SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bengal Encounter: బెంగాల్‌లో మరో సంచలనం.. మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్‌కౌంటర్‌..!

Bengal Encounter: పశ్చిమ బెంగాల్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సోమవారం అర్ధరాత్రి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడిని ఘటన స్థలానికి తీసుకువెళ్లగా చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 27, 2026, 11:48 AM IST | Updated: Oct 27, 2026, 11:51 AM IST
Image Credit: Bengal Encounter
Join

Bengal Encounter: పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో అరెస్టయిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లగా.. ఆ సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నార్త్ 24 పరగణాల జిల్లా గైఘాటా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లిన 17 ఏళ్ల బాలిక అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఒక ఫోన్ కాల్ రావడంతో ఆమె కార్యక్రమం వద్ద నుంచి బయటకు వెళ్లిందని.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని విచారణలో తేలింది. రాత్రంతా కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బంధువుల ఇంటి సమీపంలో బాలిక అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉంది. ఆమెపై లైంగిక దాడి చేసి.. హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం గాలించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే క్రైమ్ జరిగిన తీరును తెలుసుకునేందుకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ ‌కోసం నిందితుడిని సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడిని ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసుల వద్ద ఉన్న తుపాకీ లాక్కుని.. వారిపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీసుల బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన నిందితుడిని వెంటనే చాంద్‌పారా రూరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి తరహా ఎన్‌కౌంటర్ గత మూడు నెలల్లో ఇది రెండోసారి. గత జులై నెలలో సౌత్ 24 పరగణాల జిల్లా పరిధిలోని బారూయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ కూడా క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసుల రివాల్వర్ లాక్కొని కాల్పులు జరపగా.. ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఇప్పుడు గైఘాటా ఘటనలోనూ దాదాపు అదే తరహాలో నిందితుడు మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నిందితుడి మృతి సమాచారం తెలియడంతో స్థానిక ప్రజలు, బాధిత కుటుంబీకులు ఆసుపత్రి పరిసరాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES