• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Heavy Rains Liveblog: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
Live Now

Heavy Rains Liveblog: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

Heavy Rains in Telangana & AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం, రేపు ఉదయానికి అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 25, 2026, 10:33 AM IST|Updated: Sep 25, 2026, 02:13 PM IST
joinshare
Heavy Rains Liveblog: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
Image Credit: Heavy Rains (ZEE Media Telugu/Source)
25 Sep 2026 11:37 IST (IST)
share

రాజమండ్రిలో ముంపు నీటి సమస్య

రాజమండ్రిలో వర్షపు నీరు ముంపు సమస్యను రానున్న నాలుగు లేదా ఐదు నెలల్లో శాశ్వతంగా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. 
రెండు రోజులపాటు ఎడతెరిపి లేని వర్షాలకు రాజమండ్రిలో రోడ్లు... వీధులు జలమయం అయ్యాయి.  నీట మునిగిన ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేను 
సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారని 
మహిళలు ప్రశ్నించారు. 
కూటమి ప్రభుత్వంలో డ్రైనేజీల అభివృద్ధి కారణంగా రాజమండ్రిలో ముంపు సమస్య గతంతో పోల్చుకుంటే తగ్గిందనీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నగరానికి పెద్ద ఎత్తున కేటాయించిన నిధుల్లో 25 కోట్లతో మేజర్ డ్రెయిన్ నిర్మాణంతో శాశ్వత
పరిష్కారం చేస్తామని తెలిపా

25 Sep 2026 12:50 IST (IST)

వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి వద్ద విరిగిపడిన కొండ చరియలు

విజయవాడ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాల ప్రభావంతో గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల కోసం గత మూడు రోజులుగా అధికారుల ముందస్తు నిర్ణయంతో ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయడం వలన, శ్రీ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది.

​ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం ఉదయం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మరియు ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఘాట్ రోడ్డులోని ప్రభావిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు.

​ కొండపై నుండి ఘాట్ రోడ్డుపై జారిపడిన భారీ బండరాళ్లు, రాతిపెళ్లలు, మట్టిని వెంటనే పొక్లెయిన్లు, క్రేన్ల సహాయంతో యుద్ధప్రాతిపదికన తొలగించి మార్గాన్ని శుభ్రం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

​కొండచరియల పై వర్షపు నీటి ఊట కారణంగా మట్టి నానిపోయి ఉందని,ఇంకా ఎక్కడైనా కొండచరియలు జారే అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని సాంకేతిక నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రమాదకరంగా ఉన్న వదులైన రాళ్లను ముందుగానే గుర్తించి నియంత్రిత పద్ధతిలో తొలగించాలని సూచించారు.

కొండచరియలు పడిన ప్రాంతంలో రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) మరియు ఐరన్ ఫెన్సింగ్ రాక్-ఫాల్ నెట్లను మరింత పటిష్టంగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

​ఘాట్ రోడ్డును పూర్తిగా పునరుద్ధరించేందుకు క్షేత్రస్థాయిలో భద్రతా తనిఖీలు పూర్తిచేసే వరకు ఘాట్ రోడ్డు వైపునకు ఎవరినీ అనుమతించవద్దని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

​ఈ సందర్భంగా ఈవో  వి.కె. శీనానాయక్ మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో తాము నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని,గురు వారం రాత్రి తాను ఘాట్ రోడ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇంజినీరింగ్ సిబ్బందిని అప్రమత్తం చేయడం, ముందుజాగ్రత్త చర్యగా ఘాట్ రోడ్డు మూసివేత వల్ల పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు.దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. కన్నబాబు,కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఘాట్ రోడ్ పరిస్థితి పై ఎప్పటికప్పుడు తెలుసుకొని, తక్షణచర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ బృందాలు రంగంలోకి దిగి పనులను వేగవంతం చేశాయని పేర్కొన్నారు.

​ఈ పరిశీలన కార్యక్రమంలో దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్  ఎల్. రమ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

25 Sep 2026 10:58 IST (IST)

కృష్ణా బ్యారేజి గేట్లు ఎత్తివేత

కృష్ణా బ్యారేజ్ 20 గేట్లు ఒక అడుగు మేరా ఎత్తివేత.. 14,500 క్యూసెక్కుల నీరు విడుదల
కేసర, బుడమేరు వాగుల నుంచి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
గేట్ల ఎత్తివేత & నీటి విడుదల: బ్యారేజ్ పరిధిలోని 20 గేట్లను పైకెత్తి 14,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ముందస్తు చర్యలు: బ్యారేజీలో నీటి మట్టం 12 అడుగులకు చేరడంతో, కేసర మరియు బుడమేరు నుంచి వచ్చే వరద నీటిని తట్టుకునేలా బ్యారేజీలో 'కుషన్' (ఖాళీ సామర్థ్యం) ఏర్పాటు చేసేందుకు నీటి మట్టాన్ని తగ్గిస్తున్నారు.
పట్టిసీమ నిలిపివేత: రాబోయే వరదను ఊహించి నిన్నటి నుంచే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపును అధికారులు నిలిపివేశారు.
బుడమేరు వరద అంచనా: బుడమేరు నుంచి సుమారు 4,000 నుండి 5,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని తెలిపారు.
మరుసటి 3 రోజుల ప్రణాళిక: భారత వాతావరణ శాఖ (IMD) అందించిన రాబోయే 3 రోజుల వాతావరణ హెచ్చరికల ప్రకారం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, కాలువలకు నీటిని ఇస్తూనే మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు

25 Sep 2026 11:36 IST (IST)

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షపాతం వివరాలు..

చింతలపూడి (జిల్లా ఏలూరు) 16, చింతపల్లె (జిల్లా అల్లూరి సీతారామరాజు) 14, పోలవరం (జిల్లా ఏలూరు) 14, ఇచ్ఛాపురం (జిల్లా శ్రీకాకుళం) 13, బాలాజీపేట (జిల్లా పార్వతీపురం మన్యం) 12, బొబ్బిలి మండలం సీతారామనగరం (బొబ్బిలి మండలం) పార్వతీపురం మన్యం) 11, నర్సీపట్నం (జిల్లా అనకాపల్లి) 10, మంగళగిరి (గుంటూరు జిల్లా) 10, అరకులోయ (జిల్లా అల్లూరి సీతారామరాజు) 9, చింతూరు (జిల్లా అల్లూరి సీతారామరాజు) 9, నూజివీడు (జిల్లా ఏలూరు) 9, దౌలేశ్వరం (తూర్పు జిల్లా, తిరువూరు జిల్లా) 9, కాకినాడ (కాకినాడ జిల్లా) 9, పెద్దాపురం (కాకినాడ జిల్లా) 9, సోంపేట (శ్రీకాకుళం జిల్లా) 9, లాం(ఎ) (గుంటూరు జిల్లా) 9, కూనవరం (జిల్లా అల్లూరి సీతారామరాజు) 9, గుడివాడ (జిల్లా కృష్ణా) 8, పార్వతీపురం (జిల్లా) పార్వతీపురం (ఎల్లగూడూరు జిల్లా) 8, వేలైర్‌పాడ్ (జిల్లా ఏలూరు) 8, అమరావతి (గుంటూరు జిల్లా) 8, మసులీపట్నం సిడిఆర్ (జిల్లా కృష్ణా) 8, తాడేపల్లిగూడెం (జిల్లా పశ్చిమ గోదావరి) 8, కుకునూరు (జిల్లా ఏలూరు) 8, రాజమండ్రి (జిల్లా తూర్పుగోదావరి) 8, వరరామగులిస్తడ్రాముడు అల్లూరిస్తడ్రామ పార్వతీపురం మన్యం) 8, ప్రకాశం బ్యారేజ్ (జిల్లా ఎన్టీఆర్ జిల్లా) 7, అచ్చంపేట (పల్నాడు జిల్లా) 7, విజయవాడ A.p. (జిల్లా ఎన్టీఆర్ జిల్లా) 7, తెనాలి (గుంటూరు జిల్లా) 7, ఏలూరు (జిల్లా ఏలూరు) 7, యానాం (యానం జిల్లా) 7, పాలకోడేరు (జిల్లా పశ్చిమ గోదావరి) 7, భీమవరం (జిల్లా పశ్చిమ గోదావరి) 7, అనకాపల్లి (జిల్లా అనకాపల్లి) 6, పలాస (శ్రీకాకుళం జిల్లా 6, జిల్లా) మందస (శ్రీకాకుళం జిల్లా) 6, గుంటూరు (గుంటూరు జిల్లా) 6, పాలేరు వంతెన (ఎన్టీఆర్ జిల్లా) 6, నర్సాపురం (జిల్లా పశ్చిమగోదావరి) 5, ప్రత్తిపాడు (జిల్లా కాకినాడ) 5, అవనిగడ్డ (కృష్ణా జిల్లా) 5, తణుకు (జిల్లా పశ్చిమగోదావరి) 5, తణుకు (జిల్లా పశ్చిమగోదావరి) (ఏలూరు జిల్లా) 5, నందిగామ (ఎన్టీఆర్ జిల్లా) 5, సత్తెనపల్లె (పల్నాడు జిల్లా) 5, ఎలమంచిలి (జిల్లా అనకాపల్లి) 5, తుని (కాకినాడ జిల్లా) 5, రేపల్లె (బాపట్ల జిల్లా) 4, తెర్లాం (విజయనగరం జిల్లా) 4, సాలూరు మండలం, చోదవరం (మాన్యాంధ్ర జిల్లా) అనకాపల్లి) 4, అమలాపురం (జిల్లా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ) 4, కొమరాడ (పార్వతీపురం జిల్లా) 4, కళింగపట్నం (జిల్లా శ్రీకాకుళం) 4, కురుపాం (జిల్లా పార్వతీపురం మన్యం) 3, మెరకముడిదం (జిల్లా విజయనగరం జిల్లా) 3, విశాఖపట్నం (విశాఖపట్నం జిల్లా) వలస (పార్వతీపురం మన్యం జిల్లా) 3, వీరఘట్టం (పార్వతీపురం జిల్లా) 3, విశాఖపట్నం (జిల్లా) విశాఖపట్నం) 2, శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) 2, టెక్కలి (శ్రీకాకుళం జిల్లా) 2, పాలకొండ (పార్వతీపురం జిల్లా) 1, చీపురుపల్లె (జిల్లా విజయనగరం) 1, గంట్యాడ (జిల్లా విజయనగరం) 1, గరివిడిపాడు (విజయనగరం జిల్లా) విజయనగరం) 1, భీమునిపట్నం (విశాఖపట్నం జిల్లా) 1, మాచర్ల (పల్నాడు జిల్లా) 1, మెంటాడ (జిల్లా విజయనగరం) 1, గజపతినగరం (విజయనగరం జిల్లా) 1, పిడుగురాళ్ల (జిల్లా పల్నాడు) 1, పాతపట్నం (జిల్లా, శ్రీకాకుళంపల్లి) రాయలసీమ 09/25/2026: పీపల్లి (నంద్యాల జిల్లా) 3, కునుర్పి (అనంతపురం జిల్లా) 3, ఆస్పరి (కర్నూలు జిల్లా) 2, గుంతకల్ (అనంతపురం జిల్లా) 2, సెట్టూరు (అనంతపురం జిల్లా) 1, బ్రహ్మసముద్రం (అనంతపురం జిల్లా) 1, బ్రహ్మసముద్రం (అనంతపురం జిల్లా) కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా) 1

25 Sep 2026 10:52 IST (IST)

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం..

బ్యారేజ్ గేట్లు ఎత్తి 36,250 క్యూసెక్కులు విడుదల.

బ్యారేజీకి ఎగువ నుంచి 40,521 క్యూసెక్కుల వరద.

కృష్ణా పశ్చిమ డెల్టాకు 4,012 క్యూసెక్కుల నీరు విడుదల.

గుంటూరు ఛానల్ కు 239 క్యూసెక్కులు విడుదల

25 Sep 2026 10:39 IST (IST)

నాగావళి, వంశధార నదుల్లో భారీ వరద ఉదృతి..

భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి.

వరద పరిస్థితిపై అధికారులను అలెర్ట్  చేసిన హోంమంత్రి అనిత.

వరద ప్రవాహంపై ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలి.

గొట్టా బ్యారేజి, నారాయణపురం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు.

ముంపునకు అవకాశం ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.

అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.

స్థానిక యంత్రాంగం, ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలను పాటించాలి.

వరద నీటిలోకి ఈతకు, చేపల వేటకు వెళ్లరాదు: హోంమంత్రి అనిత

25 Sep 2026 10:37 IST (IST)

శ్రీకాకుళంలో భారీ వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద ఉదృతి అమాంతంగా పెరిగిపోయింది.. నిన్నటి వరకు ప్రశాంతంగా ప్రవహించిన నదుల ప్రవాహం ఆంధ్రా,ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కారణంగా ఒక్కసారిగా నదులు పోటెత్తుతున్నాయి..
శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, బహుద నదులకు వరద ఉధృతి అమాంతంగా పెరిగింది..నాగావళి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 59,700 క్యూసెక్కులు, వంశధార ఇన్‌ఫ్లో 41,425,
ఔట్‌ఫ్లో42,926 క్యూసెక్కులు కాగా
బహుదా నది కి 34,656 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది.. దీంతో  నదీ తీర పరివాహక ప్రాంతాలు,లోతట్టు ప్రాంతాల ప్రజలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అప్రమత్తం చేశారు. వాయుగుండం ప్రభావం తీరం దాటినప్పటికీ  అక్కడక్కడ భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.. జిల్లాలోని 30 మండలాల్లో వేలాది వృక్షాలు నేలకొరిగాయి.. వేలాది హెక్టార్లలో పంటలు నీట ముంపునకు గురయ్యాయి.. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధం లో ఉన్నాయి. పోలాకి, కవిటి కంచిలి, సంతబొమ్మాళి, ఎల్ ఎన్ పేట,బూర్జ, వజ్రపుకొత్తూరు,టెక్కలి,జీ సిగడాం , గార, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో 9 వేల హెక్టార్లలో పంటలు నీటి ముంపు నకు గురయ్యాయని తాజాగా అంచనా వేస్తున్నారు.. మత్స్యకారులకు సైతం నష్టాన్ని మిగిల్చింది. తీర ప్రాంత 11మండలాల్లో పాఠశాలల కు ఈరోజు కూడా సెలవు ప్రకటించారు..238 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావం తీవ్రంగా నష్టపర్చింది. 

25 Sep 2026 10:36 IST (IST)

తెలంగాణలో వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి వరంగల్‌, ఖమ్మంతోపాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్‌, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఇవాళ గణేష్‌ నిమజ్జనాలు ఉన్నాయి. మరోవైపు వర్ష సూచన ఉండటంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
Telangana Weather
AP Weather
Weather Update

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Low Pressure in Bay Of Bengal: ఇక భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, ముప్పు ప్రాంతాలపై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరోవైపు అల్పపీడనం ప్రభావం ఇవాళ ఉమ్మడి వరంగల్‌, ఖమ్మంతోపాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్‌, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఇవాళ గణేష్‌ నిమజ్జనాలు ఉన్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ,