• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ..ఒకరు మృతి..!

నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ..ఒకరు మృతి..!

Two Helilcopters Collide: ప్రస్తుతం విమానం లేదా హెలికాప్టర్స్‌లో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో సరైన నిర్వహణ లేకనో పైలెట్స్ తప్పిదమో ఏమో కానీ.. తరుచుగా విమాన ప్రమాదాలు ప్రయాణీకుల ప్రాణాలను బలిగొంటుతున్నాయి. తాజాగా నేపాల్‌లో రెండు హెలికాప్టర్స్ ఢీ కొన్న ఘటన సంచలనం రేపుతోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 12:34 PM IST|Updated: Nov 03, 2026, 12:41 PM IST
joinshare
నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ..ఒకరు మృతి..!
Image Credit: Nepal Accident (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
2 నెలలుగా అమ్మానాన్నలకు దూరంగా బాలుడు.. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు!

2 నెలలుగా అమ్మానాన్నలకు దూరంగా బాలుడు.. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు!

2

Rajagopal Reddy: క్యారెక్టర్‌లో, క్రెడిబిలిటీలో నేను సీఎంకన్నా ఎక్కువ.. మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

3

అబద్దాలతో ఎప్పటికైనా నష్టాలు తప్పవని నిరూపించిన చిన్నారి చిట్టి కథ..!!

4

నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ..ఒకరు మృతి..!

5

ఎల్ నినో ఎఫెక్ట్.. సీతాఫలం.. మరింత ప్రియం..ఆకాశాన్నంటుతున్న ధరలు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Helicopters Collide: నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో రెండు హెలికాప్టర్లు ఢీకొటిన ఘటన సంచలనం రేపింది. ఫీస్టెల్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ఢీ కొట్టుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. హెలిప్యాడ్‌పై ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రమాద సమయంలో అక్కడున్నవారంత  పరుగులు తీస్తున్న దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ల్యాండ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ల రోటర్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది.

తాజాగా జరిగిన ఈ ఘటనలో ఓ విదేశీ పర్యాటకుడు మృతి చెందినట్టు సమాచారం. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.అతన్ని సమీపంలోని  ఆసుపత్రికి సిబ్బంది తరలించారు. హెలికాప్టర్ల రెక్కలు పరస్పరం ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు  నేపాల్ పౌర విమానయాన ప్రాధికార సంస్థ వెల్లడించింది. మొత్తంగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు. ఘటనపై మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు నేపాల్ పౌర విమానయాన అధికారులు.

హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో మృతి చెందిన వ్యక్తిని  వసంత కుమార్ బలరామడు గా గుర్తించారు. అతని వయసు 47 యేళ్లు. అతనిదో ఏ రాష్ట్రమో ఇంకా తెలియ రాలేదు. అదే హెలికాప్టర్‌లో న్యూజిలాండ్‌కు చెందిన ప్రవాస భారతీయుడు 49 యేళ్ల శైలేష్ కృష్ణ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు.  అతన్ని కాఠమండూకు చెందిన హాస్పిటల్‌కు తరలించారు.

నేపాల్ హిమాలయాల్లోని అతి చిన్న దేశం. ఇక్కడ టూరిస్టులు, పర్వాతరోహకులు, వర్తక వాణిజ్య అవసరా నిమిత్తం చిన్న చిన్న హెలికాప్టర్స్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడ ఎప్పటికపుడు మారిపోయే వాతావరణ ప్రతికూల పరిస్థితులు కారణంగా అక్కడ తరుచుగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదం కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదకర ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.  

Add Zee News as a Preferred Source
TAGS:
World News
National News
Trending News
Telugu News