• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Live Now

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Telugu States Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.అంతేకాదు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 24, 2026, 11:29 AM IST|Updated: Sep 24, 2026, 04:01 PM IST
joinshare
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Image Credit: Heavy Rains in Telangana Andhra pradesh
24 Sep 2026 15:30 IST (IST)
share

కృష్ణాజిల్లా గన్నవరం

భారీ వర్షాల వల్ల నున్న వద్ద పొంగుతున్న పెదవాగు

ప్రధాన రహదారి పై వరద ఉధృతి కి కొట్టుకుపోయిన కారు

కారు లో ఉన్న సహకార సంఘం అధ్యక్షుడు, టిడిపి గ్రామ అధ్యక్షుడు
శ్రీనివాస రెడ్డి, ఆయన భార్య ను కాపాడిన గ్రామస్థులు

క్షేమంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

సామ్రాజ్య రిసార్ట్  వంతెన కు కోత నిలిచిపోయిన రాకపోకలు

24 Sep 2026 15:47 IST (IST)

ఎన్టీఆర్ జిల్లా

జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తిరువూరు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, వర్షపు నీటి ప్రవాహం, రహదారులు, వాగులు, కాలువలు, చెరువుల పరిస్థితిని పరిశీలించి స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో తక్షణమే నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని, డ్రైనేజీలు, కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. వాగులు, కాలువలు, చెరువులు, కల్వర్టులు, వంతెనల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ప్రమాదకరంగా రాకపోకలు సాగించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, రహదారులు–భవనాలు, విద్యుత్, వైద్య ఆరోగ్య, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. స‌హాయ‌స‌హ‌కారాల‌కు కంట్రోల్ రూమ్ 9154970454లో సంప్ర‌దించాల‌ని సూచించారు

24 Sep 2026 13:07 IST (IST)

రాయలసీమ జిల్లాల్లోని ఏరియా వైజ్ అత్యధిక వర్షపాతం నమోదు అయిన ప్రాంతాల వివరాలు..

శ్రీశైలం (నంద్యాల జిల్లా) 8, జూపాడు బంగ్లా (నంద్యాల జిల్లా) 6, పగిడ్యాల (నంద్యాల జిల్లా) 6, పామిడి (అనంతపురం జిల్లా) 5, ఆత్మకూర్ (నంద్యాల జిల్లా) 4, హొళగుండ (జిల్లా, కర్నూలు (కర్నూలు జిల్లా 4) వైయస్ఆర్ జిల్లా) 3, గుంతకల్ (అనంతపురం జిల్లా) 3, ఓర్వకల్ (కర్నూల్ జిల్లా) 3, సి బెళగల్ (కర్నూల్ జిల్లా) 3, సింహాద్రిపురం (వైఎస్ఆర్ జిల్లా) 3, ఔక్ (నంద్యాల జిల్లా) 2, నందికొట్కూరు (జిల్లా నంద్యాల) 2, తాడపత్రి (జిల్లా, పుత్తూరు, 2) అనంతపురం రుద్రవరం (నంద్యాల జిల్లా) 2, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) 2, పీపల్లి (జిల్లా నంద్యాల) 2, పులివెండ్ల (వైఎస్‌ఆర్ జిల్లా) 2, జమ్మలమడుగు (వైఎస్‌ఆర్ జిల్లా) 2, ప్రొద్దుటూరు (జిల్లా వైఎస్సార్ జిల్లా) 2, వెంకటగిరి (జిల్లా కర్నూలు జిల్లా) 2, వెంకటగిరి (జిల్లా కర్నూలు జిల్లా 1, తిరుపతి) (కర్నూల్ జిల్లా) 1, గోనెగండ్ల (కర్నూలు జిల్లా) 1, చాపాడు (వైఎస్ఆర్ జిల్లా) 1, వేంపల్లె (వైఎస్ఆర్ జిల్లా) 1, నంద్యాల (జిల్లా నంద్యాల) 1, ధోనే (నంద్యాల జిల్లా) 1, యెమ్మిగనూరు (జిల్లా కర్నూలు) 1, గూటిపురం (దూరం) నంద్యాల) 1, కోయిల్‌కుంట్ల (నంద్యాల జిల్లా) 1, తాడిమర్రి (జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా) 1, దేవనకొండ (జిల్లా కర్నూలు) 1, సింగనమల (అనంతపురం జిల్లా) 1, వల్లూరు (వైఎస్‌ఆర్ జిల్లా) 1, ముద్దనూరు (జిల్లా, వైఎస్సార్ జిల్లా) 1 (రాజూరు జిల్లా) వైయస్ఆర్ జిల్లా) 1, కడప (వైఎస్ఆర్ జిల్లా) 1, రాయచోటి (జిల్లా అన్నమయ్య జిల్లా) 1, పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా) 1, లక్కిరెడ్డిపల్లె (జిల్లా అన్నమయ్య జిల్లా) 1, కళ్యాణదృగ్ (జిల్లా అనంతపు జిల్లా)
 

24 Sep 2026 13:07 IST (IST)

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షపాతం వివరాలు..

కోస్తాంధ్ర, యానాంలో ఇప్పటి వరకు పడిన వర్షపాతం వివరాలు..

09/24/2026: విశాఖపట్నం (విశాఖపట్నం జిల్లా) 28, విశాఖపట్నం Ap (విశాఖపట్నం జిల్లా) 20, కొయ్యలగూడెం (జిల్లా ఏలూరు) 16, భీమునిపట్నం (విశాఖపట్నం జిల్లా) 15, కాకినాడ (జిల్లా విశాఖపట్నం) 15, కాకినాడ (15 జిల్లా కాకినాడ) A.p (జిల్లా ఎన్టీఆర్ జిల్లా) 14, గుడివాడ (కృష్ణా జిల్లా) 14, యానాం (యానం జిల్లా) 14, దౌలేశ్వరం (తూర్పు గోదావరి జిల్లా) 13, రణస్థలం (శ్రీకాకుళం జిల్లా) 13, రాజమండ్రి (జిల్లా తూర్పు గోదావరి) 13, తిరువూరు (జిల్లా 1 ఎన్టీఆర్ జిల్లా) 13, అవనిగడ్డ (కృష్ణా జిల్లా) 13, టెక్కలి (శ్రీకాకుళం జిల్లా) 12, అమలాపురం (జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ) 12, చీపురుపల్లె (జిల్లా విజయనగరం) 12, గరివిడి (జిల్లా విజయనగరం) 12, పాతపట్నం (జిల్లా, శ్రీకాకుళం జిల్లా) విజయనగరం) 12, తణుకు (పశ్చిమగోదావరి జిల్లా) 12, చోడవరం (జిల్లా అనకాపల్లి) 11, తెర్లాం (జిల్లా విజయనగరం) 11, పోలవరం (జిల్లా ఏలూరు) 11, నెల్లిమర్ల (జిల్లా విజయనగరం) 11, కైకలూరు (జిల్లా, కడప 11, ప్రకిన్‌పాడు) తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా) 11, పాలకొండ (పార్వతీపురం జిల్లా) 10, పూసపాటిరేగ (జిల్లా విజయనగరం) 10, గజపతినగరం (జిల్లా విజయనగరం) 10, వేపాడ (జిల్లా విజయనగరం) 9, పలాస (జిల్లా పశ్చిమగోదావరి) 9, పలాస (జిల్లా పశ్చిమగోదావరి, 9వ జిల్లా పశ్చిమగోదావరి) గోదావరి) 9, నర్సాపురం (జిల్లా పశ్చిమ గోదావరి) 9, బొండపల్లె (విజయనగరం జిల్లా) 9, లాం (ఎ) (గుంటూరు జిల్లా) 9, బొబ్బిలి (జిల్లా విజయనగరం) 9, మసూలీపట్నం సిడిఆర్ (జిల్లా కృష్ణా) 9, గుంటూరు (గుంటూరు జిల్లా) 9, మందస (శ్రీకాకుళం జిల్లా) 9, బాలాజీపేట (జిల్లా పార్వతీపురం మన్యం) 9, వరరామచంద్రాపూర్ (జిల్లా అల్లూరి సీతారామరాజు) 9, చింతూరు (జిల్లా అల్లూరి సీతారామరాజు) 9, నూజివీడు (జిల్లా ఏలూరు) 8, నందిగామ (జిల్లా) (8 జిల్లా) జిల్లా) 8, అరకులోయ (జిల్లా అల్లూరి సీతారామరాజు) 8, నర్సీపట్నం (జిల్లా అనకాపల్లి) 8, ప్రకాశం బ్యారేజీ (ఎన్టీఆర్ జిల్లా) 8, భీమవరం (జిల్లా పశ్చిమగోదావరి) 8, కూనవరం (జిల్లా అల్లూరి సీతారామరాజు) 8, తెనాలి (జిల్లా అల్లూరి సీతారామరాజు) 8, తెనాలి (జిల్లా, గుంటూరు) చింతపల్లె (జిల్లా అల్లూరి సీతారామరాజు) 8, ఏలూరు (జిల్లా ఏలూరు) 8, మంగళగిరి (గుంటూరు జిల్లా) 8, అనకాపల్లి (జిల్లా అనకాపల్లి) 8, పాడేరు (జిల్లా అల్లూరి సీతారామరాజు) 7, అమరావతి (జిల్లా గుంటూరు) 7, భీమడోలు (జిల్లా 7, బ్రిడ్జి, 7 జిల్లా) అచ్చంపేట (పల్నాడు జిల్లా) 7, విజయనగరం (జిల్లా విజయనగరం) 7, డెంకాడ (జిల్లా విజయనగరం) 7, రేపల్లె (బాపట్ల జిల్లా) 7, ఎలమంచిలి (జిల్లా అనకాపల్లి) 7, వీరఘట్టం (జిల్లా పార్వతీపురం మన్యం) 6, చింతలపూడి (6వ జిల్లా, చింతలపూడి) కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా) 6, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) 6, మెంటాడ (జిల్లా విజయనగరం) 5, సత్తెనపల్లె (జిల్లా పల్నాడు) 5, రాచర్ల (ప్రకాశం జిల్లా) 5, సోంపేట (శ్రీకాకుళం జిల్లా) 4, సాలూరు (పార్వతీపురం జిల్లా) 4, పార్వతీపురం (పార్వతీపురం జిల్లా) 4, గరుగుబిల్లి (పార్వతీపురం మన్యం జిల్లా) 4, జంగమహేశ్వరపురం (పల్నాడు జిల్లా) 3, కంబం (ప్రకాశం జిల్లా) 3, మార్కాపూర్ (ప్రకాశం జిల్లా) 3, అర్ధవేదిక, ప్రకాశమేడు ప్రకాశం) 3, దర్శి (ప్రకాశం జిల్లా) 3, సీతానగరం (జిల్లా పార్వతీపురం మన్యం) 3, బాపట్ల (బాపట్ల జిల్లా) 3, పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) 2, బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా) 2, జియ్యమ్మ వలస (జిల్లా పార్వతీపురం, మన్యండమ్మ 2) చీమకుర్తి (ప్రకాశం జిల్లా) 2, కురుపాం (పార్వతీపురం జిల్లా) 2, అద్దంకి (బాపట్ల జిల్లా) 2, మర్రిపూడి (ప్రకాశం జిల్లా) 2, ఒంగోలు (ప్రకాశం జిల్లా) 2, యర్రగొండపాలెం (జిల్లా ప్రకాశం) 2, కరంచెడు (జిల్లా, ప్రకాశం జిల్లా) (1 జిల్లా, ప్రకాశం) మాచర్ల (పల్నాడు జిల్లా) 1, కందుకూరు (జిల్లా Spsr నెల్లూరు) 1, సంతమాగులూరు (జిల్లా బాపట్ల) 1, సీతారామపురం (జిల్లా Spsr నెల్లూరు) 1

24 Sep 2026 12:40 IST (IST)

విశాఖ జిల్లా అధికారులతో మంత్రి డిఎస్ బీవీ స్వామి టెలి కాన్ఫరెన్స్

వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి

ముంపు కాలనీల్లో సహాయక చర్యల పట్ల అధికారులు, సిబ్బందిని అభినందించిన మంత్రి స్వామి

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్న మంత్రి  

వర్షాలు తగ్గేవరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా అండగా అండగా ఉంటుంది

మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

24 Sep 2026 12:40 IST (IST)

అమరావతి: చంద్రబాబు సమీక్ష

అమరావతి: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి టెలీకాన్ఫరెన్స్

- టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ

•    నేడు, రేపు కూడా వర్షాలు కురవనున్నాయనేది అంచనా... వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి

•    వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలి

•    నీటి ఉధృతితో రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిన చోట వెంటనే పునరుద్ధరించాలి

•    వర్షానికి కొండ చరియలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయండి.. అవసరమైతే తరలించండి

•    విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కనిపించకూడదు

•    కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలి

•    చెరువులు నింపడంపై ఫోకస్ పెట్టడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టండి. క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సాయం కోరినా వెంటనే స్పందించాలి

•    ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలి

•    పలు ప్రాంతాల్లో భారీ గాలులు వీచడంతో విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించి రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలి

•    వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి

24 Sep 2026 11:37 IST (IST)

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..

వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు...

కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా...

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు వాయిదా వేసిన అధికారులు...

మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు...

పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మూడు జిల్లాల కలెక్టర్లు

24 Sep 2026 11:36 IST (IST)

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం..!

ప్రతికూల వాతావరణంతో పలు విమానాల దారి మళ్లింపు.

విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన 'ఇండిగో' విమానం శంషాబాద్‌కు దారిమళ్లింపు.

శంషాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన 'స్టార్ ఎయిర్‌లైన్స్' విమానం బెంగళూరుకు దారిమళ్లింపు.

24 Sep 2026 11:34 IST (IST)

భారీ వర్షాలపై 'సీఎం చంద్రబాబు' టెలీకాన్ఫరెన్స్..!

వర్షాలు తగ్గే వరకు జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటించాలి.

ప్రజలకు నీరు, ఆహారం, వైద్యం, విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలి.

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను ఒడ్డుకు రప్పించాలి.

: సీఎం చంద్రబాబు

24 Sep 2026 11:34 IST (IST)

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం, గాలులు బీభత్సం..!

శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర మండలాల్లో వర్షం.

నాగావళి, బహుదా నదిలో పెరుగుతున్న ప్రవాహం

24 Sep 2026 11:34 IST (IST)

విశాఖ నగరంలో భారీ వర్షం..!

విశాఖలో 24 గంటల్లో సగటున 20.2 సెంటీమీటర్లు వర్షపాతం.

విశాఖ నగరం మహారాణిపేటలో అత్యధికంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం.

జీవీఎంసీ పరిధిలో నేలకూలిన 48 చెట్లు, తొలగించిన అధికారులు.

రిజర్వాయర్లకు ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
AP Weather
Weather Update
AP News
Telangana News

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Red Alert Issue by IMD: బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరాల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీకి రావాల్సిన పలు విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణంగా పలు విమానాలను రద్దు చేశారు.  ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయ నగరం, మన్యం పార్వతి పురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తూర్పు గోదావరిలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.  మరోవైపు తెలంగాణలో  ఈ రోజు కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో అధికారులను అప్రమత్తం చేశారు. అటు తెలంగాణలో కూడా అన్ని ప్రభుత్వ కీలక శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు ఆహార పొట్లాలు అందించే ఏర్పాట్లు చేస్తోంది.