United Nations: ఐక్యరాజ్య సమితి మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కాడు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్. ఈ నేపథ్యంలో యూఎన్‌లోని భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పెటల్ గహ్లోత్. పాకిస్థాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదానికి పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. పాక్ ప్రధాని చేసిన ప్రసంగానికి ప్రతిస్పందించే భారత హక్కును వినియోగించుకుంటూ ఈ మేరకు కీలెరిగి వాత పెట్టారు.
యూఎన్‌లో షరీఫ్ ప్రసంగంపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పెటల్ గహ్లోత్ మరోపారి ఐక్యరాజ్య సమితి వేదికగా స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ గురించి మాట్లాడాలనుకుంటే పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలోని ప్రజల పరిస్థితిని కూడా చర్చించాలని సూచించారు. ప్రత్యేకంగా పీఓజేకేలో ఉన్న రావలకోట్ ప్రజలను ఉద్దేశించి అక్కడి హింస, హక్కుల సమస్యలపై ప్రశ్నించాలని పేర్కొన్నారు. పాకిస్థాన్ తన ఆధీనంలోని ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించడంపై సమాధానం చెప్పాలని కోరారు.
పాక్‌ది ఉగ్రవాదానికి మూల్యం చెల్లించక తప్పదు..
భారత్‌పై సరిహద్దు ఉగ్రవాదాన్ని కొనసాగించే పాకిస్థాన్‌కు ఇకపై కూడా తగిన సమాధానం ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటుందని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి పరిణామాలు ఉంటాయని యూఎన్ వేదికగా భారత్ వైఖరిని స్పష్టం చేశారు పెటల్ గహ్లోత్. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు పాకిస్థాన్ చెబుతున్నప్పటికీ, వాటి విషయంలో ఆ దేశ వైఖరిపై అనేక సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయన్నారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ చెబుతున్న మాటలను కాకుండా, ఆ దేశ చర్యలను పరిశీలించాలని అంతర్జాతీయ సమాజానికి సూచించారు.
షెహ్‌బాజ్ షరీఫ్ తన యూఎన్ ప్రసంగంలో 2025లో జరిగిన భారత్–పాకిస్థాన్ సైనిక ఘర్షణను కూడా ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్ల ఉద్రిక్తతలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ను ప్రశంసిస్తూ, ఆయన సకాలంలో చేసిన జోక్యం దక్షిణాసియాలో భారీ ప్రాణనష్టాన్ని నివారించిందని షరీఫ్ చెప్పారు.
షరీఫ్ ప్రసంగ వీడియో షేర్ చేసిన ట్రంప్..
షరీఫ్ యూఎన్ ప్రసంగంలోని ఓ వీడియో క్లిప్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికపై షేర్ చేశారు. సుమారు 87 సెకన్ల క్లిప్‌లో షరీఫ్, ఆపరేషన్ సిందూర్ దాడిగా అభివర్ణిస్తూ, అమెరికా అధ్యక్షుడి జోక్యాన్ని ప్రశంసించారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా కొనియాడారు.