SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు బుల్లెట్ రైళ్లు ఢీ.. 39 మంది మృతి, భయానక దృశ్యం!

Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దాదాపు 39 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. రెండు హైస్పీడ్‌ రైళ్లు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 28, 2026, 03:31 PM IST | Updated: Oct 28, 2026, 03:57 PM IST
Image Credit: Spain Train Crash
Join

Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 39 మంది ఇప్పటి వరకు దుర్మరణం చెందారు.  రెండు హై స్పీడ్‌ రైళ్లు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్పెయిన్‌ రైల్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌ ఏడీఐఎఫ్‌ తెలిపింది. దీంతో మాడ్రిడ్‌, సియుడాడ్‌ అండాలూసియా మధ్య తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు.

 

 

ఇక రోజు ఈ ట్రైన్‌ ప్రమాదం ధాటికి ఒక్కసారిగా ఒక హైస్పీడ్‌ రైలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న చెట్లు ఉన్న ప్రదేశంలో పడిపోయింది. రెండూ హై స్పీడ్‌ రైళ్లు కావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.  సమాచారం అందుకున్న రిస్క్యూ టీమ్‌ ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక చనిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఏర్పాటు చేసి వారిని గుర్తిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు రైలు నుజ్జునుజ్జు అయింది. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

స్పెయిన్‌లోని టోలెడలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంపై ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ స్పందించారు. ఈ ప్రమాద వార్త విని తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్లు అయిన ట్వీట్‌ చేశారు. సంబంధిత అధికారులను ప్రమాదం జరిగిన తీరు, పరిస్థితులపై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా అన్నారు. పరిపాలనా విభాగాలన్నింటి సమన్వయంతో, బాధితులకు సహాయం చేయలని ఆదేశించారు. అత్యవసర సేవల సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. బాధితులందరికీ వారి కుటుంబాలకు నా సానుభూతి అంటూ ట్వీట్‌ చేశారు.

 

ప్రమాదం జరిగింది ఇలా..
ఇక ప్రభుత్వ అధికారి ఒకరు ఈ స్పెయిన్‌లో జరిగిన బులెట్‌ రైలు ప్రమాదం గురించి వివరించారు. కాస్టిల్లా లా మంచా ప్రాంతంలో రాన్ఫే, ఇరియో ట్రైన్‌ ఒకదానికి మరొకటి భారత కాలమానం ప్రకారం అతి వేగంగ వచ్చి ఢీకొన్నాయి. దీంతో ఇరియ రైలుకు సంబంధించిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో వెంటనే స్థానిక మేయర్‌ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదంలో మొదట 10 మంది చనిపోయినట్లు గుర్తించారు. దాని తర్వాత 39 కి మరణాల సంఖ్య చేరింది.

Read Also: ఫ్రాన్స్ సంక్షోభానికి కారణమైన మాక్రాన్ 5 బ్లండర్ మిస్టేక్స్.. యూరప్‌పై పడనున్న తీవ్ర ప్రభావం! ఏకైక మార్గం ఇదేనా?

Read Also: ఫ్రాన్స్ పరిస్థితికి వలసలే కారణం.. పారిస్‌ ముస్లిం సిటీగా మారిపోతుంది! వెంటనే బార్డర్స్‌ మూసేయండి: ట్రంప్!

జనవరిలో కూడా ఇలాంటి ప్రమాదమే..
ఈ ఏడాది జనవరిలో కూడా స్పెయిన్‌లో ఇలాంటి ఘోర రైలు ప్రమాదమే చోటు చేసుకుంది. 
రాత్రి 7:45 దక్షిణ స్పెయిన్‌లోని కార్డోబా సమీపంలో, మలాగా నుండి మాడ్రిడ్‌కు వెళ్తున్న రైలు ఘోర ప్రమాదానికి గురైంది. 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పి, రాజధాని నుండి మరో దక్షిణ నగరమైన హుయెల్వాకు సుమారు 200 మంది ప్రయాణికులతో వస్తున్న రైలును ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోగా, 150 మందికిపైగా ప్రయాణీకులకు గాయాలయ్యాయి. 2013 తర్వాత స్పెయిన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఇది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES