• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /North America Telugu Society: అమెరికాలో అంబరాన్నంటిన తెలుగు పండుగ సంబరాలు..!

North America Telugu Society: అమెరికాలో అంబరాన్నంటిన తెలుగు పండుగ సంబరాలు..!

NATS: మనం ఎక్కడ ఉన్నా.. మన భాష, సంస్కృతి, సేవా గుణం ఎల్లప్పుడూ సజీవమేనని అమెరికాలోని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన తెలుగు సంబరాలు ప్రవాసులను అలరించగా.. మిషిగన్‌లో ఏర్పాటైన నాట్స్ నూతన విభాగం స్థానిక తెలుగు వారికి భరోసానిచ్చే సేవా వేదికగా ముందడుగు వేసింది.

Written ByAshok Krindinti
Published: Oct 17, 2026, 09:13 AM IST|Updated: Oct 17, 2026, 05:17 PM IST
joinshare
North America Telugu Society: అమెరికాలో అంబరాన్నంటిన తెలుగు పండుగ సంబరాలు..!
Image Credit: North America Telugu Society

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన  అమ్మాయిలు.. వీడియో ..

Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన అమ్మాయిలు.. వీడియో ..

2

Rain Alert: తెలంగాణ, ఏపీకి చల్లటి కబురు.. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన

3

Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం.. భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

4

Vangaveeti Radha: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా అతడే!

5

Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NATS: అమెరికా గడ్డపై సంస్కృతి, సాంప్రదాయాలు, సేవా దృక్పథాన్ని చాటుతూ.. తెలుగుదనం వెల్లివిరిసింది. ఒకవైపు షార్లెట్‌లో తెలుగు పండుగ కన్నులపండువగా సాగగా.. మరోవైపు మిషిగన్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సరికొత్త చాప్టర్‌తో సేవా ప్రస్థానాన్ని విస్తరించింది. స్థానిక ప్రవాస తెలుగు వారు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ రెండు వేడుకలను విజయవంతం చేశారు. షార్లెట్ నగరంలో నిర్వహించిన 'షార్లెట్ తెలుగు సంబరాలు 2026' గ్రాండ్‌గా ముగిశాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీతం, సంప్రదాయ నృత్యాలు, ఉర్రూతలూగించిన ఫ్రీస్టైల్ డ్యాన్సులు అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన ‘సైన్స్ ఫెస్ట్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. డ్రై ఐస్ మ్యాజిక్, ప్లాస్మా బాల్ ప్రదర్శనలతో పాటు 9 రకాల వైజ్ఞానిక ప్రయోగాలను చిన్నారులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ ప్రయోగాత్మక ప్రదర్శనలు పిల్లల్లో సైన్స్ పట్ల అమితమైన ఆసక్తిని రేకెత్తించాయి. తానా, జీటీఏ, ఆప్టా వంటి ప్రముఖ తెలుగు సంఘాల సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమానికి నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 800 మందికి పైగా కొత్త సభ్యులుగా నమోదు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు.. భాషా సంస్కృతుల పరిరక్షణ, సేవా విస్తరణే ధ్యేయంగా ఫార్మింగ్టన్ హిల్స్ వేదికగా నాట్స్ మిషిగన్ చాప్టర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కొత్త విభాగానికి శ్రీదేవి మణేపల్లి కోఆర్డినేటర్‌గా, మహి బొల్లవరం జాయింట్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రవి చాలంటి (ఈవెంట్స్ & లాజిస్టిక్స్), హేమ సూరపరాజు (ట్రెజరర్), జ్యోతి జవ్వాది (మెంబర్‌షిప్), అనుపమ దివాకర్ల (పీఆర్ & మీడియా) నూతన కార్యవర్గంలో కీలక బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న తెలుగు వారికి తమ హెల్ప్‌లైన్ ద్వారా అందిస్తున్న అత్యవసర సహాయ కార్యక్రమాల గురించి వివరించారు. నిస్వార్థ ప్రజాసేవకు, సమాజ హితానికి నాట్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడా తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మనోరమ గాంధీ, కూచిపూడి కళా ప్రోత్సాహకురాలు సంధ్య శ్రీ ఆత్మకూరి, తెలుగు వెలుగులను పంచుతున్న 'మనబడి' బృందం, సామాజిక కార్యకర్త సన్నీ రెడ్డి, వైద్య-సినీ రంగాల్లో ప్రతిభ చాటుతున్న డాక్టర్ హరినాథ్ పోలిచెర్లను వేదికపై సత్కరించారు. 

స్థానిక విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆప్టా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్, డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా సాధికారత, యువ నాయకత్వం, ఆరోగ్యం, క్రీడలు, సాంస్కృతిక వికాసాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి మూడు నెలలకొకసారి భారీ సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని మిషిగన్ చాప్టర్ నిర్ణయించింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Telugu News