Cyclone Arnab Tracker Live Updates: వణికిస్తున్న అర్నబ్.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Cyclone Arnab Live Updates: బంగాళాఖాతంలో ఎర్పడిన తుపాను అతి తీవ్ర తుఫాన్‌గా బలపడింది. అది గడిచిన కొన్ని గంటల్లో 25 కిలోమీటర్ల వేగంతో AP తీరంవైపు దూసుకువస్తోంది. రేపు ఉదయం బాపట్ల-విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో 140 కిలోమీటర్లలో ఈదురు గాలలులు వీస్తాయంటోంది. ఈ సమయంలో సముద్రంలోని అలలు 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయి.
Cyclone Arnab Tracker Live Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావం అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, కాకినాడ, యానాంలోని తీర సమీప ప్రాంతాలను అలలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉండగా దట్టమైన మేఘాల వల్ల దిశ మారే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చంటున్నారు.
ప్రస్తుతం విశాఖకు 300 కిలో మీటర్లు, కాకినాడకు 360 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. రేపు ఉదయం బాపట్ల-విశాఖ మధ్య యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. అర్నబ్ తుపాను తీరానికి సమీపించే కొద్ది తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటోంది. ఇది అతి తీవ్ర తుపానుగా తీరం దాటనుండడంతో ప్రచండ గాలులకు తోడు, తీర ప్రాంతమంతటా 20 సెంటీ మీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం ఇవాళ రేపు సెలవులు ప్రకటించింది. విశాఖ నుంచి వెళ్ళే 53 రైళ్ళును రైల్వేశాఖ రద్దు చేసింది. లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
ఆర్నబ్ తుఫాన్ కాకినాడ... కోనసీమ జిల్లాల మధ్యలో
Arnab Live Updates:ఆర్నబ్ తుఫాన్ కాకినాడ... కోనసీమ జిల్లాల మధ్యలో
కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద తీరం దాటే హెచ్చరికల నేపథ్యంలో పాండిచ్చేరి అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యారు.
రోడ్ల పై జన సంచారం తగ్గించే చర్యల్లో భాగంగా
ఇవాళ సాయంత్రం నుంచి రెండు రోజులు పాటు
యానాంలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నారు.
యానాంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి
29వ తేదీ వరకు అన్ని వైన్ షాపులు ... బార్ లు
... లిక్కర్ సరఫరా చేసే హోటల్స్ మూసి వేయాలని
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
మరో వైపు అర్నబ్ తుఫాన్ ప్రభావం యానాంపై అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో
స్థానిక ఎమ్మెల్యే..... పుదుచ్చేరి ప్రజా పనుల
శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు హుటాహుటిన
యానాం చేరుకున్నారు. ప్రాంతీయ పరిపాలన అధికారి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే
జనరేటర్ల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని
మంత్రి మల్లాడి ఆదేశాలు జారీ చేశారు.
.......
ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుఫాను హెచ్చరిక .. రెడ్ అలర్ట్.
Arnab Live Updates:పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన “అర్నబ్”
ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుఫాను హెచ్చరిక — రెడ్ అలర్ట్..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను “అర్నబ్” గత 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దాదాపుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలింది.
ఈ తుఫాను నేడు, 2026 అక్టోబర్ 27వ తేదీ ఉదయం 08:30 గంటల IST సమయానికి అదే ప్రాంతంలో, ఉత్తర అక్షాంశం 16.0° మరియు తూర్పు రేఖాంశం 84.3° వద్ద కేంద్రీకృతమై ఉంది.
ఈ తుఫాను కేంద్రం సమీపంలోని ప్రాంతాల నుంచి ఉన్న దూరాలు:
- విశాఖపట్నానికి (ఆంధ్రప్రదేశ్) దక్షిణ-ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు;
- కాకినాడకు (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు;
- మచిలీపట్నానికి (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు;
- గోపాల్‌పూర్‌కు (ఒడిశా) దక్షిణంగా 370 కిలోమీటర్లు;
- బాపట్లకు (ఆంధ్రప్రదేశ్) తూర్పుగా 410 కిలోమీటర్లు;
- శ్రీ విజయ పురం (అండమాన్ దీవులు) నుంచి పశ్చిమ-వాయవ్యంగా 1,030 కిలోమీటర్లు.
తుఫాను కదలిక మరియు తీరం దాటే అవకాశం:
ఈ తుఫాను అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది.
2026 అక్టోబర్ 28వ తేదీ ఉదయం పూర్వాహ్న సమయంలో, బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరాలను తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉంది.
ఆ సమయంలో తుఫాను గరిష్ఠంగా గంటకు 125–135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలి వేగం అప్పుడప్పుడు గంటకు 150 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
తుఫాన్ ప్రభావంతో కోనసీమలో పూర్తిగా మారిపోయిన వాతావరణం
Arnab Live Updates: అంబేద్కర్ కోనసీమ జిల్లా
తుఫాన్ ప్రభావంతో కోనసీమలో పూర్తిగా మారిపోయిన వాతావరణం
కోనసీమ జిల్లాపై ప్రారంభమైన అర్నబ్ తుఫాన్ ప్రభావం
పలు చోట్ల చిరుజల్లులు
అల్లవరం నుంచి అంతర్వేది వరకు కోనసీమ జిల్లా తీరంలో ఎగిసిపడుతున్న సముద్రం
నిన్నటి నుంచి సముద్ర తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
67 తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
తీర ప్రాంత గ్రామాల్లో మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తున్న పంచాయతీ అధికారులు
కోనసీమ జిల్లా సరిహద్దులోని యానాం వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం నేపథ్యంలో
అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
అమలాపురంలో NDRF బృందం,
కొత్తపేట లో SDRF బృందం సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం
అమలాపురం జిల్లా కలెక్టరేట్ లో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్.. 08856-293104
తుఫాన్ హెచ్చరికలతో వణికిపోతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
మరో రెండు వారాల్లో ఖరీఫ్ వరి పంట కోతకు వస్తున్న నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన
చేతికి వచ్చిన వరి పంట ఏమవుతుందో అని
రైతుల్లో ఆందోళన
1996 తుఫాన్ గుర్తు చేసుకుంటూ కోనసీమ వాసుల్లో భయం భయం
కోతకు గురైన ఉప్పాడ
Arnab Live Updates:సూరాడ పేట.జగ్గరాజుపేట, మాయా పట్నం, కోనపాపేట తదితర గ్రామాల్లో సముద్రం ముందుకు వచ్చి అలలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమ య్యారు. మరో పక్క ఎన్డిఆర్ఎఫ్ బృందాలు. ఉప్పాడకు చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు సముద్ర తీరప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షించి. మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటే తీర ప్రాంతాన్ని ఆనుకుని నివసిస్తున్న మత్స్యకారులు పునరావాస కాలనీలకు వెళ్లాలని ఇప్పటికే గ్రామాల్లో ప్రజలకు తెలియజేశారు.
ఎగిసిపడుతున్న అలలు..
Arnab Live Updates:ఎన్నడూ లేని విధంగా ఉప్పాడలో నీటిమట్టం భారీ స్థాయిలో పెరిగి సముద్రపు అలల మధ్య నుండి బీచ్ రోడ్డును తాకుతూ ఎగసిపడుతున్నాయి. మరోపక్క అధికారులు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేశారు. కొత్తపట్నం సమీపంలో కోతకి బీచ్ రోడ్డు కోతకు గురి కాకుండా వేసిన రాళ్ల పైనుండి అలలు ఎగసి పడుతున్నాయి. చిన్న బ్రిడ్జి వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది.
ఉప్పాడ తీరం
Arnab Live Updates: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లిలో వర్షం పడుతుంది. . ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆర్నాబ్ తుఫాను ప్రభావం మొదలైనట్టు కనిపిస్తుంది. .నాలుగు రోజుల నుంచి అధికారులు తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ ప్రభావం యూ కొత్తపల్లి మండలంలో కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా మారింది.కాకినాడ రూరల్ వాకలపూడి నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు మొత్తం పగుళ్లు..కెరటాలతో గండి నిలిచిపోయిన రాకపోకలు.
తెలంగాణపై అర్నబ్ తుపాను ఎఫెక్ట్..
Arnab Live Updates: తెలంగాణపై అర్నబ్ తీవ్ర తుపాను ప్రభావం కనిపిస్తోంది. తుపాను కారణంగా రాత్రి ఉష్ఱోగ్రతలు బాగా పడిపోయాయి. దీనికి తోడు నేటి నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం తెలిపింది. రేపు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటోంది. ఇక గురువారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 28వ తేదీ ఉదయం బాపట్ల- విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, అనంతరం ఉత్తర దిశగా ప్రయాణిస్తుందని నిపుణుల అంచనా.
భారత వాతావరణ శాఖ బులెటిన్
Arnab Live Updates: అత్యంత తీవ్ర తుఫాను “అర్నబ్” (Arnab) — పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది
ఆంధ్రప్రదేశ్ మరియు ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు తుఫాను హెచ్చరిక — రెడ్ మెసేజ్ (Red Message)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అత్యంత తీవ్ర తుఫాను *“అర్నబ్” (ఉచ్చారణ: ఓర్నాబ్)* గత 6 గంటల్లో గంటకు సుమారు 22 కి.మీ. వేగంతో దాదాపు పశ్చిమ దిశగా కదిలింది.
ఈ రోజు, 27 అక్టోబర్ 2026, ఉదయం 05:30 గంటల సమయానికి, అదే ప్రాంతంలో ఉత్తర అక్షాంశం 15.9° మరియు తూర్పు రేఖాంశం 84.8° వద్ద కేంద్రీకృతమై ఉంది.
ఈ తుఫాను కేంద్రం:
- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి ఆగ్నేయంగా 260 కి.మీ. దూరంలో,
- కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 300 కి.మీ. దూరంలో,
- ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 380 కి.మీ. దూరంలో,
- ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి తూర్పుగా 390 కి.మీ. దూరంలో,
- బాపట్లకు తూర్పుగా 460 కి.మీ. దూరంలో,
- అండమాన్ దీవుల్లోని శ్రీ విజయ పురానికి పశ్చిమ-వాయవ్యంగా 980 కి.మీ. దూరంలో ఉంది.
తుఫాను కదలిక మరియు తీరం దాటే అవకాశం..
ఈ తుఫాను అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆ తరువాత వాయవ్య దిశగా కదులుతూ, 2026 అక్టోబర్ 28వ తేదీ ఉదయం పూర్వాహ్న సమయంలో బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరాలను అత్యంత తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉంది.
తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, అప్పుడప్పుడు గాలి వేగం గంటకు 140 కి.మీ. వరకు చేరవచ్చు