SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పాఠశాలలో తుపాకీతో విరుచుకుపడ్డ 16 ఏళ్ల కుర్రాడు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురి మృతి..!!

School Shooting Victims: అమెరికాలో దారుణం జరిగింది. ఒరెగాన్ లోని బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ పాఠశాలలో 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కాగా నిందితుడిని ఓ సామాన్య పౌరుడు వెంబడించి కాల్చి చంపాడు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 16, 2026, 08:56 AM IST | Updated: Oct 16, 2026, 08:57 AM IST
Image Credit: School Shooting Victims
Join

School Shooting Victims: అమెరికాలో దారుణం జరిగింది. ఒరెగాన్ లోని బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ పాఠశాలలో 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కాగా నిందితుడిని ఓ సామాన్య పౌరుడు వెంబడించి కాల్చి చంపాడు.

స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. ఓ పొడవాటి గన్ తో స్కూళ్లోకి ప్రవేశించిన నిందితుడు.. తాళం వేసి ఉన్న డోర్లను కాల్చుకుంటూ లోపలికి వెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 5,8,11ఏళ్ల వయస్సుకన్న ముగ్గురు చిన్నారులతోపాటు ఒక టీచర్ అక్కడికక్కడే మరణించారు. మరో టీచర్..7ఏళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వారిని సెయింట్ చార్లెస్ మెడికల్ సెంటర్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మధ్యాహ్నం 12:59 గంటలకు పాఠశాల సమీపంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు మొదట సమాచారం అందింది. నిమిషాల వ్యవధిలోనే, పాఠశాలలో కాల్పులు జరిగాయని కాల్స్ వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 1:02 గంటలకు పోలీసులు పాఠశాలకు చేరుకునేసరికి, తుపాకీ గాయాలతో నిందితుడు మరణించాడు. తుపాకీతో ఉన్న వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించడాన్ని ఒక పౌరుడు చూసి, అతడిని వెంబడించి కాల్చి చంపాడని బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంట్జ్ తెలిపారు.

ఈ ఘటన కారణంగా బెండ్-లా పైన్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని పాఠశాలలను శుక్రవారం మూసివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్‌బిఐ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎవరు? అతనికి పాఠశాలతో ఏమైనా సంబంధం ఉందా? కాల్పులకు దారితీసిన కారణాలు ఏమిటి? వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆకస్మిక దాడితో సమాజం దిగ్భ్రాంతికి గురైందని, ఇది మాటల్లో చెప్పలేని విషాదమని పాఠశాల సూపరింటెండెంట్ స్టీవెన్ కుక్ అన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES