SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BJP అగ్ర నేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత..

LK Advani Hospitalised: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, ఆ పార్టీ వ్యవస్థాగత సభ్యుడై ఎల్.కె. అద్వాణీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో వెంటనే ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.అద్వానీ వయస్సు ప్రస్తుతం 98 ఏళ్ళు. వయో సంబంధిత సమస్యలతో పాటు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి తరలించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 17, 2026, 09:18 AM IST | Updated: Oct 17, 2026, 09:21 AM IST
Image Credit: LK Advani Hospitalised
Join

LK Advani Health Update: బీజేపీ సీనియర్ నేత.. మాజీ ఉప ప్రధాని అయిన లాల్ కృష్ణ అద్వానీ గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఈయనకు ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.  
పల్మనరీ విభాగంలో సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేశాయి.

అద్వాణీ కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా వచ్చే  సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ వల్ల తీవ్రమైన అసౌకర్యం కలగడంతో కుటుంబసభ్యులు వెంటనే స్పందించి అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలోని సీనియర్ వైద్య నిపుణులు ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

రక్త పరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే తదితర సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించినట్లు సమాచారం. వైద్య చికిత్సలకు ఆయన శరీరం సానుకూలంగా స్పందిస్తోందని, నిలకడగా కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొన్నారు.

బాంబే ప్రెసిడెన్సీలో (ప్రస్తుతం పాకిస్థాన్) జననం..
అద్వానీ విషయానికొస్తే.. ఈయన స్వాతంత్య్రనానికి పూర్వం బాంబే ప్రెసిడెన్సీలో భాగమైన కరాచీలో కరాచీలో 1927లో నవంబర్ 8న జన్మించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది. స్వాతంత్య్రం తర్వాత వారి కుటుంబం గుజరాత్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్‌లో చేరిక ఆయన జీవితాన్నే మార్చేసింది. స్వయం సేవకుడి ఉంటూనే 1951లో రాజకీయాల్లో ప్రవేశించారు. జనసంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1977లో జన సంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహించారు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపక సభ్యుల్లో ఈయన ఒకరు. అద్వానీ, వాజ్‌పేయ్, మురళీ మనోహర్ జోషి, విజయరాజే సింథియా, బైరాన్ సింగ్ షెకావత్‌లు స్థాపించారు.

2024లో భారతరత్న..
ఆ తర్వాత బీజేపీ అంచలంచెలుగా ఎదడంలో అద్వానీ కీ రోల్ పోషించారు. 1991లో అయోధ్య రథ యాత్ర దేశ రాజకీయానే మార్చేసింది. ఆ తర్వాత 1996లో కేంద్రంలో బీజేపీ సంకీర్ణంగా అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో ఎలాంటి మంత్రిపదవి తీసుకోలేదు. ఆ తర్వాత 1998లో జరిగిన ఎలక్షన్స్ తర్వాత అద్వానీ.. వాజ్ పేయ్ ప్రభుత్వంలో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1999లో వాజ్‌పేయ్ ప్రభుత్వంలో హోం మంత్రిగా.. ఆపై ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2004, 2009లో ప్రధాని అభ్యర్ధిగా అద్వానీ పేరుతో ఎన్నికలకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ రెండు సార్లు ఓటమి చవిచూసింది. దీంతో 2014లో ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిగా ఎన్నికలు వెళ్లి పార్టీ గెలిచింది. 2015 కేంద్రం ఈయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవిస్తే.. 2024లో భారతరత్నతో సత్కరించింది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీకి ఎల్.కే.అద్వానీ రాజకీయ గురువు. ఇక ప్రధాని కావాలన్న ఆయన కల.. కలగానే మిగిలిపోయినా.. నేడు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే.. ఆయన వేసిన పునాదులపైనే ఆ పార్టీ నిలబడిందని చెప్పాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES