలతో ప్రపంచ వ్యాప్తంగా నిరంతరం వార్తల్లో నిలుస్తూ వచ్చారు.  మిచిగాన్ డెమోక్రటిక్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ అల్ సయ్యద్‌ను ఉద్దేశించి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనొక "జిహాదీ" అని, ఒకవేళ అతను గెలిచి సెనేట్‌లోకి వస్తే దేశ భద్రత దృష్ట్యా మెటల్ డిటెక్టర్‌లతో తనిఖీలు చేయాలని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత..

శ్వేతసౌధంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రెస్ మీట్ సందర్భంగా ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ "నువ్వు చాలా భయంకరంగా ఉన్నావని కామెంట్ చేశారు. అలాగే ప్రశ్నించిన మరో రిపోర్టర్‌తో  జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం, ప్రపంచ దేశాలతో సంఘర్షణల నేపథ్యంలో యూఎస్‌లో అధికశాతం ప్రజలు అధ్యక్షుడు ట్రంప్‌ ను వ్యతిరేకిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. (SPOT)

చైనా ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడానికి కుట్ర పన్నినందుకుగానూ అక్టోబర్‌ 30న లిరెన్, యువాన్స్ చెన్ అనే ఇద్దరు చైనా జాతీయులకు అమెరికా న్యాయ శాఖ  30నెలల జైలు శిక్ష విధించింది.  ప్రత్యర్థులపై గూఢచర్యం చేయడంలో చైనా, రష్యాల కంటే మెరుగ్గా అమెరికా పని చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సైనిక స్థావరాలపై చైనా, రష్యా గూఢచర్యం చేస్తున్నాయని నిఘా అధికారులు తనకు చెప్పిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. వారి మాదిరిగానే వాషింగ్టన్ కూడా బీజింగ్, మాస్కోలను నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

అమెరికా అత్యుత్తమ  ఆర్ధిక వ్యవస్థ..

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చరిత్రలోనే  అమెరికా అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని  డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. రిపబ్లికన్లకు వచ్చే ఓట్లను సర్వేలు సరిగ్గా చూపించట్లేదని అసహనం వ్యక్తం చేశారు. అవకాశం వస్తే మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయడానికీ తాను సిద్ధంగా ఉన్నానని  ట్రంప్ ప్రకటించారు.అయితే రాజ్యాంగ నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల అది సాధ్యం కాకపోవచ్చని నిరాశ వ్యక్తం చేశారు.

వీసా ఫీజులను పెంచిన

వలస దారులను కట్టడి చేయాలని వీసా ఫీజులను అమాంతంగా పెంచడం, ట్రంప్ ట్యాక్స్ లను విధించి ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలనే ట్రంప్ నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కన్పిస్తోంది. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ... ట్రంప్ తరహాలో వ్యవహరించలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లోనే కాదు.. సొంత దేశం అమెరికాలోనూ విశ్వాసం కోల్పోయారని సర్వే సంస్థలు వాస్తవాలను వెల్లడించడంతో డొనాల్డ్ ట్రంప్ లో ఫ్రస్టేషన్ పీక్ స్టేజికి చేరుకుంది.మధ్యంతర ఎన్నికల్లోనే కాదు... ఏ ఎన్నికలు జరిగినా... డొనాల్డ్ ట్రంప్ పట్ల విసిగిపోయిన ప్రజలు వ్యతిరేక ఓటు వేయాలనే నిర్ణయంతో ఉన్నారని సమాచారం.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES