SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dating App Scam: పిల్ల పిలిచిందని ఆశతో వెళితే.. రూమ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌కు షాక్..!

Dating App Scam: డేటింగ్ యాప్‌లో అమ్మాయి పిలిచిందని ఆశగా ఫ్లాట్‌కు వెళ్లిన యువకుడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తీరా వెళ్లాక అసలు రూపం చూసి షాక్‌కు గురయ్యాడు. అతడిని కత్తితో బెదిరించి బంగారం లూటీ చేసి కేటుగాళ్లు మాయం అయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 30, 2026, 06:37 PM IST | Updated: Oct 30, 2026, 06:40 PM IST
Image Credit: Dating App Scam (Source: AI)
Join

Dating App Scam: ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌లో అమ్మాయి పరిచయం అయింది. మెసేజ్‌లు, కాల్స్ మాట్లాడుకున్నారు. మరో స్టెప్ ముందుకు వెద్దామని యువతి తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచింది. ఇక యువతి రూమ్‌కు పిలవగానే అతను ఎగిరి గంతేశాడు. ఎంజాయ్ చేద్దామని బాగా రెడీ అయి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత గానీ మనోడికి అసలు ట్విస్ట్ తెలియలేదు. ఎదురుగా ఉన్న ఆమె ముఖానికి మాస్క్ తీసి మాట్లాడేసరికి అతని కాళ్ల కింద భూమి కంపించినంత పనైంది. డేటింగ్ యాప్‌లో తనతో ఇన్నాళ్లూ చాట్ చేసింది అమ్మాయి కాదు.. ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిసి బిత్తరపోయాడు. ట్రాన్స్‌జెండర్‌తోపాటు మరో వ్యక్తి కలిసి అతడిని బెదిరించి.. బంగారం దోచుకున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లలో అమ్మాయిల ప్రొఫైల్స్ చూసి మురిసిపోయే యువకులకు కళ్లు తెరిపించే షాకింగ్ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది.  

బెంగళూరు నగరంలో నాగరాభవిలోని ఒక వ్యక్తిని కత్తితో బెదిరించి.. దాదాపు 226 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించిన ఘటనలో చంద్ర లేఅవుట్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి ఓ డేటింగ్ యాప్‌లో అందమైన అమ్మాయి ప్రొఫైల్ కనిపించింది. ఇంకేముంది వెంటనే లైక్ కొట్టడం, అటు నుంచి రిప్లై రావడంతో ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. మెసేజ్‌లు, చాటింగ్‌లు తరువాత తన రూమ్‌కు రావాలని బాధితుడిని అమ్మాయి పిలిచింది.

సరదాగా ఎంజాయ్ చేద్దామని.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా డేట్ ప్లాన్ చేసుకుని, బాగా రెడీ అయి ఊహల్లో విహరిస్తూ చెప్పిన లొకేషన్‌కు చేరుకున్నాడు. తీరా ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టి లోపలికి అడుగుపెట్టిన తర్వాత మనోడికి సినిమా కనిపించింది. ఆ భయం నుంచి బయటపడి అక్కడి నుంచి జారుకుందామని చూసేలోపే సీన్ మొత్తం మారిపోయింది. అమ్మాయి మాస్క్ తీయగా ట్రాన్స్‌జెండర్ అని తెలిసి షాక్‌కు గురయ్యాడు. అంతేకాదు పక్క గదిలోంచి మరొక వ్యక్తి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇద్దరూ కలిసి తలుపులు గడియపెట్టి.. క్షణాల్లోనే జేబులోంచి పదునైన కత్తిని తీసి బాధితుడి గొంతుపై పెట్టారు. ఏమాత్రం అరచినా.. ఎదురుతిరిగినా ప్రాణాలు తీస్తామని గట్టిగా హెచ్చరించారు. భయంతో బిగుసుకుపోయిన బాధితుడిని బంధించి.. అతని వద్ద దాదాపు 226 గ్రాముల బంగారు ఆభరణాలను లూటీ చేశారు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యారు. బాధితుడు లబోదిబోమంటూ చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులు నాజియా, సయ్యద్ మౌషిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేసే పనిలో పడ్డారు. డేటింగ్ యాప్‌లలో అమ్మాయిల ముసుగులో వల విసిరే ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES