)
అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత హోప్ దంచి కొడుతున్నాడు. పావెల్‌తో కలిసి దూకుడుగా ఆడుతుండడంతో 13 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 156 పరుగులు చేసింది. మూడు ఓవర్లలోనే భారీగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఒక వికెట్ తీశాడు.
12 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 150 పరుగుల మార్క్‌ను దాటింది. హోప్ దూకుడు ఆటకు పావెల్ చక్కగా సహకరిస్తూ ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కూడా విండీస్ ఆటగాళ్లు దంచికొట్టారు. ఫలితంగా 12 ఓవర్లు పూర్తయ్యాక 152 పరుగులు పూర్తి చేసుకుంది.
విరామం వెస్టిండీస్ ఆటగాళ్లు దూకుడు పెంచి 11వ ఓవర్లో 11 పరుగులు రాబట్టారు. 28 బంతుల్లో హోప్ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. పావెల్‌తో కలిసి హోప్ భారీ ఇన్నింగ్స్ దిశగా ఆడుతున్నాడు.
10వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ వెస్టిండీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. వికెట్ కోల్పోయిన అనంతరం హోప్, పావెల్ పొదుపుగా ఆడారు. ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లు బ్యాట్ ఝుళిపించేందుకు జంకారు. 10 ఓవర్లు పూర్తయిన తర్వాత వెస్టిండీస్ స్కోర్ 118/2.
ఉప్పల్ స్టేడియంలో దూకుడుగా ఆడుతున్న వెస్టిండీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల వరద పారిస్తున్న విధ్వంసకర బ్యాటర్లు హోప్, హెట్మెయిర్ జోడీకి మయాంక్ అగర్వాల్ బ్రేక్ వేశాడు. 9వ ఓవర్ రెండో బంతి వేసిన మయాంక్ హెట్మెయిర్ బాదిన షాట్‌ను అద్భుతంగా క్యాచ్ పట్టి వెనక్కి పంపించాడు. 12 బంతుల్లో 33 పరుగులు చేసి హెట్మెయిర్ వెనుదిరిగాడు. 9 ఓవర్లు పూర్తయ్యాక వెస్టిండీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
హైదరాబాద్ గడ్డపై భారత్‌కు వెస్టిండీస్ ఆటగాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. 8 ఓవర్లు పూర్తి చేసుకునేవరకు సెంచరీ మార్క్ దాటింది. విధ్వంసకర బ్యాటర్లు హోప్, హెట్మెయిర్ మైదానంలో పాతుకుపోయి బ్యాట్‌తో విజృంభిస్తున్నారు.
ఏడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ కూడా భారీగా సమర్పించుకున్నాడు. హోప్, హెట్మెయిర్ కలిసి 21 పరుగులు రాబట్టారు. ఉప్పల్ స్టేడియంలో విండీస్ భారీగా పరుగులు సాధిస్తూ భారత్‌కు చుక్కలు చూపిస్తున్నారు. విండీస్ బ్యాటర్ల దూకుడుకు భారత బౌలర్లు తేలిపోతున్నారు.
ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారుతోంది. భారత్ బౌలింగ్‌ను చక్కగా వినియోగించుకుని భారీ పరుగుల దిశగా విండీస్ ఆడుతోంది. అర్ష్‌దీప్ సింగ్ మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆరో ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి.
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. నాలుగు ఓవర్లు ముగిసిన అనంతరం బౌలింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ బంతితో మాయ చేసి జెవెల్ ఆండ్రే (21)ను ఔట్ చేశాడు. హోప్‌తో కలిసి హెట్మెయిర్ క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లు ముగిసేరికి వెస్టిండీస్ స్కోర్ 60/1.
IND vs WI 4th T20I Live Updates...
హైదరాబాద్ గడ్డపై వెస్టిండీస్ ఆటగాళ్లు దంచికొడుతున్నారు. నాలుగు ఓవర్లు పూర్తవగానే అర్ధ శతకాన్ని పూర్తి చేసింది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఓపెనర్లు హోప్ (20), ఆండ్రే (21) చితక్కొడుతున్నారు. వికెట్ కోసం భారత బౌలర్లు కష్టపడుతున్నారు.
IND vs WI Live Updates:
మూడో ఓవర్ మయాంక్ అగర్వాల్ వేయగా.. విండీస్ ప్లేయర్లు దూకుడుగా ఆడి 20 పరుగులు రాబట్టారు. ఓపెనర్లుగా దిగిన హోప్, ఆండ్రే దంచికొడుతున్నారు. మూడు ఓవర్లు ముగిశాక విండీస్ స్కోర్ 40/0
IND vs WI Live Updates... రెండో ఓవర్‌కు భారీగా పరుగులు చేసిన కరీబియన్లు. అర్షదీప్ దీప్ సింగ్ బౌలింగ్‌లో ఆండ్రే చితకబాదాడు. ఒక ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా రెండో ఓవర్ ముగిసేసరికి వెస్టిండీస్ స్కోర్ 20/0 పరుగులకు చేరింది.
బ్యాటింగ్ షురూ..
IND vs WI Live Updates: సిరీస్‌ను సమం చేయాలనే కసితో కరీబియన్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగగా.. శాయ్ హోప్, జెవెల్ ఆండ్రే ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. భారత్ తరఫున మయాంక్ అగర్వాల్ తొలి ఓవర్ వేశాడు. తొలి ఓవర్ పూర్తి చేసేసరికి 3 పరుగులు చేశారు.
India vs West Indies 4th T20I Live Updates: ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో హైదరాబాద్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్ జరుగుతోంది. 2-1 ఆధిక్యంతో ఉన్న భారత్ ఉప్పల్ స్టేడియం వేదికగా విండీస్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ను నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలో దిగుతోంది. ఉప్పల్‌లో ఊచకోత కోసి మ్యాచ్‌ను సొంతం చేసుకుని సిరీస్ సమం చేయాలని కరీబియన్ ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్ నమోదు చేసేందుకు బరిలో దిగారు. అశేషంగా పాల్గొన్న హైదరాబాద్ ప్రేక్షకుల మధ్య రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టాస్ వేయగా.. టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్‌కు దిగనుంది. మరి అత్యంత ఆసక్తికర మ్యాచ్‌కు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోండి.