• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /20ఏళ్లుగా రాక్షస క్రీడ.. భార్యకు మత్తు ఇచ్చి.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు..!!

20ఏళ్లుగా రాక్షస క్రీడ.. భార్యకు మత్తు ఇచ్చి.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు..!!

Manchester Sexual Abuse Trial: కట్టుకున్న భార్యకే నరకం చూపించాడు. ఒకటి కాదు రెండు 20ఏళ్లకు పైగా మత్తు మందు ఇచ్చి నరకం చూపించాడు. ఆమె స్ప్రహలో లేనిప్పుడు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. ఆ అక్రుత్యాలను తన ఫోన్ లో భద్రపరిచాడు ఈ నీచుడు.

Written ByBhoomi
Published: Nov 03, 2026, 10:00 AM IST|Updated: Nov 03, 2026, 10:02 AM IST
joinshare
20ఏళ్లుగా రాక్షస క్రీడ.. భార్యకు మత్తు ఇచ్చి.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు..!!
Image Credit: Manchester Sexual Abuse Trial:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్.. టీచర్లు వరుసగా లీవ్‌లు పెడితే చర్యలు తప్పవు..!!

రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్.. టీచర్లు వరుసగా లీవ్‌లు పెడితే చర్యలు తప్పవు..!!

2

ధనవంతులు కావడానికి చాణక్యుడు చెప్పిన 5 ముఖ్య సూత్రాలు..

3

మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు..

4

దీపావళి నుంచి ఈ 4 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం.. పట్టిందల్లా బంగారమే.. భారీగా ధనలాభాలు!

5

Raptadu Case: రాప్తాడు నిందితుడి కుడికాలు తొలగింపు.. కోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి సర్జరీ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Manchester Sexual Abuse Trial: కట్టుకున్న భార్యకే నరకం చూపించాడు. ఒకటి కాదు రెండు 20ఏళ్లకు పైగా మత్తు మందు ఇచ్చి నరకం చూపించాడు. ఆమె స్ప్రహలో లేనిప్పుడు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. ఆ అక్రుత్యాలను తన ఫోన్ లో భద్రపరిచాడు ఈ నీచుడు. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఈ అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్యకే దాదాపు 20 ఏళ్లకు పైగా తెలియకుండా మత్తుమందు ఇస్తూ, ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో అత్యాచారానికి పాల్పడిన భర్త వికృత రూపం బయటపడింది. అంతేకాకుండా ఆ దారుణాలన్నింటినీ అతడు తన ఫోన్‌లో ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరిచాడు.

ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడి ఫోన్ నుంచి ఏకంగా 10 లక్షలకు పైగా ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకుని షాక్‌కు గురయ్యారు. ఈ క్రూరమైన వ్యవహారంలో ప్రధాన నిందితుడైన భర్తతో సహా ఐదుగురు ఇప్పటికే తమ నేరాన్ని అంగీకరించారు. కాగా.. ఈ అకృత్యాలలో భాగస్వామ్యమున్న మరో 9 మంది నిందితులపై సోమవారం మాంచెస్టర్‌లోని మిన్‌షుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టులో న్యాయస్థాన విచారణ ప్రారంభమైంది.

అయితే బాధితురాలి గోప్యతను కాపాడేందుకు భర్త పేరును వెల్లడించలేదు అధికారు. 60ఏళ్ల వయస్సుకన్న ఆ భర్త.. అత్యాచారం, లైంగిక దాడి, మత్తు మందు ఇవ్వడం, అసభ్యకర ఫొటోలు పంచుకోవడం వంటి 62 అభియోగాలను గత సెప్టెంబర్ లోనే అంగీకరించాడు. అరెస్ట్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న అతని ఫోన్ లో 10 లక్షలకు పైగా ఫొటోలు, వీడియోలు లభించాయని ప్రాసిక్యూటర్ లూయిస్ ఓక్లీ కోర్టుకు వెల్లడించారు. ఆ ఫోన్లో అతని పైశాచిక లైంగిక వాంఛలు, అత్యాచారాలకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ఉందని.. కొన్ని ఆధారాలు 2004 నాటివని ఆమె తెలిపారు.

ఇక విచారణలో మరిన్ని దిగ్బ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ దంపతులు వారి స్నేహితులు, బంధువులతో ఎంతో సాధారణ జీవితం గడిపేవారు. విహారయాత్రలకు వెళ్లే వారు. రిటైర్మెంట్ ప్లాన్ వేసుకుంటూ అందెవలే కనిపించేవారు. కానీ తెరవెనక భర్త తన భార్యకు తరచుగా మత్తమందు ఇచ్చి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అత్యాచారానికి పాల్పడేవాడు. గడిచిన 9ఏండ్లుగా తాను శ్రుంగారానికి దూరంగా ఉన్నానని 60ఏళ్ల వయస్సుకన్న ఆ భార్య భావించడం ఈ ఘటనకు తీవ్రతకు అద్దం పడుతోంది.

2023 నుంచి నిందితుడు తన పైశాచికత్వాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇతర వ్యక్తులను కూడా ఇంటికి ఆహ్వానించ భార్య స్ప్రుహలో లేనప్పుడు వారి చేత కూడా అత్యాచారం చేయించినట్లు బయటపడింది. అంతటితో ఊరుకోలేదు.. ఆ దారుణాలన్నింటినీ వీడియో తీశాడు. కొంతమంది నేరుగా ఈ అఘాయిత్యంలో పాల్గొన్నారు. మరికొంతమంది దూరంగా ఉండి ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫ్రాన్స్ లో సంచలనం రేకెత్తించిన డొమినిక్ పెలికాట్ కేసును ఈ ఘటన గుర్తు చేస్తోంది. ప్రస్తుతం నిందితులుగా ఉన్న 9మందిపైగా విచారణ కొనసాగుతోంది. 

Also Read: 

అన్నం పెట్టేశారు.. తాళం వేసేశారు..పాఠశాల పనివేళల్లో టీచర్ల నిర్వాకం..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
World News
Telugu News