Several people missing in 18 storey building collapse In kenya: కెన్యా రాజధాని నైరోబీలోని ఈస్ట్‌లీ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 18 అంతస్తుల బిల్డింగ్ పేకమేడలా కూలిపోయింది.ఈ విషాదం అక్టోబర్ 23న మధ్యాహ్నం ప్రాంతంలొ భవనం కుప్పకూలిపోయింది. ఈ భవనం శిథిలాల కింద వందల మంది కార్మికులు, నివాసితులు చిక్కుకున్నారు. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ట్రానిక్స్ షాపులు, ఇతర దుకాణాలు ఉన్నాయి. ఈ క్రమంలో బిల్డింగ్ భారీ శబ్దంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది.
ఘోరం.. కుప్పకూలిన 18 అంతస్తుల బిల్డింగ్ కెన్యా రాజధాని నైరోబీలోని ఈస్ట్‌లీ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన అక్టోబర్ 23న మధ్యాహ్నం 1 గంట సమయంలో కుప్పకూలిన భవనం నిర్మాణం ఇంకా జరుగుతుండగానే.. పేకమేడలా కూలిపోయిన బిల్డింగ్ భవనం పైభాగంలో నివాసితులు లేరు కానీ.. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ట్రానిక్స్ షాపులు, ఇతర దుకాణాలు ఉన్నాయి పలువురు కార్మికులు సైతం అక్కడే ఉన్నారని.. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్ ఇప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు భవన నిర్మాణం ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తింపు.. బిల్డింగ్ ఓనర్‌పై లీగల్ చర్యలు తీసుకుంటామన్న అధికారులు ఈ భవనానికి అవసరమైన అనుమతులు ఉన్నాయో లేదో, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో దర్యాప్తు షురూ!
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 24, 2026
T
ఎక్కడ చూసి శిథిలాలు, దుమ్ము , ధూళితో నిండిపోయింది. వెంటనే స్థానికుల సమాచారంతో వివిధ శాఖలకు చెందిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. శిథిలాల నుంచి పలువురిని బైటకు తీశారు. ఘటనపై విచారణ చేపట్టారు. అంబులెన్స్ లను సిద్దంగా ఉంచారు. శిధిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలను రప్పించారు. భవన నిర్మాణం ప్రమాణాలు అనుగుణంగా లేదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బిల్డింగ్ ఓనర్ పై లీగల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బిల్డింగ్ కు ఆ పర్మిషన్ లేదు..
కెన్యాలోని ఈస్ట్ లీ ప్రాంతంలో కూలీ పోయిన బిల్డింగ్ ఉన్న 9వ వీధి ఈ బిల్డింగ్ జూలై 30, 2025న నమోదు చేయబడిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దాని రికార్డులలో డెవలపర్‌గా 9వ స్ట్రీట్ ప్లాజా లిమిటెడ్ పేరు ఉండగా, స్ట్రోమాక్స్ హోల్డింగ్స్ EA లిమిటెడ్ కాంట్రాక్టర్‌గా పేర్కొనబడిందని గుర్తించారు. భవన నిర్మాణానికి ఆమోదం లభించినప్పటికీ, దానికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేదని అధికారుల విచారణలో బైటపడింది .
అంతే కాకుండా పై అంతస్తులలో నిర్మాణం జరుగుతుండగా, అవసరమైన అనుమతి లేకుండా కింది అంతస్తులో దుకాణాలు నడపడానికి అనుమతి లేదని ఆయన చెప్పారు. చాలా వరకు ఉల్లంఘనలు ఈ బిల్డింగ్ లో జరిగినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు రాబట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బిల్డింగ్ శిథిలాలలను తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.