రేపు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్తున్నారా? ఈ శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా? కస్టమర్లు ఇవి గమనించండి!
రేపు బ్యాంక్ పనిపై మీ బ్రాంచ్‌లకు వెళ్తున్నారా? అయితే, శుక్రవారం నవంబర్ 13 ఏ బ్యాంకు బ్రాంచీలు పనిచేయడం లేదు తెలుసా? ఆర్‌బీఐ ప్రకారం ఈ సెలవు వర్తిస్తుంది. ప్రధానంగా ఈ సెలవు ఎక్కడ? ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bank Holiday News: ఏవైనా పెద్ద డిపాజిట్స్, చెక్స్, విత్‌డ్రాయల్స చేయాలంటే మాత్రం కచ్చితంగా బ్యాంక్ బ్రాంచీలకు వెళ్లాల్సిందే. అయితే, మీ బ్యాంకు బ్రాంచీ పనిచేస్తుందా? లేదా? అని చెక్ చేసుకుని వెళ్లాలి. లేకపోతే ఇబ్బందులు పడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం కొన్ని సెలవులు వర్తిస్తాయి. కొన్ని స్థానిక పండుగలు మాత్రమే కాదు.. రెండో, నాలుగో శనివారాలు, ప్రతి ఆదివారాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకు బ్రాంచీలు పనిచేయవు. ఇది ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. అయితే, రేపు నవంబర్ 13వ తేదీ శుక్రవారం ఏ బ్యాంక్ బ్రాంచీలు బంద్ ఉంటాయి.
నవంబర్ 13వ తేదీ శుక్రవారం మేఘాలయాలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు బంద్‌ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాం్, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. మేఘాలయాలో శుక్రవారం వంగల ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
వంగల పండుగ అంటే మేఘాలయ రాష్ట్రంలో ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఇక్కడ పంట చేతికి వస్తుంది. దీంతో గారో కమ్యూనిటీ ప్రజలు ఈ వేడుక చేస్తారు. దీన్ని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఇది గారో ప్రజల పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. ఇది ఒక వ్యవసాయ సాంప్రదాయబద్ధమైన పండుగ. పంట చేతికి వచ్చినందుకు సూర్య దేవుడికి కృతజ్ఞతగా నిర్వహించే వేడుక
ఈ వంగల ఫెస్టివల్ గారో హిల్స్ ప్రాంతాల్లో జరుపుకొంటారు. రాగులతో వేడుక ప్రారంభం అవుతుంది. గ్రామ పెద్ద ఇంట పూజలు చేస్తారు. గ్రామస్థులు కూడా పెద్ద ఎత్తున ఈ వేడకకు రంగురంగుల దుస్తులు ధరించి వస్తార. ప్రధానంగా తమ సంప్రదాయ దుస్తులు తల నుంచి కాళ్ల వరకు ధరిస్తారు. డ్రమ్ములు వాయిస్తూ ఫోక్ డ్యాన్స్ చేస్తారు.
Read Also: నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్?పూర్తి లిస్ట్ ఇదే!
Read Also: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?
కేవలం మేఘాలయాలోనే ఈ బ్యాంకులు బంద్ ఉంటాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్ హరియాణ, సిక్కిం, మణిపూర్, వెస్ట్ బెంగాళ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా యథావిధిగా పనిచేస్తాయి.
నవంబర్ 14 రెండో శనివారం బ్యాంకు బంద్ ఉంటాయి. ఆ మరుసటి రోజు 15 ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు పనిచేయవవు. ఇక నవంబర్ 16వ తేదీ ఛత్ పూజ సందర్భంగా బిహార్, జార్ఖంఢ్ ప్రాంతాల్లో బంద్ ఉంటాయి. ఇక్కడ సూర్యుడు, ఛతీకి పూజలు చేస్తారు. నవంబర్ 20 ఉత్తరాఖండ్‌లో బంద ఇక్కడ ఇగస్ బగ్వాల్ ఉంది. ఇది ఒక లోకల్ ఫెస్టివల్. నవంబర్ 23వ తేదీ సెంగ్ కుట్ స్నెమ్ ఫెస్టివల్ ఉంది. మేఘాలయాలో మాత్రమే బ్యాంకులు బంద్ ఉంటాయి. నవంబర్ 24వ తేదీ ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్యాంకులు బంద్ ఉంటాయి.