SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Cyclone Arnab LIVE: యానాం వద్ద తీరం దాటిన అర్నబ్.. రాష్ట్రంలో తుఫాన్ విలయం..!

Cyclone Arnab Live Updates: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో బలపడిన ఈ తీవ్ర తుఫాన్ యానాం-నర్సాపురం మధ్య తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. అర్ధరాత్రి నుంచే ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తుతోంది. అర్నాబ్ తుఫాన్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Written By Ashok Krindinti
Published: Oct 28, 2026, 10:46 AM IST | Updated: Oct 28, 2026, 11:43 AM IST
Image Credit: Cyclone Arnab Live Updates
Join

Cyclone Arnab Live Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ తీరం దాటింది. యానాం-నర్సాపురం మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోస్తాంధ్రతో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచే భీకర గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అటు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని విశాఖ, మన్యం, అల్లూరి జిల్లాల్లో నదులు, జలపాతాలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలగా, అల్లూరిలో వరద తీవ్రతకు కల్వర్టు కొట్టుకుపోయింది. అర్నాబ్ తుఫాన్ కదలికలు, వర్ష తీవ్రత, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ మీకోసం..
 

28 Oct 2026, 11:43 AM

కోనసీమ అల్లకల్లోలం..

28 Oct 2026, 11:20 AM

హోంమంత్రి అనిత పర్యటన

AP Rains Live Updates: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన.

ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి అనిత.

ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు గ్రామంలో ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న హోంమంత్రి.

పునరావాస కేంద్రంలో అందుతున్న వసతులపై ప్రజలను ఆరా తీసిన మంత్రి అనిత.

పునరావాస కేంద్రంలో అధికారులు అందుబాటులో ఉంటున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్న మంత్రి.

అధికారులు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని తెలిపిన గ్రామస్తులు.

పునరావాస కేంద్రంలో అందుతున్న సేవలు, వసతులపై సంతృప్తి వ్యక్తం చేసిన గ్రామస్తులు.

28 Oct 2026, 11:08 AM

కోనసీమ జిల్లాలో బీభత్సం

AP Rains Live Updates: అర్నబ్ తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీభత్సం సృష్టించింది. అరటి రైతుల కష్టంపై ప్రకృతి పగబట్టినట్లుగా విరుచుకుపడింది. ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల్లో  వేలాది ఎకరాల్లో అరటి చెట్లు నిలువునా నేలకొరిగాయి. ఎకరానికి సుమారు రెండు లక్షల వరకూ పెట్టుబడి పెట్టిన  రైతులు పూర్తిగా కుదేలయ్యారు‌.‌ 

28 Oct 2026, 11:06 AM

మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్

AP Rains Live Updates: అర్నబ్ తుపాన్ ప్రభావం ఉన్న మునిసిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ

తుపాన్ ప్రభావంతో పట్టణాల్లో జన జీవనానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి

రోడ్లపై చెట్లు కూలిన చోట వెంటనే తొలగించేలా తగిన యంత్రాలతో సిబ్బంది అలెర్ట్ గా ఉండాలి

ఈదురు గాలులతో ప్రమాదకర హోర్డింగ్ ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి

రోడ్లుపై ,డ్రెయిన్ లలో నీరు నిలువకుండా ఇంజినీరింగ్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టాలి

వర్షం కారణంగా పారిశుధ్య సమస్యలు, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

28 Oct 2026, 10:51 AM

బలహీనపడిన అర్నబ్‌ తుఫాన్

AP Rains Live Updates:

  • అతి తీవ్ర తుపాన్‌ నుంచి తీవ్ర తుపాన్‌గా బలహీనపడిన అర్నబ్‌
  • ఈ ఉదయం 8:30 గంటలకు తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటన
  • ఆంధ్రప్రదేశ్‌–యానాం తీరాన్ని దాటిన తుపాన్‌
  • తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య తీరందాటిన తుపాన్
  • యానాంకు నైరుతి దిశగా తీరాన్ని దాటిన అర్నబ్‌
  • నర్సాపురానికి తూర్పు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటిన తుపాన్ కేంద్రం
  • యానాంకు నైరుతిగా 40 కిలోమీటర్లు.. కాకినాడకు నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రం
  • తీరం దాటే సమయంలో గంటకు 125–135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
  • గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడి
  • తుపాన్ కేంద్ర ప్రాంతం పూర్తిగా భూభాగంలోకి ప్రవేశించడంతో తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు అధికారుల ప్రకటన
  • తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికారుల సూచనలు పాటించాలి
28 Oct 2026, 10:48 AM

పశ్చిమగోదావరి జిల్లాలో..

AP Rains Live Updates: పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంత మండలాలైన నరసాపురం, మొగల్తూరులో అర్నాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భీకర ఈదురుగాలుల ధాటికి ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి.. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.. కొబ్బరి, తాటి చెట్లు సైతం నేలమట్టమయ్యాయి. గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు సమాచారం. తుఫాన్ దెబ్బకు పలు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. తీర ప్రాంతంపై తుఫాన్ విరుచుకుపడటంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది.

భీకర గాలుల ధాటికి భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు కూలిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్ల పైకప్పులు దెబ్బతినడంతో బాధితులు తలదాచుకునేందుకు ఆశ్రయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుతాళ్లు, సీతారాంపురం, మర్రితిప్పతో పాటు పలు గ్రామాల్లో రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రొక్లైనర్ల సాయంతో చెట్లను తొలగిస్తూ రహదారులను పునరుద్ధరిస్తున్నాయి.
మరోవైపు తుఫాన్ బాధితులను నరసాపురం పట్టణంలోని మిషన్ హైస్కూల్ తో పాటు నియోజవర్గంలో 24సా పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసి, నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES