SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కుక్కకు రోజూ చికెన్ ముక్కలు.. చివరకు 54 కిలోల బరువు.. యజమానికి కోర్టు షాక్!

Viral News: ఓ మహిళ పెంపుడు కుక్కకు అతిగా తిండి పెట్టడం కారణంగా మరిణించిదని కోర్టు ఆమెకు 2 నెలల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా జీవితంలో ఎప్పుడు ఇతర జంతువులను పెంచుకోవద్దని నిషేధం విధించిన్నట్లు తెలిపింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 02:01 PM IST | Updated: Oct 16, 2026, 02:02 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Viral Telugu News: పెంపుడు జంతువులపై మితిమీరిన ప్రేమ ఒక్కోసారి వాటి ప్రాణాలకే ముప్పుగా మారుతూ వస్తోంది.. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగిన సంగతి మనకు తెలిసిందే.. అయితే, ఇప్పుడు జరిగిన ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది.. పెంపుడు కుక్కకు భారీగా ఆహారం తినిపించి.. అది తీవ్రమైన స్థూలకాయంతో కదలలేని స్థితికి చేరుకుని.. ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఓ మహిళకు.. న్యూజిలాండ్ న్యాయస్థానం రెండు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ వచ్చింది. మూగజీవుల పెంపకంలో నిర్లక్ష్యం వహించినందుకు.. ఆమెకు జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి జంతువులను పెంచుకోకుండా నిషేధం కూగా విధించింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆక్లాండ్‌కు చెందిన ఓ మహిళ తన పెంపుడు కుక్క నుగ్గి (Nuggi)కి ప్రతి రోజు పెట్టే.. డాగ్ బిస్కెట్లకు అదనంగా.. రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పది చికెన్ ముక్కలను ఆహారంగా పెట్టేదట.. వ్యాయామం లేకపోవడంతో పాటు అతిగా ఆహారం తీసుకోవడంతో, ఆ కుక్క విపరీతంగా లావైపోయింది.. 2021లో జంతు సంరక్షణ సంస్థ ఎస్‌పీసీఏ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టిన సమయంలో.. నుగ్గి ఏకంగా దాదాపు 54 కిలోల బరువుతో కనిపించింది.. అధిక బరువు కారణంగా ఆ కుక్క కనీసం 4 అడుగులు కూడా ముందుకు వేయలేక.. తీవ్ర నొప్పితో అవస్థలు పడుతూ నేలపైనే పడి ఉండేదట..

పరిస్థితిని గమనించిన అధికారులు నుగ్గిని రక్షించి చికిత్స అందించే ప్రయత్నం చేశారట.. అతిగా బరువు పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో అది మరిణించింది. అనంతరం నిర్వహించిన జంతువుల శవపరీక్షలో నుగ్గి లివర్ వ్యాధితో పాటు.. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వచ్చే కుషింగ్స్ వ్యాధితో బాధపడినట్లు వైద్యులు వెల్లడించారు. తాము తమ సర్వీసులో చూసిన అత్యంత బరువైన మూగజీవుల్లో నుగ్గి ఒకటని ఎస్‌పీసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించిన్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్లక్ష్యాన్ని జంతు హింసగా పరిగణించిన స్థానిక న్యాయస్థానం... ఆ మహిళకు 2 నెలల జైలు శిక్ష ఖరారు చేసిందట. దీనితో పాటు రూ. 1,222 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిందని అధికారులు తెలిపారు.. అలాగే ఆమె జీవితంలో ఎలాంటి పెంపుడు జంతువులను పెంచుకోకూడదంటూ.. కఠిన ఆంక్షలతో కూడిన నిషేధం విధించిన్నట్లు తెలుస్తోంది.. జంతువులను ప్రేమించడమంటే కేవలం ఆహారం పెట్టడం మాత్రమే కాదని.. వాటి ఆరోగ్య పరిరక్షణ కూడా యజమానుల ప్రాథమిక బాధ్యతని ఈ తీర్పు స్పష్టం చేసింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES