• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Gold Mine: జాక్‌పాట్.. డ్రైనేజీ పైపుల కోసం తవ్వితే.. వెలుగులోకి బంగారం నిధి..!

Gold Mine: జాక్‌పాట్.. డ్రైనేజీ పైపుల కోసం తవ్వితే.. వెలుగులోకి బంగారం నిధి..!

Gold Bars Found: డ్రైనేజీ పైపుల ఏర్పాటు కోసం తవ్వకాలు చేపట్టిన కార్మికులకు ఊహించని విధంగా బంగారం లభించింది. బెల్జియంలోని ఓ పాత బ్రూవరీ భవనం కింద తవ్వకాలు చేపట్టగా.. గోడల్లో దాచిన బంగారు కడ్డీలు, వేలాది నాణేలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.99 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

Written ByAshok Krindinti
Published: Nov 11, 2026, 03:50 PM IST|Updated: Nov 11, 2026, 03:53 PM IST
joinshare
Gold Mine: జాక్‌పాట్.. డ్రైనేజీ పైపుల కోసం తవ్వితే.. వెలుగులోకి బంగారం నిధి..!
Image Credit: Gold Bars Found (Source: AI Generated)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

2

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

3

ఇవ్వడానికి ఏం లేదు.. విద్యను మాత్రమే అందించగలను: సీఎం రేవంత్

4

ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

5

గ్రామస్తులకు అడ్డంగా దొరికిన మైనర్ జంట.. పంచాయితీలో వారు ఏం చేశారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Bars Found: బెల్జియంలో ఓ నిర్మాణ పనులు చేపట్టిన కార్మికులకు అనూహ్యంగా భారీ బంగారు నిధి దొరికింది. డ్రైనేజీ పైపుల ఏర్పాటు కోసం ఓ పాత భవనం వద్ద తవ్వకాలు చేస్తుండగా.. బంగారు కడ్డీలు, నాణేలు బయటపడ్డాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.99 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంతటి విలువైన సంపద ఎవరిది..? దానిపై హక్కులు ఎవరికి దక్కుతాయనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాలు ఇలా.. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని సింట్-గిల్లిస్-డెండర్‌మోండే ప్రాంతంలో ఈ నిధి వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 11న ఓ పాత బీర్ తయారీ కేంద్రం ప్రాంగణంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భవనం పునాదుల సమీపంలో తవ్వకాలు చేపట్టిన కార్మికులకు మొదట కొన్ని పాత నాణేలు కనిపించాయి.

అయితే మరింత లోతుగా తవ్వకాలు చేపట్టగా.. అక్కడ పెద్ద మొత్తంలో బంగారు సంపద ఉన్నట్లు గుర్తించారు. గోడల మధ్య ఇటుకలతో మూసివేసిన ప్రాంతంలో బంగారు కడ్డీలు, ఇతర విలువైన లోహాలు బయటపడ్డాయి. ఈ నిధిలో సుమారు 49 బంగారు కడ్డీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కూడా ఉన్నాయి. వీటితో పాటు వేలాది బంగారు నాణేలు లభ్యమైనట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సంపదను ఒక సంచిలో ఉంచి.. భవనం బేస్‌మెంట్ గోడ వెనుక ఇటుకలతో మూసివేసి దాచినట్లు తెలుస్తోంది. ఈ భవనం 19వ శతాబ్దం చివర్లో స్థానికంగా పేరున్న వాన్ ఏష్ కుటుంబానికి చెందిన థియోఫిలస్ వాన్ ఏష్ కోసం నిర్మించినట్లు చారిత్రక వివరాలను బట్టి తెలుస్తోంది.

ఈ భవనంలో 1899 నుంచి 1970 వరకు బీర్ తయారీ కార్యకలాపాలు కొనసాగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భవనం యాజమాన్యం చేతులు మారింది. ప్రస్తుతం CAW Oost-Vlaanderen అనే సామాజిక సంక్షేమ సంస్థ ఆధీనంలో ఉంది. ఈ సంస్థ భవనాన్ని పునరుద్ధరించి కార్యాలయాలు, నివాస సముదాయాలుగా మార్చే పనులు చేపట్టింది. ఈ పునరుద్ధరణ పనుల్లో భాగంగానే గోడల వెనుక దాచిన బంగారం వెలుగులోకి వచ్చింది.

నిధి బయటపడిన వెంటనే కార్మికులు భవనం యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ బంగారాన్ని బ్రస్సెల్స్‌లోని ప్రభుత్వ భద్రతా కేంద్రంలో భద్రపరిచారు. దాని మూలాలు, అసలు యజమాని ఎవరనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంపద ఏదైనా చోరీకి సంబంధించిందా..? లేదా గతంలో ఎవరైనా భద్రత కోసం దాచిపెట్టారా..? అనే కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు.

ఈ నిధిపై వాన్ ఏష్ కుటుంబ వారసులు హక్కులు కోరే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత భవన యజమాని, నిధిని గుర్తించిన నిర్మాణ కార్మికులు కూడా తమకు హక్కులు ఉన్నాయని వాదించే ఛాన్స్ కూడా ఉంది. అయితే చారిత్రక సంబంధం ఉన్నంత మాత్రాన బంగారం వారిదేనని చెప్పలేమని.. అందుకు తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బెల్జియం చట్టాల ప్రకారం ఈ సంపదకు అసలైన యజమాని ఎవరనేది నిరూపించుకునేందుకు ఐదేళ్ల సమయం ఉంటుంది. ఈ గడువు 2031 వరకు కొనసాగనుంది. అప్పటిలోగా సరైన ఆధారాలతో ఎవరూ ముందుకు రాకపోతే.. చట్టపరమైన నిబంధనల ప్రకారం నిధిని గుర్తించిన వ్యక్తికి, ఆ భవనం యజమానికి మధ్య సంపదను పంచే అవకాశం ఉంది.

మరోవైపు ఈ నిధి బయటపడిన విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొందరు తమ పూర్వీకులకు ఈ ప్రాంతంతో సంబంధం ఉందని చెబుతుండగా.. మరికొందరు వాన్ ఏష్ కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ బంగారు సంపద ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. దాని అసలు యజమాని ఎవరో తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Viral News
Telugu News